E-Paper
Advertisement

Spitting in Assembly: అసెంబ్లీలో ఆ మంత్రి తుపుక్ తుపుక్.. విపక్షాలు మండిపాటు

Spitting in Assembly: అసెంబ్లీలో ఆ మంత్రి తుపుక్ తుపుక్.. విపక్షాలు మండిపాటు
Advertisement

Rajasthan Assembly:  రాజస్థాన్ అసెంబ్లీలో ఓ మంత్రి అడ్డంగా కెమెరాకు చిక్కాడు. సదరు మంత్రి వ్యవహారశైలిపై విపక్షాలు ఆందోళనకు దిగాయి. సభలో ఈ ఎపిసోడ్ ప్రజా ప్రతినిధుల ప్రవర్తన, మర్యాదపై చర్చకు దారి తీసింది. దీనికి సంబంధించి వీడియో ఇప్పుడు నెట్టింట్లో వైరల్ అయ్యింది. ఇంతకీ మంత్రి ఏం చేశారో తెలుసా?

రాజస్థాన్ అసెంబ్లీలో అడ్డంగా చిక్కిన ఆ మంత్రి.. విపక్షాల నిరసనలు

Advertisement

రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత నాయకులు చాలా హుందాగా వ్యవహరించాలి.. వ్యవహరిస్తారు కూడా. లేకుంటే ప్రజల్లో వారు చులకనైపోతారు. అందుకే బయటకు వచ్చినప్పుడు నాయకులు జాగ్రత్తగా వ్యవహరిస్తుంటారు. ఇక అసెంబ్లీ అంటే చెప్పనక్కర్లేదు. సభ్యులు చేసే ప్రతీ పని అక్కడ కెమెరాల్లో రికార్డు అవుతాయి. తేడా వేస్తే విపక్షాలు.. అధికార పార్టీ సభ్యుల్ని ఏకేస్తారు. ప్రస్తుతం రాజస్థాన్ అసెంబ్లీలో అదే జరిగింది.

ప్రస్తుతం రాజస్థాన్ అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయి. ఆ రాష్ట్ర పట్టణాభివృద్ధి-గృహనిర్మాణ మంత్రి ఝబర్ సింగ్ ఖర్రా గురించి అందరికీ తెలుసు. ప్రతిపక్ష పార్టీల సభ్యుల ప్రశ్నకు సమాధానం ఇస్తూ అసెంబ్లీలో ఏకంగా తుపుక్ తుపుక్ అని ఉమ్మివేశారు. ఆ సన్నివేశం కెమెరాల్లో రికార్డు అయ్యింది. సదరు మంత్రి వ్యవహారంపై రాజకీయ దుమారం చెలరేగింది.

Advertisement

తుపుక్ తుపుక్ అంటూ సభలో ఉమ్మి వేసిన మంత్రి.. వీడియో వైరల్

సభలో హుందాగా వ్యవహరించాల్సిన సదరు మంత్రి, సభలోపల ఉమ్మి వేయడం ఏంటంటూ నిరసనకు దిగారు. ఈ వ్యవహారం రాజస్థాన్ రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారింది. ఈ ఎపిసోడ్ సభలో ప్రజా ప్రతినిధుల ప్రవర్తనపై చర్చకు దారితీసింది. అసెంబ్లీ గౌరవానికి సభ్యులు భంగం కలిగించే చర్యగా అభివర్ణించాయి విపక్షాలు. అసెంబ్లీ నిబంధనల ప్రకారం సదరు మంత్రిపై చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు.

ప్రముఖ రాజకీయ నాయకుడు హర్లాల్ సింగ్ ఖర్రా కొడుకు జబర్ సింగ్ ఖర్రా. రాజస్థాన్‌లోని శ్రీమధోపూర్ నియోజకవర్గం బీజేపీ ఎమ్మెల్యేగా ఆయన గెలుపొందారు. 2013, 2018, 2023 ఎన్నికల్లో ఆ నియోజకవర్గం నుంచి శాసనసభ సభ్యుడిగా ఎన్నికయ్యారు. ప్రస్తుతం రాజస్థాన్‌లో పట్టణాభివృద్ధి-గృహనిర్మాణ మంత్రిగా ఆయన కొనసాగుతున్నారు.

ALSO READ: ఎన్సీఈఆర్టీ పాఠం వివాదం.. కేంద్ర విద్యామంత్రి విచారం

 

Related News

ప్రధాని మోడీ ఇంటి ముట్టడికి కేజ్రీవాల్ బిగ్ స్కెచ్.. E20 పెట్రోల్‌పై కేజ్రీవాల్ సమరం

బీహార్‌లో బీజేపీకి బిగ్ షాక్.. భారీ మెజారిటీతో ప్రశాంత్ కిషోర్ గెలుపు

పెళ్లే కానక్కర్లేదు.. సహజీవనానికి ఆ చట్టం వర్తిస్తుంది.. సుప్రీంకోర్టు సంచలనం

సుప్రీం కోర్టులో జడ్జీల సంఖ్య పెంపు.. లోక్‌సభలో బిల్లు ఆమోదం!

ఇంజనీరింగ్ అభ్యర్థులకు గుడ్ న్యూస్..ఎయిర్‌పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియాలో ఉద్యోగాలు

డిగ్రీ అర్హతతో 11,403 క్లర్క్ పోస్టులు.. పూర్తి వివరాలివే !

కేరళలో విరిగిపడ్డ కొండచరియలు.. ‘బిగ్ టీవీ’ ప్రతినిధులకు తప్పిన పెను ప్రమాదం

నిరసనలకు జంతర్ మంతర్ గుడ్ బై? కొత్త వేదిక ఎక్కడ, సుప్రీంకోర్టులో పిటిషన్

Big Stories

Advertisement
×