E-Paper
Advertisement

మోదీ ప్రభుత్వం వారిని శత్రువులుగా చూస్తోంది.. పోలీసు చర్యలను ఖండించిన సోనియాగాంధీ

మోదీ ప్రభుత్వం వారిని శత్రువులుగా చూస్తోంది..  పోలీసు చర్యలను ఖండించిన సోనియాగాంధీ
Advertisement

Sonia Gandhi On Modi Govt: దేశవ్యాప్తంగా నీట్ పేపర్ లీకేజీ వ్యవహారంపై ఆందోళనలు చేస్తున్నారు విద్యార్థులు. నిరసనకారులు చేస్తున్న ఉద్యమంపై ప్రభుత్వ చర్యలను తప్పుబట్టారు కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షురాలు సోనియాగాంధీ. విద్యార్థులను దేశ శత్రువుల్లా కేంద్రం చూస్తోందని దుయ్యబట్టారు. జవాబుదారీ తనంతో చెప్పాల్సింది పోయి లాఠీచార్జీలు, బాష్పవాయువు ప్రయోగంతో అణచి వేస్తారా అంటూ ఘాటుగా విమర్శించారు.

నీట్ వ్యవహారంపై నోరువిప్పిన సోనియా-నేషనల్ పేపర్ ది హిందూలో కాంగ్రెస్ పార్టీ అగ్రనేత సోనియా గాంధీ ఓ వ్యాసం రాశారు. ‘విద్యా వ్యవస్థ పతనం-యంగ్ ఇండియాకు గాయం’ అనే శీర్షికతో విశ్లేషణాత్మకంగా రాసుకొచ్చారు. అందులో వివిధ అంశాలపై కేంద్రం వ్యవహరిస్తున్న తీరును తప్పుబట్టారు. మోదీ ప్రభుత్వం చర్చలకు బదులుగా హింసను ప్రయోగిస్తుందని, రైతుల నుండి కార్యకర్తల వరకు ఈ ధోరణి స్పష్టంగా కనిపిస్తోందన్నారు.

Advertisement

నిరసనకారులను శత్రువులుగా చూస్తోంది- మోదీ ప్రభుత్వం దేశ విద్యా రంగాన్ని దిగజార్చడమే కాకుండా, స్వీయ భ్రమలు, తీవ్రమైన సున్నితత్వం లేకుండా వ్యవహరించడాన్ని అలవాటుగా మార్చుకుందని పేర్కొన్నారు. విద్యార్థులకు అండగా నిలబడి, వారి భవిష్యత్తును కాపాడటం మన నైతిక-రాజకీయ-రాజ్యాంగపరమైన కర్తవ్యమన్నారు.

దిగజారిన విద్యా రంగం-నీట్‌ పేపర్‌ లీక్‌ మొదలు పరీక్షల నిర్వహణలో లోపాలు, సంస్కరణల కోసం విద్యార్థులు న్యాయమైన డిమాండ్లు చేస్తున్నారని ప్రస్తావించారు. విద్యార్థులు జవాబుదారీతనం, విద్యా సంస్కరణలు డిమాండ్ చేశారని పేర్కొన్నారు. మోదీ ప్రభుత్వం వారి ధైర్యాన్ని విచక్షణా రహితంగా క్రూరత్వంతో అణిచివేసే ప్రయత్నం చేసిందన్నారు.

Advertisement

విద్యార్థులను భవిష్యత్తు వారసులుగా కాకుండా దేశ శత్రువులుగా చూస్తోందన్నారు. దేశ విద్యా రంగాన్ని ప్రభుత్వం దిగజార్చుతోందని, విద్యార్థులు ప్రభుత్వ మాటలను బట్టబయలు చేశారని పేర్కొన్నారు. ఈనెల 20న జరిగిన ఘటనలను  అప్రతిష్ఠకరమైన రోజు అభివర్ణించారు. శాంతియుతంగా నిరసన తెలుపుతున్న విద్యార్థులపై బలగాలు లాఠీచార్జీలు, టియర్‌గ్యాస్‌ ప్రయోగించాయని పేర్కొన్నారు.

