// // Raghav Chadha: రాఘవ్ చద్దాను మోకాళ్లపై కూర్చోబెట్టి మరీ కొట్టారా? అసలు విషయం చెప్పిన ఆప్ మాజీ నేత -->
E-Paper
Advertisement

రాఘవ్ చద్దాను మోకాళ్లపై కూర్చోబెట్టి మరీ కొట్టారా? అసలు విషయం చెప్పిన ఆప్ మాజీ నేత

రాఘవ్ చద్దాను మోకాళ్లపై కూర్చోబెట్టి మరీ కొట్టారా? అసలు విషయం చెప్పిన ఆప్ మాజీ నేత
Advertisement

Raghav Chadha: ఆప్ బహిష్కృత నేత రాఘవ్ చద్దా వివాదం కొత్త మలుపు తిరుగుతోందా? ఆయన ఎపిసోడ్‌లో కొత్త కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయా? మాజీ సీఎం కేజ్రీవాల్ అద్దాల మేడ శీష్‌‌మహల్‌లో ఆయన్ని కొట్టిందెవరు? ఆప్‌లో ఏం జరుగుతోంది? ఈ విషయంలో రాఘవ్ ఎందుకు సైలెంట్‌గా ఉన్నారు? ఇవే ప్రశ్నలు చాలామందిని వెంటాడుతున్నాయి.

ఎంపీ రాఘవ్ చద్దా ఇష్యూ కొత్త మలుపు

Advertisement

ఆప్ పార్టీలో రాజకీయాలు ఇప్పుడు ఎంపీ రాఘవ్ చద్దా చుట్టూనే తిరుగుతున్నాయి. ఆయనపై ఆ పార్టీ ఆరోపణలు చేసిన తర్వాత కొత్త కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. తాజాగా మాజీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ నివాసంలో చద్దాను కొట్టారంటూ ఆప్ హర్యానా మాజీ అధ్యక్షుడు నవీన్ జైహింద్ ఆరోపించారు. ఇటీవల రాజ్యసభలో పార్టీ ఉప నాయకుడి పదవి నుంచి ఆయన్ని తొలగించింది ఆప్ పార్టీ.

దీంతో  ఆయనకు- ఆప్‌కు మధ్య అంతర్గత విభేదాలు నెలకొన్న నేపథ్యంలో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. హర్యానా ఆప్ మాజీ అధ్యక్షుడు నవీన్ జైహింద్ ఓ వీడియో ఎక్స్ వేదికగా పోస్టు చేశారు. అందులో రాఘవ్ చద్దా ధనవంతుడని పేర్కొన్నారు. ఢిల్లీ మాజీ సీఎం అధికారిక నివాసంగా పేరుపొందిన శేష్‌మహల్‌‌లో రాఘవ చద్దాపై దాడి జరిగిందని ఆరోపించారు.

Advertisement

శీష్‌‌మహల్‌లో ఏం జరిగింది? ఆయన్ని ఎవరు కొట్టారు?

అక్కడ నిన్ను కొట్టిందెవరు? కంటికి గాయంకావడంతో ఇంగ్లాండ్‌ వెళ్లారని అన్నారు. ఈ విషయంలో ఓ మహిళా ఎంపీకి ఎక్కువ ధైర్యం ఉందన్నారు. ధైర్యం చూపించు రాఘవ్, ఆనాడు ఏం జరిగిందో ప్రజలకు చెప్పాలంటూ ఆయన పేర్కొన్నారు. సూట్‌కేసుల వ్యవహారం, జరిగిన లావాదేవీల గురించి వెల్లడించాలన్నారు.

రాజ్యసభలో మీరు ఉన్నారని, చాలా విషయాలు మీరు ప్రస్తావిస్తారని అన్నారు.  దీని గురించి ఎందుకు మాట్లాడరని ప్రశ్నించారు. మిమ్మల్ని కొడుతున్నప్పుడు, మీ లావాదేవీల గురించి ప్రశ్నిస్తున్నప్పుడు అక్కడున్న నలుగురి పేర్లు చెప్పాలన్నారు. ఆ నివాసంలో రాఘవ్ చద్దా ఏడుస్తూనే ఉన్నాడని, ఆయనకు ఎవరూ మద్దతు ఇవ్వలేదన్నారు.

ALSO READ: పీఎన్జీ కనెక్షన్ దరఖాస్తు విధానం ఇదే.. కావాల్సిన పత్రాలు ఏంటంటే?

రెండేళ్ల కిందట ఆప్ ఎంపీ ఎంపీ స్వాతి మాలివాల్‌ను నవీన్ జైహింద్ లాగారు. తాను దెబ్బలు తిన్న విషయాన్ని ప్రజలకు చెప్పలేని రాఘవ్ చద్దా కంటే ఓ మహిళా ఎంపీకే ఎక్కువ ధైర్యం ఉందన్నారు. 2024లో ఢిల్లీలోని అప్పటి ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ అధికారిక నివాసంలో ఆయన సన్నిహితుడు బిభవ్ కుమార్ తనపై దాడి చేశారని స్వాతి మాలివాల్ ఆరోపించారు.

తనను పలుమార్లు చెంప దెబ్బలు, ఛాతీ, పొట్ట భాగంలో కొట్టారంటూ ఆమె ఫిర్యాదు చేసిన విషయం తెల్సిందే.  గతంలో ఎంపీ స్వాతి మాలివాల్‌, ఇప్పుడు రాఘవ్ చద్దాలపై దాడులు జరుగుతుండడంతో ఆప్ పార్టీలో ఇంకా ఏదో జరుగుతున్న చర్చ అప్పుడు ఉత్తరాదిలో మొదలైంది.  రానున్న రోజుల్లో ఈ వ్యవహారానికి సంబంధించి ఇంకెన్ని విషయాలు బయటకు వస్తాయో చూడాలి.

 

Related News

ప్రధాని మోడీ ఇంటి ముట్టడికి కేజ్రీవాల్ బిగ్ స్కెచ్.. E20 పెట్రోల్‌పై కేజ్రీవాల్ సమరం

బీహార్‌లో బీజేపీకి బిగ్ షాక్.. భారీ మెజారిటీతో ప్రశాంత్ కిషోర్ గెలుపు

పెళ్లే కానక్కర్లేదు.. సహజీవనానికి ఆ చట్టం వర్తిస్తుంది.. సుప్రీంకోర్టు సంచలనం

సుప్రీం కోర్టులో జడ్జీల సంఖ్య పెంపు.. లోక్‌సభలో బిల్లు ఆమోదం!

ఇంజనీరింగ్ అభ్యర్థులకు గుడ్ న్యూస్..ఎయిర్‌పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియాలో ఉద్యోగాలు

డిగ్రీ అర్హతతో 11,403 క్లర్క్ పోస్టులు.. పూర్తి వివరాలివే !

కేరళలో విరిగిపడ్డ కొండచరియలు.. ‘బిగ్ టీవీ’ ప్రతినిధులకు తప్పిన పెను ప్రమాదం

నిరసనలకు జంతర్ మంతర్ గుడ్ బై? కొత్త వేదిక ఎక్కడ, సుప్రీంకోర్టులో పిటిషన్

Big Stories

Advertisement
×