// // Delhi : ఢిల్లిని కమ్మేసిన పొగమంచు.. విమాన రాకపోకలపై ఎఫెక్ట్.. - Staging.BigTvLive -->
E-Paper
Advertisement

Delhi : ఢిల్లిని కమ్మేసిన పొగమంచు.. విమాన రాకపోకలపై ఎఫెక్ట్..

Delhi : ఢిల్లిని కమ్మేసిన పొగమంచు.. విమాన రాకపోకలపై ఎఫెక్ట్..
Advertisement

Delhi : ఉత్తర భారత దేశాన్ని పొగ మంచు కమ్మేసింది. దేశ రాజధాని ఢిల్లీలో ఈ పరిస్థితి మరింత ఘోరంగా ఉంది. రాజధాని నగరంలో దట్టంగా పొగమంచు కమ్మేయడంతో.. రవాణా వ్యవస్థలకు తీవ్ర అంతరాయం ఏర్పడుతోంది. దాదాపు 100 విమానాలు ఆలస్యంగా నడుస్తున్నాయి. పలు రైళ్లను రద్దు చేశారు అధికారులు.

రెండు వారాల తర్వాత ఇవాళ స్కూల్స్‌ తెరుచుకోవాల్సి ఉంది. చలి కారణంగా స్కూల్స్ టైమింగ్స్‌లో మార్పులు చేశారు అధికారులు. ఇటు వాయు కాలుష్యానికి పొగమంచు తోడవ్వడంతో జనజీవనం అస్తవ్యస్తమయ్యింది. పొగమంచు విమాన రాకపోకలపై తీవ్ర ప్రభావం చూపింది. సోమవారం ఉదయం దాదాపు వంద విమాన సర్వీసులు రద్దు కాగా.. మరో 128 సర్వీసులు ఆలస్యంగా నడుస్తున్నాయి. దీంతో సంయమనం పాటించాలని ప్రయాణికులకు ఢిల్లీ ఎయిర్‌పోర్ట్‌ అధికారులు సూచించారు. మరోవైపు రాజధాని నుంచి వెళ్లే 18 రైళ్లు ఆలస్యంగా నడుస్తున్నాయి.

Advertisement

దేశ రాజధాని ఎన్‌సీఆర్ (NCR) ప్రాంతంలో కనిష్ట ఉష్ణోగ్రతలు 4 డిగ్రీల సెల్సియస్‌ దిగువన నమోదయ్యాయి. శుక్రవారం అది రికార్డు స్థాయిలో 3.9 డిగ్రీల సెల్సియస్‌గా.. శనివారం ఏకంగా 3 డిగ్రీల సెల్సియస్‌ నమోదయ్యింది. మరోవైపు వాయు కాలుష్యం పెరగడంతో నగరవాసుల్లో ఆందోళన రేకెత్తిస్తోంది. ఢిల్లీ-ఎన్‌సిఆర్‌లో అనవసరమైన నిర్మాణ పనులు.. BS-III పెట్రోల్, BS-IV డీజిల్ ఫోర్-వీలర్ల దీంతో అనవసరమైన నిర్మాణ పనులు, కాలుష్య కారక ఫోర్ వీలర్ వాహనాలను నడపడంపై కేంద్రం నిషేధం విధించింది. ఢిల్లీ-ఎన్‌సిఆర్‌‌లో గాలి నాణ్యత 458గా నమోదవ్వడంతో కేంద్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.

Related News

ప్రధాని మోడీ ఇంటి ముట్టడికి కేజ్రీవాల్ బిగ్ స్కెచ్.. E20 పెట్రోల్‌పై కేజ్రీవాల్ సమరం

బీహార్‌లో బీజేపీకి బిగ్ షాక్.. భారీ మెజారిటీతో ప్రశాంత్ కిషోర్ గెలుపు

పెళ్లే కానక్కర్లేదు.. సహజీవనానికి ఆ చట్టం వర్తిస్తుంది.. సుప్రీంకోర్టు సంచలనం

సుప్రీం కోర్టులో జడ్జీల సంఖ్య పెంపు.. లోక్‌సభలో బిల్లు ఆమోదం!

ఇంజనీరింగ్ అభ్యర్థులకు గుడ్ న్యూస్..ఎయిర్‌పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియాలో ఉద్యోగాలు

డిగ్రీ అర్హతతో 11,403 క్లర్క్ పోస్టులు.. పూర్తి వివరాలివే !

కేరళలో విరిగిపడ్డ కొండచరియలు.. ‘బిగ్ టీవీ’ ప్రతినిధులకు తప్పిన పెను ప్రమాదం

నిరసనలకు జంతర్ మంతర్ గుడ్ బై? కొత్త వేదిక ఎక్కడ, సుప్రీంకోర్టులో పిటిషన్

Big Stories

Advertisement
×