E-Paper
Advertisement

Rahul Gandhi: మోదీ సర్కార్‌కు రాహుల్ గాంధీ వార్నింగ్.. పేపర్ లీకుల లెక్కలు బయటపెట్టిన రాహుల్!

Rahul Gandhi: మోదీ సర్కార్‌కు రాహుల్ గాంధీ వార్నింగ్.. పేపర్ లీకుల లెక్కలు బయటపెట్టిన రాహుల్!
Advertisement

Rahul Gandhi: కేంద్ర ప్రభుత్వం పై లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ సంచలన వ్యాఖ్యలు చేశారు. దేశంలో విద్యా వ్యవస్థ పూర్తిగా సంక్షోభంలో ఉందని ఫైర్ అయ్యారు. దేశంలో వరుసగా ప్రశ్నాపత్రాల లీకులతో విద్యార్థుల భవిష్యత్తు నాశనమవుతోందని తెలిపారు. గత 10 ఏళ్లలో దేశంలో ఎన్నడు లేని విధంగా 152 పరీక్షల ప్రశ్నాపత్రాల లీకులు జరిగాయని తెలిపారు.

నేటికి 152 లీకులు..

గత 10 ఏళ్లలో 2014 నుండి 2024 కాలంలో దేశవ్యాప్తంగా 152 ప్రధాన పరీక్షల పేపర్లు లీక్ అయ్యాయి. ఇది సగటున నెలకు ఒక లీకేజీ తో సమానం అని రాహుల్ గాంధీ అన్నారు. ఈ వరుస లీకేజీల వల్ల ప్రత్యక్షంగా, పరోక్షంగా 7.5 కోట్ల మంది యువత నష్టపోయారని అన్నారు. ఇన్ని లీకేజీలు జరిగినా ఇప్పటి వరకు పేపర్ లీక్ మాఫియా ప్రధాన సూత్రధారులపై ఒక్క శిక్ష కూడా పడలేదని అన్నారు. దేశంలో ప్రభుత్వ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకుంటున్న ప్రతి 150 మందిలో కేవలం ఒకరికి మాత్రమే ఉద్యోగం వస్తోందని, 99% నిజాయితీగల విద్యార్థుల భవిష్యత్తు తీవ్ర ప్రమాదంలో పడిందని అన్నారు.

విద్యాసంస్థల ఆక్రమణ

Advertisement

విశ్వవిద్యాలయాల VCలు, NTA అధికారుల నియామకాల్లో మెరిట్‌కు కాకుండా అధికార పార్టీ అయిన RSS సిద్ధాంతాలకు అనుకూలమైన వ్యక్తులకు ప్రాధాన్యమివ్వడం వల్ల వ్యవస్థ దెబ్బతన్నదని రాహుల్ గాంధీ పేర్కోన్నారు. రష్యా-ఉక్రెయిన్ యుద్ధాన్ని ఆపగలిగానని చెప్పుకునే ప్రధాని మోదీ, దేశంలో పేపర్ లీకేజీలను ఎందుకు ఆపలేకపోతున్నారని రాహుల్ గాంధీ ఫైర్ సెటెర్లు వేశారు. దేశంలో ఇలా వరుస లీకేజీలకు బాధ్యత వహిస్తూ విద్యాశాఖ మంత్రిగా కొనసాగుతున్న ధర్మేంద్ర ప్రధాన్ తక్షణమే రాజీనామా చేయాలి లేదా ప్రధాని ఆయనను తొలగించాలని రాహుల్ గాంధీ డిమాండ్ చేశారు.

పేపర్ లీక్‌లకు ‘రేట్ కార్డ్’ వివరాలు

పేపర్ లీకేజీలు టెలిగ్రామ్, సిగ్నల్ వంటి యాప్‌ల ద్వారా విక్రయిస్తున్నట్లు సమాచారం. దీనికి గాను ఓక్కో పేపర్‌కి ఒక్కో రేటుతో లీక్ చేసారని అధికారులు తెలిపారు. NEET UG ప్రవేశ పరీక్ష కు రూ.40 లక్షలు, IIT – JEE పరీక్షప్రశ్నాపత్రానికి రూ.15 లక్షలు, రెవెన్యూ నియామకాల ప్రశ్నాపత్రానికి రూ.15 లక్షలు, పోలీసు ఉద్యోగాల పత్రాలకు రూ.10 లక్షల నుండి ₹25 లక్షలు రేట్లు ఫిక్స్ చేసుకుని లీక్ చేసినట్టు రాహుల్ గాంధీ తెలిపారు.

Advertisement

Also read: Paddy Procurement: తెలంగాణ ప్రభుత్వానికి గుడ్ న్యూస్.. కేంద్రం గ్రీన్ సిగ్నల్..?

మోదీ క్షమాపన చెప్పాలని డిమాండ్..

