// // Nitish Kumar Resigns: బీహార్‌లో ముగిసిన నితీష్ శకం.. ఇకపై పెద్దల సభకు -->
E-Paper
Advertisement

Nitish Kumar Resigns: బీహార్‌లో ముగిసిన నితీష్ శకం.. ఇకపై పెద్దల సభకు,  కొత్త ప్రభుత్వానికి ఫుల్ సపోర్ట్

Nitish Kumar Resigns: బీహార్‌లో ముగిసిన నితీష్ శకం.. ఇకపై పెద్దల సభకు,  కొత్త ప్రభుత్వానికి ఫుల్ సపోర్ట్
Advertisement

Nitish Kumar Resigns: బీహార్‌ రాజకీయాల్లో నితీష్ కుమార్ శకం ముగిసిందా? ఉన్నట్లుండి ఎందుకు ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారా? జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పాలని భావిస్తున్నారా? రానున్న రోజుల్లో రాజకీయ ఎత్తుగడలు ముందే నితీష్ పసిగట్టారా? అందుకు ఇప్పటి నుంచి అడుగులు వేస్తున్నారా? ఈ క్రమంలో సీఎం పదవికి రాజీనామా చేసి రాజ్యసభలో అడుగుపెట్టనున్నారా? అవుననే అంటున్నారు రాజకీయ పరిశీలకులు.

బీహార్‌లో ముగిసిన నితీష్ శకం.. సీఎంగా బీజేపీకి ఛాన్స్

Advertisement

బీహార్ అంటే ఒకప్పుడు లాలూ ప్రసాద్ యాదవ్. ఇప్పుడు నితీష్‌కుమార్ పేరు ముందుగా గుర్తుకు వస్తుంది. దాదాపు రెండు దశాబ్దాలపాటు ఆ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పని చేశారు. గతేడాది బీజేపీతో కలిసి అసెంబ్లీ ఎన్నికల బరిలోకి దిగి విజయఢంకా మోగించారు. బీజేపీ-జేడీయూ మధ్య ఎలాంటి ఒప్పందం జరిగిందో తెలీదుగానీ రేపో మాపో ఆయన ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయనున్నారు. ఎక్స్ వేదికగా ప్రకటన చేశారు.

ఇప్పుడు ఆయన రాజ్యసభకు వెళ్లనున్నారు. ఈ సందర్భంగా కీలక వ్యాఖ్యలు చేశారు. రెండు దశాబ్దాలకు పైగా మీరు, మీ నమ్మకాన్ని, మద్దతును నిరంతరం నిలబెట్టుకున్నానని రాసుకొచ్చారు. మీరిచ్చిన బలం ద్వారానే మేము బీహార్‌కు సేవ చేస్తామన్నారు. మీ విశ్వాసం, మద్దతు కారణంగానే బీహార్ ఇవాళ అభివృద్ధి, గౌరవం అనే కొత్త కోణాన్ని స్వీకరిస్తోందన్నారు.

Advertisement

ఇకపై పెద్దల సభకు,  కొత్త ప్రభుత్వానికి ఫుల్ సపోర్ట్

తాను గతంలో చాలాసార్లు మీకు నా కృతజ్ఞతలు తెలియజేశానని ప్రస్తావించారు. తన పార్లమెంటరీ జీవితం ప్రారంభం నుండి, బీహార్ శాసనసభ, పార్లమెంటు ఉభయ సభలలో సభ్యుడిని కావాలని కోరిక బలంగా కోరుకున్నట్లు ప్రస్తావించారు. రాజ్యసభ సభ్యుడిని కావాలని కోరుకుంటున్నానని వెల్లడించారు.

మీతో ఈ సంబంధం భవిష్యత్తులో కూడా కొనసాగుతుందన్నారు. బీహార్‌లో ఏర్పడబోయే కొత్త ప్రభుత్వానికి తన పూర్తి మద్దతు, మార్గదర్శకత్వం ఉంటుందన్నారు. అభివృద్ధి చెందిన బీహార్‌ను నిర్మించడానికి కలిసి పని చేయడానికి సిద్ధంగా ఉంటానని, ఈ విషయంలో నేను మీకు హృదయపూర్వకంగా హామీ ఇస్తున్నాను.

