E-Paper
Advertisement

PM Modi on Lok sabha: ఇరాన్ యుద్ధం.. పశ్చిమాసియాలో పరిస్థితులు ఆందోళనకరం, లోక్‌సభలో ప్రధాని మోదీ

PM Modi on Lok sabha:  ఇరాన్ యుద్ధం.. పశ్చిమాసియాలో పరిస్థితులు ఆందోళనకరం, లోక్‌సభలో ప్రధాని మోదీ
Advertisement

PM Modi on Lok sabha: ఇరాన్ యుద్ధం నేపథ్యంలో పశ్చిమాసియాలోని పరిస్థితులు ఆందోళనకరంగా ఉన్నాయని ప్రధాని నరేంద్రమోదీ. గల్ఫ్ దేశాల్లో జరుగుతున్న పరిస్థితులపై సోమవారం లోక్ సభలో మాట్లాడారు. గల్ఫ్ దేశాల్లో జరుగుతున్న యుద్ధం వల్ల అనేక సమస్యలు వస్తున్నాయని పేర్కొన్నారు. అక్కడ జరుగుతున్న యుద్ధం పరిస్థితులను ఎప్పటికప్పుడు గమనిస్తున్నట్లు తెలిపారు.

పశ్చిమాసియాలో పరిస్థితులు ఆందోళనకరం-ప్రధాని మోదీ

Advertisement

ఆర్థిక అంశాలపై అనేక సమస్యలు ఎదుర్కుంటున్నట్లు తెలిపారు. గల్ఫ్ నుంచి మనకు ముడి చమురు, గ్యాస్ ఎక్కువగా వస్తోందన్నారు. యుద్ధం వల్ల ఇతర దేశాలతో జరిగే వాణిజ్యం దెబ్బతింటోందన్నారు. ముడి చమురు సముద్ర మార్గం ద్వారా మనం తెచ్చుకుంటున్నామని తెలిపారు. ఆయా దేశాల్లో చిక్కుకున్నవారిని సురక్షితంగా తీసుకొచ్చామన్నారు.

పశ్చిమాసియాతో మనకు అనేక సంబంధాలున్నాయని, ఇప్పటివరకు 3.75 లక్షల మందిని వెనక్కి తీసుకొచ్చామన్నారు. అక్కడి భారతీయులకు సహాయం చేస్తున్నామని, ఎప్పటికప్పుడు అడ్వైజరీలు జారీ చేస్తున్నట్లు వివరించారు. కంట్రోల్ రూమ్ లు 24గంటలపాటు సేవలందిస్తున్నట్లు తెలియజేశారు.

Advertisement

ఇరాన్ యుద్ధం నేపథ్యంలో లోకసభలో ప్రధాని ప్రసంగం

భారతీయుల రక్షణ మా ప్రభుత్వ మొదటి ప్రాధాన్యమని అన్నారు ప్రధాని. ఇరాన్ నుంచి వెయ్యి మంది భారతీయలు సురక్షితంగా వచ్చారన్నారు. గ్యాస్‌పై ప్రభావం పడకుండా చర్యలు తీసుకున్నట్లు వివరించారు. గ్యాస్ సరఫరాకు ప్రాధాన్యత ఇస్తున్నట్లు తెలియజేశారు. హర్మూజ్ జలసంధి ద్వారా నౌకా రవాణా సవాల్‌గా మారిందన్నారు. ప్రస్తుతం 53 లక్షల మెట్రిక్ టన్నుల పెట్రోల్ నిల్వలు ఉన్నాయన్నారు.

ప్రజల జీవితాలపై యుద్ధం ప్రభావం చూపిస్తుందన్నారు ప్రధాని నరేంద్రమోదీ. ముడి చమురు, ఎల్ పీజీని గతంలో 27 దేశాల నుంచి దిగుమతి చేసుకున్నామని, ఇప్పుడు ఆ సంఖ్య పెంచాలమన్నారు. ప్రస్తుతం 41 దేశాల నుంచి చమురు దిగుమతి చేసుకుంటున్నట్లు సభలో వివరించారు.

ALSO READ: తేలిక కానున్న గ్యాస్ బండ.. కేంద్ర ప్రభుత్వం సరికొత్త వ్యూహం

ప్రస్తుతం మనకు సరిపడా నిల్వలు ఉన్నాయన్నారు.ముడి చమురు, గ్యాస్, ఎరువుల రవాణాకు ఆటంకం లేకుండా చర్యలు తీసుకున్నట్లు తెలియజేశారు. ఇతర దేశాలతో నిరంతరం చర్చలు జరుపుతున్నట్లు తెలిపారు. మన నౌకలు సురక్షితంగా భారత్ కు చేరేలా జాగ్రత్తలు తీసుకున్నామని, ప్రస్తుతం పెట్రోల్ లో 20 శాతం ఇథనాల్ కలుపుతున్నట్లు తెలిపారు.

రైల్వేలు విద్యుదీకరణ వల్ల డీజిల్ వినియోగం బాగా తగ్గిందన్నారు. దేశవ్యాప్తంగా ఈవీ బస్సులు, ఇతర వామనాలు పెరుగుతున్నాయన్నారు. భవిష్యత్‌లో ఈవీ వాహనాల వినియోగం పెరిగేలా చర్యలు తీసుకుంటామని చెప్పకనే చెప్పారు. ప్రపంచంలో ఎక్కడ సమస్య వచ్చినా భారత్ పై ప్రభావం పడుతుందన్నారు.

Related News

ప్రధాని మోడీ ఇంటి ముట్టడికి కేజ్రీవాల్ బిగ్ స్కెచ్.. E20 పెట్రోల్‌పై కేజ్రీవాల్ సమరం

బీహార్‌లో బీజేపీకి బిగ్ షాక్.. భారీ మెజారిటీతో ప్రశాంత్ కిషోర్ గెలుపు

పెళ్లే కానక్కర్లేదు.. సహజీవనానికి ఆ చట్టం వర్తిస్తుంది.. సుప్రీంకోర్టు సంచలనం

సుప్రీం కోర్టులో జడ్జీల సంఖ్య పెంపు.. లోక్‌సభలో బిల్లు ఆమోదం!

ఇంజనీరింగ్ అభ్యర్థులకు గుడ్ న్యూస్..ఎయిర్‌పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియాలో ఉద్యోగాలు

డిగ్రీ అర్హతతో 11,403 క్లర్క్ పోస్టులు.. పూర్తి వివరాలివే !

కేరళలో విరిగిపడ్డ కొండచరియలు.. ‘బిగ్ టీవీ’ ప్రతినిధులకు తప్పిన పెను ప్రమాదం

నిరసనలకు జంతర్ మంతర్ గుడ్ బై? కొత్త వేదిక ఎక్కడ, సుప్రీంకోర్టులో పిటిషన్

Big Stories

Advertisement
×