E-Paper
Advertisement

హెల్మెట్ కొంటే సరిపోదు.. 2-2-2 రూల్ పాటించకపోతే ప్రాణాలను రిస్క్ లో పెట్టినట్టే!

హెల్మెట్ కొంటే సరిపోదు.. 2-2-2 రూల్ పాటించకపోతే ప్రాణాలను రిస్క్ లో పెట్టినట్టే!
Advertisement

The 2-2-2 Rule for Two Wheeler Helmets: బైక్ నడిపేటప్పుడు కచ్చితంగా హెల్మెట్ పెట్టుకోవాల్సిందే. ప్రమాద సమయంలో ప్రాణాలను కాపాడటంలో కీలక పాత్ర పోషిస్తుంది. అయితే, హెల్మెట్ పెట్టుకోవడం మాత్రమే కాదు, అది సరైన సైజులో ఉండి, సరిగ్గా ఫిట్ కావడం కూడా అంతే ముఖ్యం. ఇందుకోసం ప్రపంచవ్యాప్తంగా చాలామంది నిపుణులు సూచించే ఈజీ పద్ధతి 2-2-2 రూల్. కేవలం రెండు వేళ్లతో ఈ పరీక్ష చేసి, మీ హెల్మెట్ సరిగ్గా ఉందో లేదో తెలుసుకోవచ్చు. ఎలాగో ఇప్పుడు తెలుసుకుందాం..

2-2-2 రూల్ అంటే ఏంటి?

మొదటగా, హెల్మెట్ ముందు భాగం మీ కనుబొమ్మలకు చాలా పైకి ఉండకూడదు. కనుబొమ్మల పైన సుమారు రెండు వేళ్ల దూరం ఉండేలా హెల్మెట్ ఉండాలి. అప్పుడు మాత్రమే ప్రమాద సమయంలో నుదురు మంచి రక్షణ పొందుతుంది. రెండోది, చెవి కింద పట్టీలను పరిశీలించాలి. మీ చెవి దగ్గర రెండు వేళ్లతో  Vలా చేస్తే, హెల్మెట్ స్ట్రాప్‌లు అదే ఆకారంలో ఉండాలి. అలా లేకపోతే స్ట్రాప్‌ లను సరిగా సర్దుకోవాలి. మూడోది, చిన్ స్ట్రాప్‌ను బిగించిన తర్వాత మీ గడ్డానికి, స్ట్రాప్‌కు మధ్య రెండు వేళ్లు మాత్రమే పట్టేంత ఖాళీ ఉండాలి. అంతకంటే ఎక్కువ ఖాళీ ఉంటే హెల్మెట్ వదులుగా ఉంటుంది. చాలా బిగిస్తే అసౌకర్యంగా మారుతుంది.

హెల్మెట్ ఫిట్ ఎందుకు అంత ముఖ్యం?

Advertisement

చాలా పెద్ద హెల్మెట్ అయితే ప్రమాద సమయంలో తల నుంచి జారిపోయే అవకాశం ఉంది. అదే చిన్న సైజు హెల్మెట్ అయితే తలనొప్పి, ఒత్తిడి, అసౌకర్యం కలిగిస్తుంది. అంతేకాదు, ఎక్కువసేపు రైడ్ చేయడం కూడా కష్టమవుతుంది. అందుకే సరైన సైజు ఎంపిక చాలా అవసరం.

కొత్త హెల్మెట్ కొనేటప్పుడు ఏం చేయాలి?

హెల్మెట్ కొనేముందు ముందుగా మీ తల చుట్టుకొలతను కొలవాలి. కనుబొమ్మల పైన టేప్‌తో తల చుట్టూ కొలిచి వచ్చిన కొలతను కంపెనీ సైజింగ్ చార్ట్‌ తో పోల్చి సరైన సైజును ఎంచుకోవాలి. హెల్మెట్ ధరించిన తర్వాత తలను ఎడమ, కుడి వైపులకు కదిలించి చూడండి. హెల్మెట్ ఎక్కువగా కదలకూడదు. అలాగే చిన్ స్ట్రాప్ బిగించి ఉన్నప్పుడు హెల్మెట్‌ తో పాటు మీ ముఖ చర్మం కూడా కదలాలి. హెల్మెట్ మాత్రమే విడిగా కదిలితే అది సరైన ఫిట్ కాదని అర్థం.

హెల్మెట్‌ను ఎప్పుడు మార్చాలి?

Advertisement

చాలామంది ఒకసారి కొనుగోలు చేసిన హెల్మెట్‌ను సంవత్సరాల తరబడి ఉపయోగిస్తుంటారు. కానీ, నిపుణుల సూచన ప్రకారం సాధారణంగా ఐదేళ్లకు ఒకసారి హెల్మెట్ మార్చడం మంచిది. తరచూ వాడటం, ఎండ, దుమ్ము, చెమట లాంటి కారణాల వల్ల హెల్మెట్ లోపలి భాగం క్రమంగా బలహీనపడుతుంది. ప్రమాదంలో ఒకసారి బలంగా తాకినా బయటకు బాగానే కనిపించినా, లోపలి రక్షణ సామర్థ్యం తగ్గి ఉండే అవకాశం ఉంది. అందుకే, ప్రతి రైడ్‌కు ముందు కేవలం కొన్ని సెకన్లు కేటాయించి 2-2-2 రూల్ ప్రకారం హెల్మెట్‌ ను చెక్ చేసుకోవడం మంచి అలవాటు. ఈ చిన్న జాగ్రత్తే ప్రమాద సమయంలో మీ ప్రాణాలను కాపాడే పెద్ద రక్షణగా మారుతుంది.

Read Also: వోక్స్‌ వ్యాగన్ సూపర్ ఈ-సైకిల్.. కిందపడితే ఇంట్లో వాళ్లకు వెంటనే మెసేజ్!

Related News

వర్షాకాలంలో ఈ EV బైకులే బెస్ట్.. వరదలోనూ దూసుకెళ్తాయట!

ఎక్స్‌ ప్రెస్‌ వే ప్రయాణికులకు షాక్.. టోల్ రేట్లు భారీగా పెంపు!

ఈ ఏడాది అత్యధికంగా అమ్ముడైన పెట్రోల్ కార్లు ఇవే.. నెంబర్ వన్ ఏదంటే?

టెస్లా కారులో గ్రోక్ AI.. ఇండియన్ యూజర్లకు సరికొత్త స్మార్ట్ ఫీచర్లు!

మారుతి నుంచి భారీ సర్‌ ప్రైజ్.. త్వరలో 4 క్రేజీ మోడళ్లు ఎంట్రీ!

హోండా కార్లపై కళ్లు చెదిరే ఆఫర్లు.. ఆ మూడు మోడల్స్ పై ఏకంగా రూ.2.45 లక్షల డిస్కౌంట్!

జస్ట్ రూ.1.25 లక్షలకే అవోర్ EX1.. కొనేముందు ఈ 5 విషయాలు కచ్చితంగా తెలుసుకోండి!

ఆగస్టులో దేశీ మార్కెట్ లో లాంచ్ కానున్న కొత్త కార్లు.. ఏ మోడల్ ఎప్పుడు వస్తుందో తెలుసా?

Big Stories

Advertisement
×