E-Paper
Advertisement

పిల్లల్ని బాధ్యతాయుతంగా, స్వతంత్రంగా పెంచాలంటే తల్లిదండ్రులు చేయాల్సిందిదే..

పిల్లల్ని బాధ్యతాయుతంగా, స్వతంత్రంగా పెంచాలంటే తల్లిదండ్రులు చేయాల్సిందిదే..
Advertisement

Parenting Tips| ఆధునిక జీవితంలో తల్లిదండ్రులు పిల్లల్ని పెంచడంలో కొత్త కొత్త సవాళ్లు ఎదుర్కొంటున్నారు. అందుకే చాలామంది తల్లిదండ్రులు పిల్లలు జీవితంలో తమకు తాముగా అనుభవాల ద్వారా నేర్చుకోవాలని కోరుకుంటున్నారు. ప్రపంచవ్యాప్తంగా ఇప్పుడు ఫాఫో పేరెంటింగ్ అనే విధానాన్ని ఎంచుకుంటున్నారు. పిల్లలు తమ చర్యల ఫలితాల ద్వారా నేర్చుకోవడాన్ని ఈ విధానం ప్రోత్సహిస్తుంది.

ఫాఫో పేరెంటింగ్ అంటే ఏమిటి?

ఫాఫో అంటే ఇంగ్లీషులో FAFO (Fool Around and Find Out) అని అర్ధం. అంటే తోచిన విధంగా ప్రవర్తించి ఫలితం ద్వారా నేర్చుకోవడం. అంటే ఫాఫో పేరెంటింగ్ పద్ధతిలో తల్లిదండ్రులు పిల్లలను వారి చర్యల ఫలితాలను ఎదుర్కొనేలా అనుమతిస్తారు. అంటే పిల్లలు స్వయంగా తమ అనుభవం ద్వారా పాఠాలు నేర్చుకుంటారు. తల్లిదండ్రులు మార్గదర్శకత్వం చేస్తారు కానీ ప్రతి విషయంలోనూ వారిని నియంత్రించరు.

ఫాఫో పేరెంటింగ్ ఎలా పని చేస్తుంది?

Advertisement

తల్లిదండ్రులు కేవలం తమ పిల్లల భద్రత, ప్రవర్తనకు సంబంధించిన ప్రాథమిక నియమాలు నిర్ణయిస్తారు. చిన్న చిన్న తప్పులు చేయడానికి పిల్లలను స్వేచ్ఛగా అనుమతిస్తారు. వారి ఎంపికల ఫలితాలను సహజంగా ఎదుర్కొనేలా మానసికంగా సిద్ధం చేస్తారు. దీంతో పిల్లలు తమ బాధ్యత, నిర్ణయం తీసుకోవడం నేర్చుకుంటారు.

ఈ పద్ధతి ఎందుకు ప్రాచుర్యం పొందుతోంది?

తల్లిదండ్రులు ఈ ఆధునిక విధానంలో పిల్లలు స్వతంత్ర ఆలోచనాపరులుగా ఎదగాలని కోరుకుంటున్నారు. కఠిన నియంత్రణ కంటే అనుభవం ద్వారా నేర్పడం ఎక్కువగా ఇష్టపడుతున్నారు. ఈ విధానం ఆత్మవిశ్వాసం, సమస్యను పరిష్కరించే నైపుణ్యాలను పెంచుతుంది. నిజ జీవిత సవాళ్లకు పిల్లలను సిద్ధం చేస్తుంది.

FAFO పేరెంటింగ్ ప్రయోజనాలు

Advertisement

పిల్లల్లో స్వతంత్రంగా ఆలోచిస్తారు: పిల్లలు ఎప్పుడూ సహాయం లేకుండా పరిస్థితులను ఎదుర్కొనడం నేర్చుకుంటారు.
నిర్ణయ సామర్థ్యం మెరుగవుతుంది: తమ చర్యల ద్వారా లభించే ఫలితాలను ఎదుర్కోవడం వల్ల ఏది తప్పు, ఏది ఒప్పు అని గుర్తించడం నేర్చుకుంటారు.
బాధ్యతను పెంచుతుంది: తమ చర్యలకు ఫలితాలు ఉంటాయని పిల్లలు అర్థం చేసుకుంటారు. అందుకే నిర్ణయం తీసుకునే సమయంలో జాగ్రత్త వహిస్తారు.
సమస్య పరిష్కార నైపుణ్యం పెరుగుతుంది: తల్లిదండ్రులపై ఆధారపడకుండా సొంతంగా పరిష్కారాలు కనుగొంటారు.

