E-Paper
Advertisement

గురుకులంలో దారుణం.. పదో తరగతి విద్యార్థినికి కళ్లకు గంతలు కట్టి.. బలవంతంగా..!

గురుకులంలో దారుణం.. పదో తరగతి విద్యార్థినికి కళ్లకు గంతలు కట్టి.. బలవంతంగా..!
Advertisement

Asifabad Ragging: కొమురం భీమ్ ఆసిఫాబాద్ జిల్లాలో విద్యాబుద్ధులు నేర్చుకోవాల్సిన గురుకుల పాఠశాల వేదికగా ఒక ఘోరమైన సంఘటన వెలుగుచూసింది. కాగజ్‌నగర్‌లోని మహాత్మా జ్యోతిబాపూలే (MJP) వెనుకబడిన తరగతుల బాలికల గురుకుల పాఠశాలలో తోటి విద్యార్థినుల మధ్య జరిగిన ఒక వికృత చేష్ట తీవ్ర కలకలం రేపింది. ర్యాగింగ్ లేదా సరదా అనే పేరుతో కొందరు బాలికలు చేసిన పని, చివరకు ఒక విద్యార్థిని ప్రాణాల మీదకు తెచ్చింది. క్రమశిక్షణకు మారుపేరుగా నిలవాల్సిన ప్రభుత్వ వసతి గృహంలో ఇలాంటి సంఘటన జరగడం స్థానికంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది.

అసలేం జరిగింది? ఆ రాత్రి ఏం చేశారు?
బాధిత కుటుంబం, పోలీసుల సమాచారం ప్రకారం.. ఈ పాఠశాలలో పదో తరగతి చదువుతున్న శృతి అనే విద్యార్థినిపై తోటి బాలికలు క్రూరత్వానికి తెగబడ్డారు. హాస్టల్ గదిలో శృతిని ఒంటరిని చేసి, ఆమె కాళ్లు చేతులు కదలకుండా గట్టిగా పట్టుకున్నారు. అంతటితో ఆగకుండా, ఆమె కేకలు వేయకుండా ఉండేందుకు కళ్లకు గంతలు కట్టారు. ఆపై నోరు తెరిపించి ఒక పెన్ క్యాప్‌ను లోపల వేసి, బలవంతంగా నీళ్లు పోసి మింగించారు. ఆ సమయంలో శృతి ఊపిరాడక, నరకయాతన అనుభవించినట్లు తెలుస్తోంది.

Advertisement

వెలుగులోకి వచ్చిన దారుణం..
ఈ అమానుష ఘటన తర్వాత బాధితురాలు తీవ్రమైన కడుపునొప్పి, ఊపిరి తీసుకోవడంలో ఇబ్బందితో తీవ్ర అస్వస్థతకు గురైంది. విద్యార్థిని పరిస్థితిని గమనించిన పాఠశాల సిబ్బంది వెంటనే ఆమెను స్థానిక ఆసుపత్రికి తరలించారు. అక్కడ వైద్యులు అత్యవసరంగా స్కానింగ్ పరీక్షలు నిర్వహించగా, కడుపులో పెన్ను క్యాప్ ఉన్నట్లు నిర్ధారణ అయింది. వైద్యుల బృందం సకాలంలో స్పందించి, ప్రత్యేక చికిత్స ద్వారా ఆ ప్లాస్టిక్ క్యాప్‌ను సురక్షితంగా బయటకు తీశారు. ప్రస్తుతం బాలిక కోలుకుంటున్నప్పటికీ, ఆమె తీవ్ర భయాందోళనలకు లోనైనట్లు తెలుస్తోంది.

యాక్షన్ లోకి యంత్రాంగం
తన కుమార్తెకు జరిగిన అన్యాయంపై శృతి తండ్రి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. బాధ్యులైన విద్యార్థినులపై, అలాగే నిర్లక్ష్యంగా వ్యవహరించిన హాస్టల్ సిబ్బందిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ఆయన స్థానిక పోలీస్ స్టేషన్‌లో రాతపూర్వకంగా ఫిర్యాదు చేశారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. అసలు విద్యార్థినుల మధ్య ఉన్న పాత కక్షలేమైనా కారణమా, లేక ఇది కేవలం సీనియర్-జూనియర్ల మధ్య జరిగే ర్యాగింగ్ వేధింపా అనే కోణంలో అధికారులు విచారణ జరుపుతున్నారు. విద్యార్థినుల భద్రతపై తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

Advertisement

Also Read: మయోన్నైస్ అంటే ఇష్టమా? అయితే ఆస్పత్రిలో బెడ్ రెడీ చేసుకోండి.. ఇది తింటే ఐసీయూకే!

Related News

ప్రశాంత్ కిషోర్ గెలుపు పై మంత్రి పొన్నం సంచలన వ్యాఖ్యలు.. ఏమన్నారంటే..?

సుప్రీం కోర్టు జడ్జీల పెంపుపై.. ఎంపీ రఘునందన్ రావు సంచలన వ్యాఖ్యలు!

రొబోటిక్ శస్త్రచికిత్సల్లో నిమ్స్ సరికొత్త రికార్డు.. సీఎం రేవంత్ ప్రశంసల జల్లు!

పగలు కుక్కర్లు అమ్ముతూ రాత్రి రెక్కీ వేసి దోపిడి.. బంగ్లాదేశ్ దొంగల ముఠా అరెస్ట్!

దివాళా తీసిన ఎల్లంపేట్ మున్సిపాలిటీ.. సొంత ఆఫీస్ ముందే ఘోర పరిణామాలు!

అక్రమ మోటార్లతో నీళ్ల దోపిడీ.. దాహంతో అలమటిస్తున్న కాలనీవాసులు!

కౌంట్‌డౌన్ స్టార్ట్.. ఈ నెల దాటితే మరో ఏడాదంతా ప్రమోషన్లు బంద్!

రేవంత్‌కి నామినేషన్ ఫామ్ నింపడం వచ్చా? కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు!

Big Stories

Advertisement
×