Ketan Agarwal Case: పుణె సిటీ రియల్టర్ కేతన్ అగర్వాల్ హత్య కేసు అనేక మలుపులు తిరుగుతున్నాయి. ఈ కేసులో తీగలాగితే డొంక అంతా కదులుతోంది. సియా చేసిన లీలలు ఒకొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. నాలుగు నెలల ముందే సీక్రెట్‌గా వివాహం చేసుకుందట సియా గోయల్. ఇంకా దీనిపై లోతుగా దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు.
కేతన్ మర్డర్ కేసులో షాకింగ్ విషయాలు: పూణె యంగ్ వ్యాపారవేత్త కేతన్ అగర్వాల్ హత్య కేసులో కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. సియా గోయల్ సీక్రెట్ మ్యారేజ్ చేసుకున్నట్లు దర్యాప్తులో తేలిందట. కేతన్ అగర్వాల్ హత్యకు ముందు నిందితురాలు సియా గోయల్ నాలుగు నెలల ముందు కొరుకున్న ప్రియుడు చేతన్ చౌదరిని సీక్రెట్‌గా మ్యారేజ్ చేసుకున్నట్లు పోలీసులు గుర్తించారట.
ఈ వ్యవహారం పోలీసుల దర్యాప్తులో వెలుగు చూసినట్టు సమాచారం. దర్యాప్తులో భాగంగా వారిద్దరి మొబైల్ ఫోన్ల నుండి రికవరీ చేసిన వాట్సాప్ చాటింగులను పరిశీలించినప్పుడు ఈ విషయం వెలుగులోకి వచ్చింది. జూన్ 14న కేతన్‌ను చంపడానికి ప్రయత్నించినట్టు సమాచారం.
నాలుగు నెలల ముందే సియా ఆ పని: అయితే చివరి నిమిషంలో సియాకు ధైర్యం చాలకపోవడంతో ఆ ప్లాన్ కాస్త ఫెయిల్ అయ్యిందని తెలిపారు పోలీసులు. ఈ క్రమంలో చేతన్‌కు ఓ మెసేజ్ చేసిందని, ఈ పని చేయడానికి తనకు ధైర్యం చాలలేదని, ఇద్దరం కలిసి కొండపై నుండి కిందకు కేతన్ నెట్టేద్దామన్నది అందులోని సారాంశం. తనతో పాటు రావాలని కోరినట్లు దర్యాప్తులో బయటపడింది.
నిందితుల ఇద్దరి ఫోన్ కాల్స్, చాటింగ్‌లను గడిచిన ఆరేడు నెలల్లో కాల్ రికార్డులు, లొకేషన్ డేటా, ఇంటర్నెట్ సెర్చ్ హిస్టరీని విశ్లేషించారు. ఈ ఆధారాలు దర్యాప్తుకు కీలకంగా మారాయని తెలిపారు. కుటుంబాల నుండి వ్యతిరేకత వస్తుందనే భయంతో సియా-చేతన్ సీక్రెట్ పెళ్లిని రహస్యంగా ఉంచినట్లు చాట్స్ ద్వారా తెలుస్తోంది.
ALSO READ: అహ్మదాబాద్ వరుస బాంబు పేలుళ్ల కేసు.. గురజాత్ హైకోర్టు సంచలన తీర్పు, 38 మందికి ఉరిశిక్ష
రహస్య వివాహం తర్వాత కేతన్‌ను హత్య కుట్ర పన్నినట్లు అనుమానిస్తున్నారు. సియా-చేతన్ సాయంతో కాబోయే భర్త కేతన్ అగర్వాల్‌ను జూన్ 18న లోహగఢ్ కోటపై నుండి కిందకు నెట్టేశారు. ఈ నేపథ్యంలో వీరిద్దరిని పోలీసులు అరెస్ట్ చేశారు. ప్రస్తుతం సియా-చేతన్ రిమాండ్‌లో ఉన్నారు.