E-Paper
Advertisement

స్టేట్ టాపర్.. అవినీతిలో నంబర్ 1.. ఆరు నెలలకే ఏసీబీకి దొరికిపోయిన యువ అధికారిణి!

స్టేట్ టాపర్.. అవినీతిలో నంబర్ 1.. ఆరు నెలలకే ఏసీబీకి దొరికిపోయిన యువ అధికారిణి!
Advertisement

Rajasthan: స్టేట్ టాపర్‌గా నిలిచి, ఎంతో మందికి రోల్ మోడల్‌గా నిలవాల్సిన ఒక యువ అధికారిణి.. సర్వీస్‌లోకి వచ్చిన ఆరు నెలలకే ఏసీబీకి దొరికిపోవడం ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశమైంది. రాజస్థాన్‌కు చెందిన కాజల్ మీనా ఉదంతం చూస్తుంటే, వ్యవస్థలో అవినీతి ఏ స్థాయిలో దూసుకుపోతుందో అర్థమవుతోంది.

కాజల్ మీనా సామాన్యమైన వ్యక్తి కాదు. 2024లో జరిగిన రాజస్థాన్ రాష్ట్ర స్థాయి పోటీ పరీక్షల్లో ఆమె స్టేట్ టాపర్‌. తన ప్రతిభతో గ్రూప్-1 స్థాయి ర్యాంక్ సాధించి, సబ్ డివిజనల్ మెజిస్ట్రేట్ (SDM) వంటి కీలకమైన బాధ్యతలను దక్కించుకున్నారు. ట్రైనింగ్ పూర్తి చేసుకున్న తర్వాత కేవలం ఆరు నెలల క్రితమే ఆమె విధుల్లో చేరారు. ఇంత తక్కువ సమయంలోనే అవినీతి ఊబిలోకి దిగడం అందరినీ విస్మయానికి గురిచేస్తోంది.

Advertisement

అసలేం జరిగిందంటే.. ఒక భూమికి సంబంధించిన ‘డిక్రీ’ జారీ చేయాల్సి ఉండగా, అందుకు ప్రతిఫలంగా కాజల్ మీనా 60 వేల రూపాయల లంచం డిమాండ్ చేశారు. బాధితుడు ఈ విషయాన్ని ఏసీబీ అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. దీంతో రంగంలోకి దిగిన అధికారులు పక్కా స్కెచ్ వేశారు. కాజల్ ఆ డబ్బు తీసుకుంటుండగా రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు.

కష్టపడి చదివి, వేల మందిని వెనక్కి నెట్టి టాపర్‌గా నిలిచిన వ్యక్తికి.. కనీస విలువలు లేకపోవడం విచారకరం. ఆ స్థాయి అధికారిణికి వచ్చే జీతభత్యాలు, గౌరవం కంటే.. ఆ అరవై వేలే ముఖ్యం అనుకోవడం ఆమె వ్యక్తిత్వానికే కాదు, ఆ పదవికి కూడా అవమానం. ఈ ఘటనతో ఆమె కెరీర్ ప్రారంభంలోనే ముగిసిపోయినట్లయింది.

Advertisement

Also Read: సీఎం రేవంత్ ఇంటి వద్ద భారీ భద్రత.. 144 సెక్షన్ విధింపు.. బీజేపీ నిరసనలతో హై అలర్ట్!

Related News

ప్రధాని మోడీ ఇంటి ముట్టడికి కేజ్రీవాల్ బిగ్ స్కెచ్.. E20 పెట్రోల్‌పై కేజ్రీవాల్ సమరం

బీహార్‌లో బీజేపీకి బిగ్ షాక్.. భారీ మెజారిటీతో ప్రశాంత్ కిషోర్ గెలుపు

పెళ్లే కానక్కర్లేదు.. సహజీవనానికి ఆ చట్టం వర్తిస్తుంది.. సుప్రీంకోర్టు సంచలనం

సుప్రీం కోర్టులో జడ్జీల సంఖ్య పెంపు.. లోక్‌సభలో బిల్లు ఆమోదం!

ఇంజనీరింగ్ అభ్యర్థులకు గుడ్ న్యూస్..ఎయిర్‌పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియాలో ఉద్యోగాలు

డిగ్రీ అర్హతతో 11,403 క్లర్క్ పోస్టులు.. పూర్తి వివరాలివే !

కేరళలో విరిగిపడ్డ కొండచరియలు.. ‘బిగ్ టీవీ’ ప్రతినిధులకు తప్పిన పెను ప్రమాదం

నిరసనలకు జంతర్ మంతర్ గుడ్ బై? కొత్త వేదిక ఎక్కడ, సుప్రీంకోర్టులో పిటిషన్

Big Stories

Advertisement
×