ఫాఫో పేరెంటింగ్ వల్ల నష్టాలు

పిల్లలు తమకు ఇష్టమొచ్చిన విధంగా ప్రవర్తిస్తారు. అంటే వారు ఏదైనా పెద్ద తప్పులు చేస్తే నష్టం కూడా భారీగా ఉండవచ్చు.
పిల్లల తమ అవగాహనకు మించి పరిస్థితులు రావచ్చు. అందువల్ల తల్లిదండ్రులు చాలా జాగ్రత్తగా మార్గదర్శకత్వం చేయాలి. పిల్లలకు అధిక స్వేచ్ఛ గందరగోళం లేదా భయాన్ని కలిగించవచ్చు. ప్రమాదకర పరిస్థితుల్లో ఈ పద్ధతి సరిపోదు. భద్రత ఎప్పుడూ మొదటి ప్రాధాన్యత.

ఫాఫో పేరెంటింగ్‌ను సురక్షితంగా అనుసరించడానికి చిట్కాలు

భద్రత, క్రమశిక్షణకు స్పష్టమైన హద్దులు నిర్ణయించండి. సురక్షితమైన, చిన్న తప్పులు మాత్రమే అనుమతించండి. పిల్లలను గమనించండి కానీ త్వరగా జోక్యం చేసుకోకండి. ఫలితాల నుంచి నేర్చుకున్న తర్వాత మార్గదర్శకత్వం చేయండి.

తల్లిదండ్రులు ఎప్పుడు జోక్యం చేసుకోవాలి?

పిల్లల భద్రతకు ముప్పు ఉన్నప్పుడు తల్లిదండ్రులు వెంటనే చర్య తీసుకోవాలి. తీవ్రమైన హాని నుంచి పిల్లలను రక్షించాలి. పిల్లలు భావోద్వేగానికి లోనైనప్పుడు లేదా క్లిష్ట పరిస్థితుల్లో మార్గదర్శకత్వం అవసరం. స్వేచ్ఛ ఇచ్చినా వారికి సరైన సంరక్షణ ఉండాలి.

Also Read: మీ పిల్లలు ఎత్తు పెరగడం లేదా? సహజంగా ఎత్తు పెరగడానికి ఈ ఆహారాలు తినిపించండి

దీర్ఘకాలిక అభివృద్ధికి ఈ విధానం ఎలా సహాయపడుతుంది?

ఫాఫో విధానం పిల్లలను నిజ జీవిత సమస్యలకు సిద్ధం చేస్తుంది. వారు ఆత్మవిశ్వాసం, బాధ్యత, స్వతంత్రతతో కూడిన ప్రయోజకులుగా ఎదుగుతారు. వైఫల్యాలను భయం లేకుండా ఎదుర్కొవడం నేర్చుకుంటారు. ఇది బలమైన వ్యక్తిత్వం, ఆచరణాత్మక జీవిత నైపుణ్యాలను ఏర్పరుస్తుంది.

ఫాఫో పేరెంటింగ్ పిల్లలు పెంచడంలో ఆధునిక, ఆచరణాత్మక శైలి. అనుభవం, సహజ ఫలితాల ద్వారా ఈ విధానంలో పిల్లలకు నేర్చుకుంటారు.

 

Related News

రాత్రి సరిగా నిద్ర పట్టలేదా? మరుసటి రోజు శరీరం చురుకుగా ఉండేందుకు ఈ టిప్స్ పాటించండి

మోసం చేసిన భర్త లేదా భార్యను క్షమించడం కరెక్టేనా?

వర్షాకాలంలో వరదల ప్రమాదం.. ప్రకృతి విపత్తు సమయంలో మీ ఫ్యామిలీని ఇలా కాపాడుకోండి

స్వస్తిక్‌కు ఇరువైపులా రెండేసి గీతలు.. అంత అర్థం ఉందా? అసలు విషయాలు తెలిస్తే షాక్

ఈ సందర్భాల్లో అబద్ధం చెప్పాలని పిల్లలకు చెప్పాలి.. తల్లిదండ్రులు నేర్పాల్సిన 5 ముఖ్యమైన విషయాలు

ఎప్పుడూ ఒంటరిగా ఉంటారు.. ఈ తేదీల్లో పుట్టినవారిని అందరూ అపార్థం చేసుకుంటారు

నిమ్మకాయ తొక్కలు పారేస్తున్నారా? వీటితో 7 అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు

వీకెండ్‌లో ఎక్కువసేపు నిద్రపోతే ఆరోగ్యానికి మంచిదా? డాక్టర్లు ఏం చెబుతున్నారంటే

Big Stories

Advertisement
×