దేశంలో తయారీరంగం, ప్రైవేట్, ప్రభుత్వ రంగాల్లో అవకాశాలు తగ్గాయని అన్నారు. దీంతో ఇక ప్రభుత్వ ఉద్యోగాలే ఆశగా మారగా పరీక్షల వ్యవస్థ కూడా బీజేపీ దెబ్బతీస్తుందని అన్నారు. విద్యార్థుల ఆందోళనలకు కాంగ్రెస్ పార్టీ పూర్తి మద్దతు ఇచ్చిందని, ధర్మేంద్ర ప్రధాన్‌ను వెంటనే పదవి నుంచి తొలగించాలని రాహులం గాందీ డిమాండ్ చేస్తున్నామన్నారు. విద్యార్థులపై చర్యలకు బాధ్యులైన వారిపై చర్యలు తీసుకోవాలని, ప్రధానమంత్రి విద్యార్థులకు క్షమాపణ చెప్పాలని రాహుల్ గాంధీ డిమాండ్ చేశారు.

నాకు అభ్యంతరం లేదు

విద్యార్థుల డిమాండ్లపై ఎలాంటి రాజీ ఉండదని రాహుల్ గాంధీ అన్నారు. ఇవి కాంగ్రెస్ డిమాండ్లు కాదు.. విద్యార్థుల డిమాండ్లు విద్యార్థులు రోడ్డెక్కితే ప్రతిపక్షం కూడా రోడ్డెక్కాల్సిందేనిన అన్నారు. ప్రధాని నివాసానికి వెళ్లింది విద్యార్థులకు మద్దతు తెలిపేందుకేనని, నా గురించి కాదు.. విద్యార్థులపై జరిగిన అన్యాయంపైనే చర్చ జరగాలని అన్నారు. నన్ను ఐదు రెట్లు ఎక్కువగా కొట్టినా నాకు అభ్యంతరం లేదు. కానీ ధర్మేంద్ర ప్రధాన్‌ను వెంటనే తొలగించాలని డిమాండ్ చేశారు.

రాజీ ప్రసక్తే లేదు..

విద్యార్థులపై దాడులకు బాధ్యులైన వారిపై చర్యలు తీసుకోవాలని, ప్రధానమంత్రి విద్యార్థులకు బహిరంగంగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ మూడు డిమాండ్లపై రాజీ ప్రసక్తే లేదని రాహుల్ గాంధీ తేల్చి చెప్పారు. పార్లమెంట్‌లో చర్చకు ప్రభుత్వం ముందుకు రావటంలేదని, విద్యార్థుల ఉద్యమానికి కాంగ్రెస్ పార్టీ 100 శాతం మద్దతునిస్తుందని అన్నారు. విద్యార్థులు, యువత, రైతుల సమస్యలపై పోరాటం కొనసాగుతుందని, కేంద్ర ప్రభుత్వం ప్రస్తుతం తీవ్ర ఆందోళనలో ఉందని తెలిపారు.

పరిష్కారాలు డిమాండ్లు

విద్యాసంస్థలు, NTAలలో రాజకీయ నియామకాలను నిలిపివేసి స్వతంత్ర నిపుణులకు బాధ్యతలు అప్పగించాలని డిమాండ్ చేశారు. GMAT/SAT పరీక్షల తరహాలో ర్యాండమైజ్డ్ క్వశ్చన్ పేపర్లు, పటిష్టమైన సైబర్ సెక్యూరిటీ విధానాలను ప్రవేశపెట్టాలని, సమయం, డబ్బు నష్టపోయిన అభ్యర్థులకు పరిహారం అందించాలన్నారు. లీకేజీల మాఫియాపై కఠిన చట్టాలు తేవాలన్నారు. లేదంటే INDIA కూటమి తరఫున విద్యార్థుల సమస్యలపై పార్లమెంట్‌లో పూర్తి స్థాయి చర్చకు పట్టుబడతామని రాహుల్ గాంధీ స్పష్టం చేశారు.

Also read: Chinta Mohan: మోడీకి రాజ్యాంగం తెలీదు.. అమిత్ షా రాజ్యాంగం నడుస్తోంది! చింతా మోహన్ సంచలన కామెంట్స్

Related News

ప్రధాని మోడీ ఇంటి ముట్టడికి కేజ్రీవాల్ బిగ్ స్కెచ్.. E20 పెట్రోల్‌పై కేజ్రీవాల్ సమరం

బీహార్‌లో బీజేపీకి బిగ్ షాక్.. భారీ మెజారిటీతో ప్రశాంత్ కిషోర్ గెలుపు

పెళ్లే కానక్కర్లేదు.. సహజీవనానికి ఆ చట్టం వర్తిస్తుంది.. సుప్రీంకోర్టు సంచలనం

సుప్రీం కోర్టులో జడ్జీల సంఖ్య పెంపు.. లోక్‌సభలో బిల్లు ఆమోదం!

ఇంజనీరింగ్ అభ్యర్థులకు గుడ్ న్యూస్..ఎయిర్‌పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియాలో ఉద్యోగాలు

డిగ్రీ అర్హతతో 11,403 క్లర్క్ పోస్టులు.. పూర్తి వివరాలివే !

కేరళలో విరిగిపడ్డ కొండచరియలు.. ‘బిగ్ టీవీ’ ప్రతినిధులకు తప్పిన పెను ప్రమాదం

నిరసనలకు జంతర్ మంతర్ గుడ్ బై? కొత్త వేదిక ఎక్కడ, సుప్రీంకోర్టులో పిటిషన్

Big Stories

Advertisement
×