E-Paper
Advertisement

Ganja Seizure: సంగారెడ్డిలో భారీగా గంజాయి పట్టివేత.. 600 కిలోల గంజాయి సీజ్!

Ganja Seizure: సంగారెడ్డిలో భారీగా గంజాయి పట్టివేత.. 600 కిలోల గంజాయి సీజ్!
Advertisement

Ganja Seizure: సంగారెడ్డి జిల్లాలో పోలీసులు భారీ ఎత్తున నిర్వహిస్తున్న తనిఖీల్లో భాగంగా అర్థరాత్రి భారీగా గంజాయి పట్టుబడింది. సదాశివపేట మండలంలోని నందికంది జాతీయ రహదారిపై అక్రమంగా తరలిస్తున్న సుమారు 600 కిలోల ఎండు గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటన స్థానికంగా పెను సంచలనం సృష్టించింది.

పక్కా సమాచారంతో పోలీసులు జాతీయ రహదారిపై కాపు కాశారు. ఈ క్రమంలో సంగారెడ్డి వైపు నుండి జహీరాబాద్ వైపు వెళ్తున్న ఒక డీసీఎం వాహనాన్ని, దానికి పైలటింగ్‌గా వస్తున్న ఒక కారును పోలీసులు అడ్డుకున్నారు. పోలీసులను చూసిన వెంటనే గంజాయి ముఠా సభ్యులు వాహనాలను అక్కడే వదిలేసి పరారయ్యేందుకు ప్రయత్నించారు. అయితే పోలీసులు చాకచక్యంగా వ్యవహరించి.. వెంబడించి ఇద్దరు నిందితులను అదుపులోకి తీసుకున్నారు.

Advertisement

పట్టుబడిన గంజాయి విలువ మార్కెట్లో భారీగా ఉంటుందని అంచనా వేస్తున్నారు. డీసీఎం వాహనంలో అత్యంత రహస్యంగా తరలిస్తున్న ఈ ఎండు గంజాయిని, రవాణాకు వాడిన వాహనాలను పోలీసులు సీజ్ చేశారు. ప్రస్తుతం సదాశివపేట పోలీసులు కేసు నమోదు చేసి.. పారిపోయిన మిగిలిన నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. ఈ ముఠా ఎక్కడి నుండి గంజాయిని సేకరించింది, ఎక్కడికి తరలిస్తోంది అనే కోణంలో దర్యాప్తు వేగవంతం చేశారు.

Also Read: రైలు కింద పడి ఇద్దరు స్నేహితులు ఆత్మహత్య!

Related News

పెను విషాదం.. 40 మందితో వెళుతోన్న ప‌డ‌వ బోల్తా

మధ్యప్రదేశ్‌లో విషాదం.. ఎద్దును రక్షించబోయి ముగ్గురు మృతి!

ఘోర బస్సు ప్రమాదం.. క్షణాల వ్యవధిలో తగలబడిన బస్సు.. స్పాట్‌లో!

ఘట్‌కేసర్‌లో ఘోర విషాదం.. రైలు కింద పడి దంపతుల ఆత్మహత్య!

ఈగల్ ఫోర్స్ ‘మరో’ సక్సెస్ ఆపరేషన్.. 180 కిలోల గంజాయి సీజ్!

26 రోజుల ఎదురుచూపు.. ఏజెన్సీ గ్రామాలను కుదిపేస్తున్న తండ్రి ఆవేదన!

టోల్ ప్లాజా వద్ద పేలిన ఎల్పీజీ ట్యాంకర్.. ఆరుగురు మృతి!

పెళ్లి వేడుకల్లో ఊహించని విషాదం.. లారీ రూపంలో వచ్చిన రాక్షసుడు.. ఒకే కుటుంబంలో నలుగురు బలి!

Big Stories

Advertisement
×