ఇంటికి వెళ్తున్న విద్యార్థులపై విచక్షణారహితంగా దాడులు చేశారని గుర్తు చేశారు. గాయాలతో యువత రక్తమోడిన దృశ్యాలు కలచి వేశాయని గుర్తు చేశారు.  విద్యార్థులపై బలప్రయోగం ప్రభుత్వానికి కొత్త కాదని ప్రస్తావిస్తూ, ఐదేళ్ల కిందట జరిగిన ఘటనలను ప్రస్తావించారు.

2020 ఏడాది సీఏఏ-ఎన్‌ఆర్‌సీ వ్యతిరేక ఆందోళనల సమయంలో పోలీసు చర్యలు, మహిళా రెజ్లర్ల నిరసనలను గుర్తు చేశారు. విభేదించే ప్రతి స్వరాన్ని దేశద్రోహంగా మార్చడం అలవాటుగా మార్చుకుందన్న సోనియాగాంధీ, విద్యార్థుల ఉద్యమాన్నిఅదే కోణంలో చూపించే ప్రయత్నం చేస్తోందన్నారు. విద్యార్థులు ఎందుకు రోడ్డెక్కారో ఒక్కసారి ఆత్మ పరిశీలన చేసుకోవాలని సూచన చేశారు.

ALSO READ: ఢిల్లీ విద్యార్థుల ఉద్యమానికి సల్మాన్ ఖాన్ మద్దతు.. దయచేసి ఆ ఒక్క పని చేయొద్దు!

గడిచిన పుష్కరకాలంలో విద్యా వ్యవస్థకు కేటాయించే నిధులు 50 శాతం, ఉన్నత విద్యకు 33 శాతం తగ్గిందన్నారు. దాదాపు లక్ష ప్రభుత్వ పాఠశాలలు మూతపడ్డాయని ఆరోపించారు. అదే సమయంలో  43 వేల ప్రైవేటు పాఠశాలలు పుట్టుకొచ్చాయన్నారు. చివరకు నాణ్యమైన ప్రభుత్వ విద్య సామాన్యులకు అందలేదన్నారు.

ఎన్‌టీఏ ను బలోపేతం చేయాలన్న పార్లమెంటరీ స్థాయీ సంఘం చేసిన సిఫార్సులను మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ పట్టించుకోలేదని విమర్శించారు. దీనికితోడు పేపర్‌ లీక్‌ల వంటి వైఫల్యాలు జరిగినా ఆయన రాజీనామా చేయకపోవడం మరింత ఆగ్రహం పెరిగిందన్నారు.

Related News

ప్రధాని మోడీ ఇంటి ముట్టడికి కేజ్రీవాల్ బిగ్ స్కెచ్.. E20 పెట్రోల్‌పై కేజ్రీవాల్ సమరం

బీహార్‌లో బీజేపీకి బిగ్ షాక్.. భారీ మెజారిటీతో ప్రశాంత్ కిషోర్ గెలుపు

పెళ్లే కానక్కర్లేదు.. సహజీవనానికి ఆ చట్టం వర్తిస్తుంది.. సుప్రీంకోర్టు సంచలనం

సుప్రీం కోర్టులో జడ్జీల సంఖ్య పెంపు.. లోక్‌సభలో బిల్లు ఆమోదం!

ఇంజనీరింగ్ అభ్యర్థులకు గుడ్ న్యూస్..ఎయిర్‌పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియాలో ఉద్యోగాలు

డిగ్రీ అర్హతతో 11,403 క్లర్క్ పోస్టులు.. పూర్తి వివరాలివే !

కేరళలో విరిగిపడ్డ కొండచరియలు.. ‘బిగ్ టీవీ’ ప్రతినిధులకు తప్పిన పెను ప్రమాదం

నిరసనలకు జంతర్ మంతర్ గుడ్ బై? కొత్త వేదిక ఎక్కడ, సుప్రీంకోర్టులో పిటిషన్

Big Stories

Advertisement
×