E-Paper
Advertisement

బాలకృష్ణ హెల్త్ బులెటిన్ విడుదల చేసిన ఏఐజి వైద్యబృందం!

బాలకృష్ణ హెల్త్ బులెటిన్ విడుదల చేసిన ఏఐజి వైద్యబృందం!
Advertisement

Balakrishna:నటసింహ నందమూరి బాలకృష్ణ 66 సంవత్సరాల వయసులో కూడా మాస్, యాక్షన్ పర్ఫామెన్స్ తో అదరగొట్టేస్తూ.. తన చిత్రాలతో అందరిని ఆశ్చర్యపరుస్తున్నారు. ఈ క్రమంలోనే తాజాగా ఆయన నటిస్తున్న చిత్రం NBK 111. ప్రముఖ డైరెక్టర్ గోపీచంద్ మలినేని దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమాను డిసెంబర్ 24 టార్గెట్ గా షూటింగ్ వేగంగా జరుపుతున్న విషయం తెలిసిందే. ముఖ్యంగా కాకినాడ పోర్టులో ఈ సినిమాలోని కీలక యాక్షన్ సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు.ఈ యాక్షన్ సన్నివేశాల్లో భాగంగా స్టంట్ చేస్తున్న బాలకృష్ణ ఒక్కసారిగా కాలు జారి కిందపడగా.. వెంటనే అప్రమత్తమైన చిత్ర బృందం ఆయనను సమీపంలోని స్థానిక హాస్పిటల్ కి తరలించారు.

బాలయ్య ఆరోగ్యం పై హెల్త్ బులెటిన్ విడుదల..

అక్కడ ప్రాథమిక చికిత్స అనంతరం.. మెరుగైన వైద్య సేవలు, ప్రత్యేక పరీక్షల కోసం బాలకృష్ణను అత్యవసరంగా ఎయిర్ లిఫ్ట్ ద్వారా హైదరాబాద్ తీసుకొచ్చి గచ్చిబౌలిలోని ఏఐజి హాస్పిటల్ లో చేర్పించారు. ఈ ఘటనతో నందమూరి అభిమానులలో ఒక్కసారిగా ఆందోళనలు వ్యక్తం అవుతున్నాయి. ఇకపోతే తాజాగా ఏఐజి హాస్పిటల్ వైద్య బృందం బాలయ్య ఆరోగ్య పరిస్థితి పై అధికారికంగా హెల్త్ బుల్లెట్ విడుదల చేసింది.

Advertisement

రక్తం గడ్డ కట్టడంతో పాటు వాపు కూడా..

ఈ మేరకు హాస్పిటల్ వర్గాలు విడుదల చేసిన బులెటిన్ ప్రకారం.. “బాలకృష్ణ ఎడమ మోకాలి పరిస్థితిపై ప్రాథమిక పరీక్షలు నిర్వహించారు. ఆయన ఎడమ మోకాలు చుట్టూ ఉన్న కణజాలాలలో రక్తం గడ్డకట్టడంతో పాటు తీవ్రమైన వాపు ఉన్నట్లు పరీక్షలలో తేలింది. ఇది మజిల్ టేర్ ను సూచిస్తోంది. ప్రముఖ ఆర్థోపెడిక్ సర్జన్ల బృందం పర్యవేక్షణలో ఆయనకు విస్తృతమైన క్లినికల్ డయాగ్నస్టిక్ పరీక్షలు నిర్వహిస్తున్నారు. ముఖ్యంగా ఆయన గత వైద్య చరిత్రను దృష్టిలో పెట్టుకొని, ఆయనకు ఎటువంటి కాంప్లికేషన్స్ లేకుండా సురక్షితమైన చికిత్స అందించేందుకు వివిధ విభాగాల నిపుణులతో కూడిన మల్టీడిసిప్లినరీ వైద్య బృందాన్ని రంగంలోకి దించారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి పూర్తిగా నిలకడగా ఉంది. డయాగ్నస్టిక్ పరీక్షల నివేదికలు వచ్చిన తర్వాతే తుది చికిత్స ప్రణాళికను ఖరారు చేస్తాము. ప్రస్తుతం ఆయన ఆరోగ్యానికి సంబంధించిన తదుపరి వివరాలను ఎప్పటికప్పుడు వెల్లడిస్తాము. ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదు” అంటూ ఏఐజి హాస్పిటల్ బృందం బులెటిన్ విడుదల చేసింది.

Advertisement

also read:చేతికి కట్టుతో కనిపించిన హీరో సిద్ధార్థ్.. వీడియో వైరల్!

స్పందిస్తున్న సెలబ్రెటీలు..

ఇకపోతే బాలకృష్ణకి షూటింగ్లో ప్రమాదం జరిగిందనే వార్త బయటకు రావడంతో అటు అభిమానులు ఇటు సెలబ్రిటీలు ఒక్కొక్కరు సోషల్ మీడియా వేదికగా స్పందించిన విషయం తెలిసిందే. ముఖ్యంగా నందమూరి కళ్యాణ్ రామ్, జూనియర్ ఎన్టీఆర్ కూడా సోషల్ మీడియా వేదికగా స్పందిస్తూ.. బాల బాబాయ్ త్వరగా కోలుకోండి అంటూ కోరారు. అలాగే నిర్మాతలు, దర్శకులు కూడా బాలయ్య త్వరగా రికవరీ కావాలని కోరుకుంటూ సోషల్ మీడియా వేదికగా పోస్ట్లు పెట్టారు. ఇక ప్రస్తుతం బాలయ్య ఆరోగ్య పరిస్థితిపై హాస్పిటల్ బృందం బులెటిన్ విడుదల చేయడంతో అభిమానులు కాస్త ఊపిరి పీల్చుకుంటున్నారు. త్వరగా ఆయనకు సర్జరీ చేసి ఆయనను మళ్ళీ మామూలు మనిషిని చేయాలి అంటూ కోరుతున్నారు.

Related News

కూతురికి మంత్రాలు నేర్పిస్తున్న ప్రియాంక చోప్రా.. వీడియో వైరల్!

అక్క రెడీ అంటోంది… మరి నువ్వెక్కడ మోక్షజ్ఞ?

ఇంకా ఆమె మాటే వింటున్నావా..? తమ్ముడిని ఆటాడేసుకున్న సల్మాన్!

ఈ హీరోయిన్ల బ్యాగ్‌ల రేట్లు చూస్తే షాక్ అవ్వాల్సిందే!

రష్మిక హెల్త్‌పై బిగ్ అప్‌డేట్.. గాయం తర్వాత మొదటిసారి స్పందన!

మళ్లీ అదే కథేనా… ‘ఫౌజీ’ రిలీజ్‌పై ఫ్యాన్స్ టెన్షన్!

నేనో దొంగనాకొడుకు అంటున్న లిటిల్ హార్ట్స్ మౌళి !

బేబీ బంప్‌తో కనిపించిన సమంత.. ఫొటో వైరల్!

Big Stories

Advertisement
×