E-Paper
Advertisement

Narendra Modi: కారు బాంబు పేలుడులో గాయపడిన బాధితులను పరామర్శించిన ప్రధాని మోదీ

Narendra Modi:  కారు బాంబు పేలుడులో గాయపడిన బాధితులను పరామర్శించిన ప్రధాని మోదీ
Advertisement

Narendra Modi: ఢిల్లీ ఎర్రకోట కారు పేలుడు దుర్ఘటనలో గాయాలపాలైన వారిని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ పరామర్శించారు. రెండు రోజుల భూటాన్ పర్యటన ముగించుకుని ఢిల్లీ చేరుకున్న ప్రధాని మోదీ, ఎయిర్ పోర్ట్ నుంచి నేరుగా లోక్ నాయక్ జయప్రకాష్(LNJP) ఆసుపత్రికి ప్రధాని వెళ్ళారు. ఈ ఘటనలో గాయపడిన వారిని, కుటుంబ సభ్యులను ప్రధాని పరామర్శించారు. వారి యోగక్షేమాలను ప్రధాని అడిగి తెలుసుకున్నారు. కారు బాంబు పేలుడులో ఇప్పటివరకు 12 మంది మృతి చెందగా, దాదాపు 30 మందికి తీవ్ర గాయాలయ్యాయి.

ఢిల్లీలో జరిగిన దురదృష్టకర సంఘటన మొత్తం నగరాన్ని దిగ్భ్రాంతికి గురిచేసింది. ఈ ఘటనలో తమ ప్రియమైన వారిని కోల్పోయిన, గాయపడిన అన్ని కుటుంబాలకు ఢిల్లీ ప్రభుత్వం తన ప్రగాఢ సానుభూతిని తెలియసింది. బాధిత ప్రతి కుటుంబానికి ఢిల్లీ ప్రభుత్వం అండగా నిలుస్తుందని ఢిల్లీ సీఎం రేఖా గుప్తా హామీ ఇచ్చారు. తక్షణ సహాయం కింద మరణించిన వారి కుటుంబాలకు ₹10 లక్షలను ఢిల్లీ ప్రభుత్వం ప్రకటించింది. శాశ్వతంగా వికలాంగులైన వారికి ₹5 లక్షలు, తీవ్రంగా గాయపడిన వారికి ₹2 లక్షలు ప్రకటించారు.

Advertisement

పేలుడు కేసు దర్యాప్తును ఎన్ఐఏకు అప్పగించింది కేంద్ర హోం శాఖ. యన్ఐఏ దర్యాప్తు మరింత వేగంగా దర్యాప్తు చేయాలని ఆదేశించింది. దర్యాప్తులో భాగంగా దాదాపు 8 మంది జూనియర్ డాక్టర్లను ఎన్ఐఏ అదుపులోకి తీసుకుంది. నవంబర్ 10 సాయంత్రం సుమారు 6.55 గంటల ప్రాంతంలో ఢిల్లీలోని చారిత్రక ఎర్రకోట సమీపంలో ఎర్రకోట మెట్రో స్టేషన్ గేట్ నంబర్ 1 వద్ద పార్క్ చేసిన ఒక కారులో అత్యంత శక్తివంతమైన పేలుడు సంభవించింది.  పేలుడు ధాటికి ఆరు కార్లు, నాలుగు ఆటో రిక్షాలు, నాలుగు బైక్‌లు పూర్తిగా దగ్ధమయ్యాయి.

Read Also: Delhi Vs Islamabad Blasts: ఢిల్లీ పేలుడు ఘటన.. దాయాది దేశం పనే? నిజాలు చెప్పిన పాక్ జర్నలిస్ట్

Advertisement

 

Related News

ప్రధాని మోడీ ఇంటి ముట్టడికి కేజ్రీవాల్ బిగ్ స్కెచ్.. E20 పెట్రోల్‌పై కేజ్రీవాల్ సమరం

బీహార్‌లో బీజేపీకి బిగ్ షాక్.. భారీ మెజారిటీతో ప్రశాంత్ కిషోర్ గెలుపు

పెళ్లే కానక్కర్లేదు.. సహజీవనానికి ఆ చట్టం వర్తిస్తుంది.. సుప్రీంకోర్టు సంచలనం

సుప్రీం కోర్టులో జడ్జీల సంఖ్య పెంపు.. లోక్‌సభలో బిల్లు ఆమోదం!

ఇంజనీరింగ్ అభ్యర్థులకు గుడ్ న్యూస్..ఎయిర్‌పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియాలో ఉద్యోగాలు

డిగ్రీ అర్హతతో 11,403 క్లర్క్ పోస్టులు.. పూర్తి వివరాలివే !

కేరళలో విరిగిపడ్డ కొండచరియలు.. ‘బిగ్ టీవీ’ ప్రతినిధులకు తప్పిన పెను ప్రమాదం

నిరసనలకు జంతర్ మంతర్ గుడ్ బై? కొత్త వేదిక ఎక్కడ, సుప్రీంకోర్టులో పిటిషన్

Big Stories

Advertisement
×