ALSO READ: భారతీయుల చావుకొచ్చిన యుద్ధం.. పెరగనున్న ధరలు.. మధ్యతరగతిపై ఆర్థిక పిడుగు!

త్వరలో నితీష్‌కుమార్ ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయనున్నారు. నితీష్ తప్పుకోవడంతో బీహార్‌కు బీజేపీకి చెందిన వ్యక్తి కొత్త ముఖ్యమంత్రి రాబోతున్నారు. ముఖ్యమంత్రి రేసులో సామ్రాట్ చౌదరి, నిత్యానంద రాయ్‌ పేర్లు బలంగా వినిపిస్తున్నాయి. వీరిద్దరిలో ఎవరో ఒకరు బాధ్యతలు చేపట్టనున్నట్లు బీజేపీ వర్గాలు చెబుతున్నాయి. డిప్యూటీ సీఎంగా ఉన్న సామ్రాట్‌ చౌదరి, వివిధ శాఖల బాధ్యతలు నిర్వహిస్తున్నారు.

మరో వెర్షన్‌కు వద్దాం.. రాజ్యసభకు వెళ్లిన తర్వాత కేంద్రమంత్రిగా నితీష్‌కుమార్ బాధ్యతలు చేపట్టే అవకాశముందని ప్రచారం లేకపోలేదు. ప్రస్తుతం నితీష్‌ కొడుకు నిషాంత్ కుమార్‌ను బీహార్ రాజకీయాల్లో యాక్టివ్ చేయాలని భావించి ఈ స్కెచ్ వేసినట్టు వెనుక చర్చ జరుగుతోంది. నిషాంత్‌కు డిప్యూటీ సీఎం పదవి ఇచ్చినా ఆశ్చర్యపోనక్కర్లేదని అంటున్నారు.

మొత్తానికి జాతీయ స్థాయలో మునుపటి మాదిరిగా జేడీయూ చక్ర తిప్పాలన్నది నితీష్ ఆలోచనగా చెబుతున్నారు. దీనివెనుక పెద్ద స్కెచ్ ఉందని అంటున్నారు. గతంలో ఆర్జేడీ కలిసి కలిసి బీహార్ ఎన్నికల్లో నితీష్ పోటీ చేశారని, ఆ తర్వాత ఇండియా కూటమిలోకి వెళ్లారని అంటున్నారు. బీహార్ ఎన్నికలకు ముందు బీజేపీతో జత కట్టారని గుర్తు చేస్తున్నారు. నితీష్ రాజకీయాల వెనుక ఏదో జరుగుతోందన్న చర్చ బలంగా కొనసాగుతోంది.

 

Related News

ప్రధాని మోడీ ఇంటి ముట్టడికి కేజ్రీవాల్ బిగ్ స్కెచ్.. E20 పెట్రోల్‌పై కేజ్రీవాల్ సమరం

బీహార్‌లో బీజేపీకి బిగ్ షాక్.. భారీ మెజారిటీతో ప్రశాంత్ కిషోర్ గెలుపు

పెళ్లే కానక్కర్లేదు.. సహజీవనానికి ఆ చట్టం వర్తిస్తుంది.. సుప్రీంకోర్టు సంచలనం

సుప్రీం కోర్టులో జడ్జీల సంఖ్య పెంపు.. లోక్‌సభలో బిల్లు ఆమోదం!

ఇంజనీరింగ్ అభ్యర్థులకు గుడ్ న్యూస్..ఎయిర్‌పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియాలో ఉద్యోగాలు

డిగ్రీ అర్హతతో 11,403 క్లర్క్ పోస్టులు.. పూర్తి వివరాలివే !

కేరళలో విరిగిపడ్డ కొండచరియలు.. ‘బిగ్ టీవీ’ ప్రతినిధులకు తప్పిన పెను ప్రమాదం

నిరసనలకు జంతర్ మంతర్ గుడ్ బై? కొత్త వేదిక ఎక్కడ, సుప్రీంకోర్టులో పిటిషన్

Big Stories

Advertisement
×