// // Chahal Missing Tournament : చాహల్‌ పెద్ద టోర్నమెంట్లను మిస్ అవుతున్నాడు - Staging.BigTvLive -->
E-Paper
Advertisement

Chahal Missing Tournament : చాహల్‌ పెద్ద టోర్నమెంట్లను మిస్ అవుతున్నాడు

Chahal Missing Tournament : చాహల్‌ పెద్ద టోర్నమెంట్లను మిస్ అవుతున్నాడు
Advertisement
Chahal Missing Tournament

Chahal Missing Tournament : ప్రస్తుతం టీమిండియాలో ఉన్న యంగ్ క్రికెటర్ల విషయంలో మాజీ క్రికెటర్ల అభిప్రాయాలు చాలా వేరుగా ఉన్నాయి. ఒక సీనియర్ క్రికెటర్ ఒక యంగ్ క్రికెటర్‌ను సపోర్ట్ చేస్తే.. తనకంటే మరో యంగ్ క్రికెటర్ బెటర్ అంటూ మరో సీనియర్ క్రికెటర్ వాదిస్తున్నారు. దీంతో క్రికెటర్ల మధ్య విభేదాలు పెరుగుతున్నాయని ఫ్యాన్స్ కూడా అర్థం చేసుకున్నారు. తాజాగా సౌరవ్ గంగూలీ.. ఒక యంగ్ క్రికెటర్‌ను ప్రశంసిస్తూ కామెంట్ చేశాడు.

Advertisement

యుజ్వేంద్ర చాహల్.. టీమిండియాలో సత్తా ఉన్న ఆటగాడిగా ఇప్పటికే గుర్తింపు తెచ్చుకున్నాడు. మంచి క్రికెటర్ మాత్రమే కాదు.. తను మంచి ఎంటర్‌టైనర్ అని కూడా ఫ్యాన్స్ అంటుంటారు. తన స్పిన్నింగ్‌తో ఇప్పటికే తన పేరుపై పలు రికార్డులు సాధించుకున్న చాహల్.. టీమిండియాలో తన స్థానాన్ని మాత్రం నిలదొక్కుకోలేకపోతున్నాడు. గత కొన్నేళ్లలో చాహల్.. సక్సెస్‌ఫుల్ స్పిన్నర్‌గా పేరు తెచ్చుకున్నాడు. అందుకే టీమిండియా ఆడనున్న అప్‌కమింగ్ వరల్డ్ కప్‌లో చాహల్ ఉంటే బాగుంటుందని పలువురు క్రికెట్ ప్రముఖులు, సీనియర్ ఆటగాళ్లు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

తాజాగా సౌరవ్ గంగూలీ మీడియాతో మాట్లాడుతూ.. యుజ్వేంద్ర చాహల్ టీమిండియాకు పెద్ద అసెట్ అవ్వగలడు. మెన్ ఇన్ బ్లూలో ఫింగర్ స్పిన్నర్స్ ఉన్నా కూడా చాహల్ లాంటి రిస్ట్ స్పిన్నర్ ఉండడం కూడా చాలా ముఖ్యమంటూ చాహల్‌ను సపోర్ట్ చేస్తూ వ్యాఖ్యలు చేశాడు. వరల్డ్ కప్‌ కోసం కచ్చితంగా టీమిండియాలో రిస్ట్ స్పిన్నర్ ఉండాలి. జడేజా, రవిచంద్రన్ అశ్విన్, అక్సర్ పటేల్ లాంటి ఆల్ రౌండర్స్‌తో పాటు వారు కూడా అవసరమే అని అన్నాడు.

Advertisement

అసలు పెద్ద పెద్ద ఐసీసీ ఈవెంట్స్‌ను చాహల్ ఎలా మిస్ అవుతున్నాడో అర్థం కావడం లేదంటూ గంగూలీ ఆశ్చర్యం వ్యక్తం చేశాడు. రవి బిష్నోయ్, కుల్దీప్ యాదవ్ లాంటి వారు ఉంటున్నారు కానీ చాహల్ లాంటి ఆటగాడు ఐసీసీలో ఎందుకు ఉండడం లేదో అర్థం కావడం లేదన్నాడు. చిన్న ఫార్మాట్స్‌లో ఇప్పటికే తన సత్తా చాటుకున్నాడు కాబట్టి 20 ఓవర్ ఫార్మాట్ అయినా, 50 ఓవర్ ఫార్మాట్ అయినా చాహల్‌ను పరిగణించడం మంచిదన్నాడు. ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్, సౌతాఫ్రికా లాంటి దేశాలతో పోటీపడినప్పుడు రిస్ట్ స్పిన్నర్ అవసరం చాలా ఉంటుందని తెలిపారు. 2011లో పియూష్ చావ్లా అద్భుతంగా బౌలింగ్ చేశాడంటూ గుర్తుచేసుకున్నాడు.

Related News

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

ఇద్దరు ప్రయాణికులకు ‘ఒకటే దుప్పటి’.. రైల్వేపై కన్జ్యూమర్ కోర్టు ఆగ్రహం.. భారీ జరిమానా విధింపు!

ప్రెగ్నెన్సీలో.. ఎలాంటి మందులు వాడకూడదో తెలుసా ?

యాక్టివ్ నోయిస్ క్యాన్సిలేషన్, ఫాస్ట్ ఛార్జింగ్! మార్కెట్‌లో వన్‌ప్లస్ బడ్స్ రచ్చ

బళ్లారి–గుంతకల్ రూట్‌లో 3, 4వ రైల్వే లైన్లు..  కేంద్ర కేబినెట్ గ్రీన్ సిగ్నల్!

ఎయిర్ ఫ్రైయర్ కొనాలా? వద్దా? ఆరోగ్యానికి నిజంగానే మంచిదా.. లేక మార్కెటింగ్ జిమిక్కా?

సీఎం ఆదేశాలతో ‘జలసిరి’కి శ్రీకారం.. ప్రతి నీటి బొట్టును ఒడిసి పడతాం.. మంత్రి సీతక్క

మస్క్, బెజోస్‌కు షాక్.. జియో శాటిలైట్స్‌కు గ్రీన్ సిగ్నల్.. ఇక నింగిలోనూ అంబానీ హవా!

Big Stories

Advertisement
×