E-Paper
Advertisement

Weekend OTT Movies : ఈ వీకెండ్ ఓటీటీ లవర్స్ కు పండగే.. వామ్మో ఇన్ని సినిమాలా..

Weekend OTT Movies : ఈ వీకెండ్ ఓటీటీ లవర్స్ కు పండగే.. వామ్మో ఇన్ని సినిమాలా..
Advertisement

Weekend OTT Movies : ఓటిటి ప్రియులకు ఈ వారం పండగే.. ఎందుకంటే గత వారంతో పోలిస్తే ఈ వారం కొన్ని ఇంట్రెస్టింగ్ సినిమాలు ఓటీటీలోకి వచ్చేస్తున్నాయి.. ఏప్రిల్ మొదటి వారంలో ప్రేక్షకులను అలరించేందుకు నెట్‌ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్ వీడియో, జీ5, జియోహాట్‌స్టార్ వంటి డిజిటల్ స్ట్రీమింగ్ ప్లాట్ ఫామ్స్ లలోకి వచ్చేందుకు రెడీగా ఉన్నాయి. తెలుగు, హిందీ, తమిళంతో పాటు అంతర్జాతీయ సినిమాలు కూడా ఈ జాబితాలో ఉన్నాయి. మరి ఈ వీకెండ్ మిస్ అవ్వకుండా చూడాల్సిన సినిమాలు ఏవి? ఎక్కడ ఏ మూవీ రాబోతుందో ఒకసారి చూసేద్దాం..

వీకెండ్ ఓటీటీలోకి రాబోతున్న సినిమాలు.. 

 మృత్యుంజయ్..

సామజ వరగమన సినిమాతో హీరోగా తెలుగు ప్రేక్షకులకు పరిచయమయ్యాడు శ్రీ విష్ణు.. ఆ సినిమా భారీ విజయాన్ని అందుకోవడంతో ఆ తర్వాత వెనక్కి తిరిగి చూడకుండా వరుసగా హీరోగా సినిమాలు చేస్తూ ప్రేక్షకులను తన నటనతో అలరిస్తూ వస్తున్నాడు.. ఈయన ప్రతి ఏడది రెండు సినిమాలతో ప్రేక్షకులను కచ్చితంగా పలకరించేవాడు. ఈ ఏడాదిలో వచ్చిన సినిమాలు ఆయనకు పెద్దగా హిట్ టాక్ ని అందించలేదు.. అలాంటి సినిమాల్లో మృత్యుంజయ ఒకటి.. రీసెంట్ గా థియేటర్లోకి వచ్చిన ఈ మూవీ బాక్స్ ఆఫీస్ వద్ద పర్వాలేదు అనే టాక్ ను అందుకుంది.. ఇప్పుడు ఓటీటీలోకి వచ్చేసింది. ఈ మూవీ ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కు వచ్చింది.

సాంప్రదాయని సుప్పిని సుద్దపూసిని.. 

Advertisement

ఒకప్పుడు హీరోగా వరుసగా సినిమాలు చేసి హ్యాట్రిక్ విజయాన్ని సొంతం చేసుకున్న నటుడు శివాజీ ప్రస్తుతం డిఫరెంట్ స్టోరీలతో ప్రేక్షకులు ముందుకు వస్తున్నాడు. ఎలా నటించిన లేటెస్ట్ చిత్రం సాంప్రదాయని సుప్పిని సుద్ధ పూసిని.. శివాజీ, లయ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ క్రైమ్ కామెడీలో ఒక నిజాయితీ గల పంచాయతీ సెక్రటరీ కుటుంబం ఒక హత్య కేసులో ఎలా ఇరుక్కుంటుంది. అయితే అందులోంచి ఆ ఫ్యామిలీ ఎలా బయటపడ్డారు అన్నది ఈ సినిమా స్టోరీ.. రీసెంట్ గా నెట్ ఫ్లిక్స్ లోకి అడుగుపెట్టింది.

యూఫోరియా..

సారా అర్జున్, భూమిక చావ్లా నటించిన లేటెస్ట్ మూవీ యూఫోరియా మూవీ.. హైదరాబాద్‌లోని ఒక టాప్ కాలేజీ నేపథ్యంలో సాగే ఈ యూత్ ఫుల్ డ్రామా సోషల్ మీడియా ప్రభావం ఎలా ఉంటుంది అన్నది ఈ సినిమా స్టోరీలో చక్కగా చూపించారు.. ఏప్రిల్ 2న ఓటిటిలోకి వచ్చిన ఈ మూవీ ప్రముఖ ఓటిటి సంస్థ ఈటీవీ విన్ లో స్ట్రీమింగ్ అవుతుంది.

Advertisement

కేవలం సినిమాలు మాత్రమే కాదు అటు వెబ్ సిరీస్ కూడా జనాలను ఆకట్టుకునే విధంగా ఉన్నాయని చెప్పాలి. సితారే జమీన్ పర్, హ్యాపీ పటేల్: ఖతర్నాక్ జాసూస్, మామ్లా లీగల్ హై: సీజన్ 2, వధ్ 2 వంటి ఇంట్రెస్టింగ్ వెబ్ సిరీస్ లు కూడా వస్తున్నాయి. ఇవే కాదు వేరే భాషల్లోని వెబ్ సిరీస్ లో సినిమాలు కూడా ఈ వారం సందడి చేయబోతున్నాయి. మరి ఏ మూవీ ఎలాంటి వ్యూస్ ను సొంతం చేసుకుంటుందో చూడాలి..

Tags

Related News

ఒక్క వీడియో కాల్‌తో రోడ్డున పడే కుటుంబం… షాకింగ్ సైబర్ క్రైమ్ థ్రిల్లర్

ఇంటి పనులు చేసే దెయ్యం… హారర్‌కు కొత్త అర్థం చెప్పిన సినిమా

డెమోన్ స్లేయర్ క్లైమాక్స్ ఆరంభం… రోమాలు నిక్కబొడుచుకునే యానిమే యాక్షన్ మూవీ

20 ఏళ్ల తర్వాత కంబ్యాక్… నవ్వులతో పాటు ఎమోషన్స్ లో ముంచెత్తే కొరియన్ కామెడీ డ్రామా

270 మంది ప్రాణాలు… ప్రపంచాన్ని కుదిపిన విమాన విషాదం… ఎమోషనల్ క్రైమ్ థ్రిల్లర్ సిరీస్

కిడ్నాప్ కేసుతో కోర్టులో సంచలనం… ఏడు ఎపిసోడ్లలో అదిరే లీగల్ థ్రిల్లర్

11 రోజుల్లో షూట్.. ఆహాలో ట్రెండింగ్ తెలుగు ఫ్యామిలీ వెబ్ సిరీస్

సిబిల్ స్కోర్ చూశాకే పెళ్లి… 20 నిమిషాలు ఫుల్ ఫన్ ఈ తెలుగు సిరీస్

Big Stories

Advertisement
×