E-Paper
Advertisement

పిల్లలను రెచ్చగొట్టొద్దు..లీక్ ఘోర పాపం, నీట్‌పై నోరు విప్పిన ప్రధాని మోదీ

పిల్లలను రెచ్చగొట్టొద్దు..లీక్ ఘోర పాపం, నీట్‌పై నోరు విప్పిన ప్రధాని మోదీ
Advertisement

Modi on NEET: నీట్ పేపర్ లీకేజ్ వ్యవహారంపై హస్తినలో నిరసనలు తీవ్రమవుతున్నాయి. ఈ నేపథ్యంలో దీనిపై ప్రధాని మోదీ తొలిసారి నోరు విప్పారు. పేపర్ లీక్ ఘోర పాపమని అన్నారు. ఇలాంటివి మళ్లీ జరగకూడదని వ్యాఖ్యానించారు. బాధ్యులైనవారిని కఠినంగా శిక్ష విధించాలన్నారు. ఇలాంటి లీక్‌లను నివారించడం జాతీయ బాధ్యతగా పేర్కొన్నారు.

నీట్‌పై నోరు విప్పిన ప్రధాని మోదీ-మంగళ్‌ మిలన్‌ పేరిట జరిగిన ఎన్డీయే పార్లమెంటరీ పార్టీ సమావేశంలో ప్రధాని మోదీ ఈ వ్యాఖ్యలు చేశారు. ప్రధాని చెప్పిన అంశాలను కేంద్రమంత్రి కిరణ్‌ రిజిజు వెల్లడించారు. పటిష్టమైన పరీక్షా వ్యవస్థను నిర్మించేందుకు సమిష్టిగా అందరూ కృషి చేయాలని ప్రధానమంత్రి పిలుపు నిచ్చిన విషయాన్ని గుర్తు చేశారు. పార్లమెంట్‌లో చర్చలు జరిగేలా విపక్షాలు సహకరించాలన్నారు.

Advertisement

పిల్లలను రెచ్చగొట్టొద్దు-రాజకీయంగా విభేదాలు ఉండొచ్చుకానీ, దేశ భవిష్యత్తు-యువత సంక్షేమం కోసం పని చేయాల్సిన బాధ్యత ఎంపీలందరిపై ఉందన్నారు ప్రధాని. పిల్లలను రెచ్చగొట్టొద్దని హితవు పలికారు. తప్పుడు మార్గంలోకి వెళ్లడం సులభమని, తిరిగి సరైన మార్గంలోకి రావడం చాలా కష్టమన్నారు. వారు సరైన మార్గంలో వెళ్లేలా చూసుకోవడం అందరి బాధ్యతగా పేర్కొన్నారు.

లీక్ ఘోర పాపమన్న ప్రధాని మోదీ-నీట్ పేపర్ లీక్ వ్యవహారంపై వేలాదిమంది నిరసనకారులు పార్లమెంట్ ముట్టడికి పిలుపు నిచ్చారు. వారిని బలగాలు అడ్డుకున్న నేపథ్యంలో ఒక రోజు తర్వాత ఈ వ్యాఖ్యలు చేశారు ప్రధాని.  నీట్ పేపర్ లీక్ విషయం వెలుగులోకి వచ్చిన వెంటనే ప్రభుత్వం వేగంగా స్పందించిందన్నారు. 13 మంది నిందితులను అరెస్టు చేసి జైలుకు పంపిందని మంత్రి కిరణ్ రిజిజు అన్నారు.

Advertisement

అభ్యర్థుల భవిష్యత్తును కాపాడటానికి, ప్రభుత్వం నీట్ పరీక్షను మళ్లీ నిర్వహించిందన్నారు. దానిని విజయవంతంగా నిర్వహించడం, ఫలితాలను అనుకున్న సమయానికి ప్రకటించిందని తెలిపారు. మే 6న తాత్కాలిక నీట్ జవాబు కీ విడుదల చేసిన తర్వాత నీట్ పరీక్ష‌పై అసలు వివాదం మొదలైంది.

ALSO READ: హస్తిన వైపు కదం తొక్కిన రైతన్నలు.. శంభు బార్డర్ వద్ద హైటెన్షన్, అడ్డుకున్న పోలీసు బలగాలు, ఎందుకు?

పరీక్షకు ముందు రాజస్థాన్‌లో చేతితో రాసిన ప్రశ్నల పత్రం ఒకటి బయటపడింది. రాజస్థాన్, ఉత్తరాఖండ్‌ల నుండి వచ్చిన ఆరోపణలను NTA.. కేంద్ర ఏజెన్సీలకు నివేదించింది. పరీక్షకు ముందే 400కు పైగా ప్రశ్నలు లీక్ అయ్యాయని, వాటిలో 135 ప్రశ్నలు ప్రశ్నాపత్రంతో సరిపోలాయని రాజస్థాన్ పోలీసులు పేర్కొన్నారు.

ఈ నేపథ్యంలో నీట్ పరీక్షను ఎన్టీఏ రద్దు చేసింది. మళ్లీ నిర్వహించిన విషయం తెల్సిందే. నీట్ ప్రశ్నాపత్రాల నీట్‌పై సీబీఐ దర్యాప్తు చేస్తున్న సమయంలో డజను మందిని అరెస్టు చేసింది. నేషనల్ ఎలిజిబిలిటీ ఎంట్రన్స్ టెస్ట్-నీట్ దేశంలో అత్యంత పోటీ పరీక్షలలో ఒకటి. ఈ పరీక్షకు రెండు మిలియన్లకు పైగా విద్యార్థులు హాజరవుతారు.

Related News

ప్రధాని మోడీ ఇంటి ముట్టడికి కేజ్రీవాల్ బిగ్ స్కెచ్.. E20 పెట్రోల్‌పై కేజ్రీవాల్ సమరం

బీహార్‌లో బీజేపీకి బిగ్ షాక్.. భారీ మెజారిటీతో ప్రశాంత్ కిషోర్ గెలుపు

పెళ్లే కానక్కర్లేదు.. సహజీవనానికి ఆ చట్టం వర్తిస్తుంది.. సుప్రీంకోర్టు సంచలనం

సుప్రీం కోర్టులో జడ్జీల సంఖ్య పెంపు.. లోక్‌సభలో బిల్లు ఆమోదం!

ఇంజనీరింగ్ అభ్యర్థులకు గుడ్ న్యూస్..ఎయిర్‌పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియాలో ఉద్యోగాలు

డిగ్రీ అర్హతతో 11,403 క్లర్క్ పోస్టులు.. పూర్తి వివరాలివే !

కేరళలో విరిగిపడ్డ కొండచరియలు.. ‘బిగ్ టీవీ’ ప్రతినిధులకు తప్పిన పెను ప్రమాదం

నిరసనలకు జంతర్ మంతర్ గుడ్ బై? కొత్త వేదిక ఎక్కడ, సుప్రీంకోర్టులో పిటిషన్

Big Stories

Advertisement
×