E-Paper
Advertisement

సిట్రోయెన్ మాస్టర్ స్ట్రోక్.. బసాల్ట్ ఎక్స్ కంఫర్ట్ ఎడిషన్ విడుదల!

సిట్రోయెన్ మాస్టర్ స్ట్రోక్.. బసాల్ట్ ఎక్స్ కంఫర్ట్ ఎడిషన్ విడుదల!
Advertisement

Citroen Basalt X Comfort Edition Launched: సిట్రోయెన్ ఇండియా భారత మార్కెట్లో బసాల్ట్ ఎక్స్ కంఫర్ట్ ఎడిషన్ను విడుదల చేసింది. ఈ కొత్త వేరియంట్ ప్రారంభ ధర రూ. 8.75 లక్షలుగా నిర్ణయించింది. ఇది బేస్ ‘యూ’ వేరియంట్ కంటే రూ.20,000 ఎక్కువ. ఎక్కువ ధరకు తగినట్లుగానే ఈ ఎడిషన్‌లో మరిన్ని ఫీచర్లు, ప్రీమియం ఇంటీరియర్ అప్‌ గ్రేడ్‌లు అందించింది. ఎయిర్‌ క్రాస్ తర్వాత  కంఫర్ట్ ఎడిషన్ పొందిన రెండో సిట్రోయెన్ మోడల్ ఇదే కావడం విశేషం.

కొత్త ఎడిషన్ లో సరికొత్త ఫీచర్లు

కొత్త బసాల్ట్ ఎక్స్ కంఫర్ట్ ఎడిషన్‌ లో ప్రయాణికుల సౌకర్యాన్ని దృష్టిలో పెట్టుకుని సరికొత్త ఫీచర్లను జోడించారు. ఇందులో బేజ్ లెదరెట్ సీట్లు, 10.25 అంగుళాల టచ్‌ స్క్రీన్ ఇన్ఫోటైన్‌ మెంట్ సిస్టమ్, వైర్‌ లెస్ ఫోన్ ఛార్జర్, JBL ప్రీమియం ఆడియో సిస్టమ్, డ్యూయల్ డ్యాష్‌ క్యామ్‌ లు, ప్రిడిక్టివ్ సేఫ్టీ అలర్ట్స్, అలాగే రియర్ వ్యూ కెమెరా లాంటి ఫీచర్లు ఉన్నాయి. ఈ అప్‌ డేట్లతో క్యాబిన్ మరింత ప్రీమియంగా కనిపించడంతో పాటు ట్రావెలింగ్ ఎక్స్ పీరియెన్స్ కూడా మెరుగుపడనుంది.

ఇంజిన్ ఆప్షన్స్ గురించి..

Advertisement

ఇంజిన్ ఆప్షన్స్  విషయానికి వస్తే, బేస్ ‘యూ’ వేరియంట్‌ లో 1.2 లీటర్ నేచురల్లీ ఆస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజిన్ ఉంటుంది. ఇది 82 హెచ్‌పీ పవర్, 115 ఎన్ఎం టార్క్ ఉత్పత్తి చేస్తుంది. దీనికి 5 స్పీడ్ మాన్యువల్ గే ర్‌బాక్స్ అందించారు. అదే మిడ్ లెవల్ ‘ప్లస్’ వేరియంట్‌ లో 1.2 లీటర్ టర్బో పెట్రోల్ ఇంజిన్ లభిస్తుంది. ఇది 110 హెచ్‌పీ పవర్, 190 ఎన్ఎం టార్క్ అందిస్తుంది. ఈ ఇంజిన్‌ను 6 స్పీడ్ మాన్యువల్, 6 స్పీడ్ ఆటోమేటిక్ గేర్‌ బాక్స్‌ తో కొనుగోలు చేయవచ్చు. ఆటోమేటిక్ వెర్షన్‌ లో గరిష్ట టార్క్ 205 ఎన్ఎం వరకు ఉంటుంది. దీంతో డ్రైవింగ్ మరింత స్మూత్ గా, పవర్ ఫుల్ గా ఉంటుంది.

మిడ్ సైజ్ SUV సెగ్మెంట్ లో గట్టి పోటీ

భారత మార్కెట్లో సిట్రోయెన్ బసాల్ట్ మిడ్ సైజ్ SUV విభాగంలో పోటీ పడుతోంది. ఈ విభాగంలో ఇప్పటికే టాటా కర్వ్, హ్యుందాయ్ క్రెటా, కియా సెల్టోస్, హోండా ఎలివేట్, స్కోడా కుషాక్, వోక్స్‌ వ్యాగన్ టైగన్, టాటా సియెర్రా, రెనాల్ట్ డస్టర్, నిస్సాన్ టెక్టన్, మారుతి గ్రాండ్ విటారా లాంటి పాపులర్ మోడల్స్ ఉన్నాయి. ఇప్పుడు కొత్త కంఫర్ట్ ఎడిషన్‌ తో సిట్రోయెన్ కూడా ఈ పోటీని మరింత పెంచనుంది. అందుబాటు ధర, కొత్త ప్రీమియం ఫీచర్లు, టర్బో ఇంజిన్ ఆప్షన్స్, అత్యాధునిక టెక్నాలజీ  బసాల్ట్ ఎక్స్ కంఫర్ట్ ఎడిషన్‌ ను కొనుగోలుదారులకు మరింత ఆకట్టుకునేలా చేయనున్నాయి. ముఖ్యంగా స్టైలిష్ కూపే ఎస్‌యూవీ కోసం చూస్తున్న వారికి ఇది బెస్ట్ ఆప్షన్ కానుంది.

Advertisement

Read Also: అమ్మకాల్లో టాటా పంచ్ జోష్.. ఏకంగా 8 లక్షల మార్క్ క్రాస్!

Related News

వర్షాకాలంలో ఈ EV బైకులే బెస్ట్.. వరదలోనూ దూసుకెళ్తాయట!

ఎక్స్‌ ప్రెస్‌ వే ప్రయాణికులకు షాక్.. టోల్ రేట్లు భారీగా పెంపు!

ఈ ఏడాది అత్యధికంగా అమ్ముడైన పెట్రోల్ కార్లు ఇవే.. నెంబర్ వన్ ఏదంటే?

టెస్లా కారులో గ్రోక్ AI.. ఇండియన్ యూజర్లకు సరికొత్త స్మార్ట్ ఫీచర్లు!

మారుతి నుంచి భారీ సర్‌ ప్రైజ్.. త్వరలో 4 క్రేజీ మోడళ్లు ఎంట్రీ!

హోండా కార్లపై కళ్లు చెదిరే ఆఫర్లు.. ఆ మూడు మోడల్స్ పై ఏకంగా రూ.2.45 లక్షల డిస్కౌంట్!

జస్ట్ రూ.1.25 లక్షలకే అవోర్ EX1.. కొనేముందు ఈ 5 విషయాలు కచ్చితంగా తెలుసుకోండి!

ఆగస్టులో దేశీ మార్కెట్ లో లాంచ్ కానున్న కొత్త కార్లు.. ఏ మోడల్ ఎప్పుడు వస్తుందో తెలుసా?

Big Stories

Advertisement
×