E-Paper
Advertisement

Super Moon: ఆకాశంలో అద్భుతం.. సూపర్‌గా సూపర్‌మూన్‌..

Super Moon: ఆకాశంలో అద్భుతం.. సూపర్‌గా సూపర్‌మూన్‌..
Advertisement
super moon

Super Moon: ఓసారి బయటకు వచ్చి చూడండి. ఆకాశంలో అద్భుతం ఆవిష్క‌ృతమైంది. నిండు చంద్రుడు కనువిందు చేస్తున్నాడు. చంద్రుడేగా అని లైట్ తీసుకోకండి. నేటి చంద్రుడు.. భూమికి దగ్గరగా వచ్చిన పూర్ణ చంద్రుడు. పున్నమి వెలుగులు చిందిస్తున్న.. అరుదుగా ఏర్పడే సూపర్‌మూన్.

అవును, సోమవారం రాత్రి నింగిలో సూపర్‌మూన్ ఏర్పడింది. రోజూ కనిపించే చంద్రుడి కంటే.. 14 శాతం పెద్దగా ఉన్నాడీ చంద్రమామ. వెలుగులోనూ 30శాతం అధిక ప్రకాశవంతంగా దర్శనమిచ్చాడు. అందుకే, ఈరాత్రి అంతా దట్టమైన పున్నమి వెలుగులే.

Advertisement

ఈ ఏడాదిలో ఇదే ఫస్ట్ సూపర్‌మూన్. ఏడాదిలో డజన్ సార్లు సూపర్‌మూన్‌లు ఫామ్ అవుతాయి. కానీ, ఈసారి ఇంకోటి బోనస్. 2023లో మొత్తం 13 సూపర్‌మూన్‌లు వస్తాయి. అందులో ఇదే నెంబర్ వన్. ఆగస్టులో మరో రెండు పూర్ణచంద్రులని చూడొచ్చు.

చంద్రుడు భూమి చుట్టూ తిరుగుతూ.. భూమికి అత్యంత సమీపంలోని వచ్చే స్థానమే (పెరీజీ) సూపర్‌మూన్. మామూలు రోజుల్లో భూమికి 3,84,400 కి.మీ దూరంలో ఉండే చంద్రుడు.. సూపర్‌మూన్ రోజున 3,61,934 కి.మీ దగ్గరగా వస్తాడు. భూమికి సమీపంలో.. ప్రకాశవంతమైన వెలుగులతో.. కనువిందు చేస్తాడు. ఆ రోజు ఈ రోజే. ఓసారి బయటకు వచ్చి.. తలెత్తి.. ఆకాశంలో సూపర్‌మూన్‌గా ఉన్న పున్నమి చంద్రుడిని ఎంజాయ్ చేసేయండి.

Related News

ప్రధాని మోడీ ఇంటి ముట్టడికి కేజ్రీవాల్ బిగ్ స్కెచ్.. E20 పెట్రోల్‌పై కేజ్రీవాల్ సమరం

బీహార్‌లో బీజేపీకి బిగ్ షాక్.. భారీ మెజారిటీతో ప్రశాంత్ కిషోర్ గెలుపు

పెళ్లే కానక్కర్లేదు.. సహజీవనానికి ఆ చట్టం వర్తిస్తుంది.. సుప్రీంకోర్టు సంచలనం

సుప్రీం కోర్టులో జడ్జీల సంఖ్య పెంపు.. లోక్‌సభలో బిల్లు ఆమోదం!

ఇంజనీరింగ్ అభ్యర్థులకు గుడ్ న్యూస్..ఎయిర్‌పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియాలో ఉద్యోగాలు

డిగ్రీ అర్హతతో 11,403 క్లర్క్ పోస్టులు.. పూర్తి వివరాలివే !

కేరళలో విరిగిపడ్డ కొండచరియలు.. ‘బిగ్ టీవీ’ ప్రతినిధులకు తప్పిన పెను ప్రమాదం

నిరసనలకు జంతర్ మంతర్ గుడ్ బై? కొత్త వేదిక ఎక్కడ, సుప్రీంకోర్టులో పిటిషన్

Big Stories

Advertisement
×