E-Paper
Advertisement

VinFast EV Cars: పెట్రోల్ కార్లు ఇక ఎలక్ట్రిక్ వెర్షన్ లో.. విన్ ఫాస్ట్ క్రేజీ ఆఫర్!

VinFast EV Cars: పెట్రోల్ కార్లు ఇక ఎలక్ట్రిక్ వెర్షన్ లో.. విన్ ఫాస్ట్ క్రేజీ ఆఫర్!
Advertisement

ప్రముఖ ఎలక్ట్రిక్ వాహనాల తయారీ సంస్థ విన్ ఫాస్ట్ తన ఈవీ మార్కెట్ ను మరింత పెంచుకునే ప్రయత్నం చేస్తోంది. అందులో భాగంగా భారత్ లో ICE to EV ఎక్స్ఛేంజ్ ప్రోగ్రామ్‌ ను లాంచ్ చేసింది. ఈ కంపెనీకి చెందిన పాపులర్ మోడల్స్ VF 6, VF 7 కార్లను ఇకపై ఎలక్ట్రిక్ వెర్షన్ లో తీసుకురావాలని నిర్ణయించింది. ఇప్పటికే అందుబాటులో ఉన్న పెట్రో కార్లను కూడా ఎలక్ట్రిక్ వెర్షన్ లోకి మార్చనుంది. ఇండియన్ ఎలక్ట్రిక్ వాహన మార్కెట్లో తన సత్తాను మరింగా చాటుకునే ప్రయత్నంలో భాగంగా ముందడుగు వేస్తోంది.

తమిళనాడులో విన్ ఫాస్ట్ ప్లాంట్ ఏర్పాటు

తమిళనాడులోని ప్లాంట్ లో స్థానిక అసెంబుల్ కార్యకలాపాలను ఏర్పాటు చేసిన కంపెనీ, కొత్త VF 6, VF 7 ఎలక్ట్రిక్ SUVలను అందుబాటులోకి తీసుకురాబోతోంది. ఇప్పటికే ఈ కార్లకు సంబంధించి స్థానిక అసెంబ్లీని నిర్ధారించిన తర్వాత విన్ ఫాస్ట్ భారత్ లో  రిటైల్ కార్యకలాపాలను ప్రారంభించింది. ఈ ఎక్స్ఛేంజ్ డ్రైవ్‌తో, బ్రాండ్ అప్‌ గ్రేడ్‌ను పరిశీలిస్తున్న పాత పెట్రోల్ కార్ల యజమానులను లక్ష్యంగా చేసుకుంది.

ఎక్స్ఛేంజ్ ప్రోగ్రామ్ ప్రత్యేకత ఏంటి?   

Advertisement

ఇక విన్ ఫాస్ట్ కంపెనీ తమ కార్లకు పెద్ద బ్యాటరీ ప్యాక్ ను అందిస్తుంది. VF 6 59.6 kWh బ్యాటరీ ప్యాక్‌ను యాడ్ చేస్తుంది. ఇది ఒకే ఛార్జ్ తో 468 కి.మీ వరు ప్రయాణిస్తుంది. DC ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేస్తుంది. 25 నిమిషాల్లో 10 నుంచి 70 శాతం ఛార్జ్ ను అందిస్తుంది. అటు VF 7 ఎక్కువ అవుట్‌ పుట్ వేరియంట్‌ లతో అందించబడుతుంది. రెండు SUVలు భారత్ NCAP క్రాష్ టెస్ట్ లో 5 స్టార్ రేటింగ్‌లను పొందాయి.

Read Also: వాహనదారులకు కేంద్రం అలర్ట్.. ఏప్రిల్ 1 నుంచి కొత్తరకం పెట్రోల్ వచ్చేస్తుంది!

వినియోగదారులను కలిగే కీలక ప్రయోజనం 

Advertisement

కంపెనీ తాజా ఎక్స్ఛేంజ్ ప్రొగ్రామ్ లో భాగంగా విన్ ఫాస్ట్ దాని సపోర్ట్ నెట్‌ వర్క్‌ ను విస్తరిస్తున్నట్లు చెబుతోంది. కంపెనీ పలు  నగరాల్లో డీలర్ భాగస్వాములతో ఒప్పందాలు కుదుర్చుకుంది. EV కేంద్రీకృత వర్క్‌ షాప్‌లను స్థాపించడానికి సర్వీస్ ప్రొవైడర్లతో కలిసి పని చేస్తోంది. V-గ్రీన్, ఇంధన రిటైల్ భాగస్వాముల సహకారంతో ఛార్జింగ్ మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేస్తుంది.  ఎంపిక చేసిన ఫ్యూయెల్ స్టేషన్లు, పట్టణ ప్రాంతాలలో ఫాస్ట్ ఛార్జర్లను ప్లాన్ చేస్తుంది. ఇక ఈ కంపెనీకి చెందిన కొత్త ఈవీ కార్లకు, ఓనర్ షిప్ ప్యాకేజీలో వేరియంట్ ను బట్టి 10 సంవత్సరాల వరకు వారంటీ, ఉచిత మెయింటెనెన్స్ ఆఫర్లు, పరిమిత కాల ఛార్జింగ్ ప్రయోజనాలను అందిస్తుంది.  కొత్త ప్రోగ్రామ్‌ తో,  విన్ ఫాస్ట్ VF 6, VF 7లను సాంప్రదాయ కాంపాక్ట్, మిడ్ సైజ్ SUV లను ఎలక్ట్రిక్ వెర్షన్ లో అందించనుంది. ఇప్పటికే ఉన్న కార్ల యజమానులకు ఎలక్ట్రిక్ మొబిలిటీకి మారడానికి ఆర్థికంగా సపోర్టు చేస్తుంది.

Read Also: మహీంద్రా కీలక నిర్ణయం, XEV 9S ఎలక్ట్రిక్ SUVలో కొత్త డ్రైవ్ మోడ్‌!

Related News

వర్షాకాలంలో ఈ EV బైకులే బెస్ట్.. వరదలోనూ దూసుకెళ్తాయట!

ఎక్స్‌ ప్రెస్‌ వే ప్రయాణికులకు షాక్.. టోల్ రేట్లు భారీగా పెంపు!

ఈ ఏడాది అత్యధికంగా అమ్ముడైన పెట్రోల్ కార్లు ఇవే.. నెంబర్ వన్ ఏదంటే?

టెస్లా కారులో గ్రోక్ AI.. ఇండియన్ యూజర్లకు సరికొత్త స్మార్ట్ ఫీచర్లు!

మారుతి నుంచి భారీ సర్‌ ప్రైజ్.. త్వరలో 4 క్రేజీ మోడళ్లు ఎంట్రీ!

హోండా కార్లపై కళ్లు చెదిరే ఆఫర్లు.. ఆ మూడు మోడల్స్ పై ఏకంగా రూ.2.45 లక్షల డిస్కౌంట్!

జస్ట్ రూ.1.25 లక్షలకే అవోర్ EX1.. కొనేముందు ఈ 5 విషయాలు కచ్చితంగా తెలుసుకోండి!

ఆగస్టులో దేశీ మార్కెట్ లో లాంచ్ కానున్న కొత్త కార్లు.. ఏ మోడల్ ఎప్పుడు వస్తుందో తెలుసా?

Big Stories

Advertisement
×