E-Paper
Advertisement

Zimbabwe: గోవా బీర్లు తాగుతూ హోళీ ఎంజాయ్ చేస్తోన్న జింబాబ్వే ప్లేయ‌ర్లు

Zimbabwe: గోవా బీర్లు తాగుతూ హోళీ ఎంజాయ్ చేస్తోన్న జింబాబ్వే ప్లేయ‌ర్లు
Advertisement
Zimbabwe:  టి20 వరల్డ్ కప్ 2026 టోర్నమెంట్ ( T20 World Cup 2026 tournament )  ఆడేందుకు వచ్చిన జింబాబ్వే క్రికెట్ జట్టు.. ఇండియాలో ఎంజాయ్ చేస్తోంది. తాజాగా దేశ వ్యాప్తంగా హోలీ సంబరాలు జరిగిన సంగతి తెలిసిందే. అయితే ఈ నేపథ్యంలోనే మన దేశంలోనే ఉన్న జింబాబ్వే క్రికెటర్లు… గోవాలో చిల్ అయ్యారు. హోలీ సంబరాలలో భాగంగా గోవాకు వెళ్లిన జింబాబ్వే ప్లేయర్లు… అక్కడి బీర్లు తాగుతూ ఎంజాయ్ చేశారు. అంతేకాదు రంగులు పూసుకొని మరి… గోవా గల్లీలలో చిందులు వేశారు. ఆ తర్వాత బహిరంగంగానే గోవా బీర్లు ( Goa Beers) తాగుతూ రచ్చ రచ్చ చేశారు. ఇండియా కల్చర్ బాగుందంటూ తెగ ఎంజాయ్ చేశారు. దీనికి సంబంధించిన ఫోటోలు వైరల్ గా మారాయి. ఇది చూసిన ఇండియన్ ఫాన్స్ ఫిదా అయిపోతున్నారు. ఇండియన్ కల్చర్ ను ఎంజాయ్ చేస్తున్న జింబాబ్వే ప్లేయర్లకు ( Zimbabwe Players) సలాం కొడుతున్నారు. మన ఇండియా అంటే అందరికీ నచ్చుతుందని.. ఇప్పుడు జింబాబ్వే లాంటి చిన్న దేశపు క్రికెట్ ప్లేయర్లు కూడా మన ఇండియన్ కల్చర్ లో ఎంజాయ్ చేస్తున్నారని కామెంట్స్ పెడుతున్నారు ఫ్యాన్స్.

Also Read: SA vs NZ 1st Semi-Final: టీమిండియా కోసం జై షా కుట్ర‌లు…ద‌క్షిణాఫ్రికాను కావాల‌నే ఇంటికి పంపార‌ని ట్రోల్స్ !

ఇండియాలో చిక్కుకుపోయిన జింబాబ్వే ప్లేయర్లు

టి20 వరల్డ్ కప్ 2026 టోర్నమెంట్ ( T20 World Cup 2026 tournament )  నేపథ్యంలో జింబాబ్వే సూపర్ 8 దశ దాకా వచ్చి ఎలిమినేట్ అయింది. జింబాబ్వే ఎలిమినేట్ అయి దాదాపు వారం రోజులైనా కూడా… మన ఇండియాలోనే ఉంది. అయితే, ఇరాన్, ఇజ్రాయిల్-అమెరికా యుద్ధం నేపథ్యంలో మిడిల్ ఈస్ట్ ( Middle East) దేశాలలో విమాన సర్వీసులు (aero plane services ) పూర్తిగా నిలిచిపోయాయి. ఇజ్రాయిల్, అమెరికాపై దాడి చేస్తున్న ఇరాన్ ( Iran).. మిడిల్ ఈస్ట్ దేశాలను కూడా టార్గెట్ చేసింది. దీంతో దుబాయ్, సౌదీ అరేబియా, అబుదాబి లాంటి ప్రాంతాలలో విమానాలు ఎగరడం లేదు. ఇండియా నుంచి జింబాబ్వే వెళ్లాలంటే కచ్చితంగా ఈ మిడిల్ ఈస్ట్ దేశాల ద్వారా వెళ్లాల్సిందే. ప్రస్తుతం యుద్ధం ఉన్న నేపథ్యంలో జింబాబ్వే ప్లేయర్లను ఇండియాలోనే ఉండాలని ఐసీసీ ( ICC) ఆదేశాలు జారీ చేసింది. యుద్ధం పూర్తయిన తర్వాత వాళ్ల దేశానికి భద్రత నడుమ తీసుకువెళ్తామని ఐసీసీ హామీ ఇచ్చింది. ఈ నేపథ్యంలోనే, జింబాబ్వే ప్లేయర్లు వారం రోజులుగా ఇక్కడే ఉంటున్నారు. అయితే తాజాగా హోలీ పండుగ  ( Holy Festival)వచ్చిన నేపథ్యంలో… గోవాకు వెళ్లి చిల్ అయ్యారు. టి20 వరల్డ్ కప్ 2026 టోర్నమెంట్ నేప‌థ్యంలో సూప‌ర్ 8 లో ( Super 8) భాగంగా జింబాబ్వే ఆడిన మూడు మ్యాచ్ లలో ఓట‌మి పాలైంది. దీంతో ఇంటిదారి ప‌ట్టింది జింబాబ్వే.  ఈ త‌రుణంలోనే త‌మ దేశానికి వెళ్ల‌కుండా, ఇక్క‌డే చిల్ అవుతున్నారు.

Advertisement

Also Read: Pak Players: ఆయ‌న‌వి ఒంటెద్దు పోక‌డులు, కీలు బొమ్మ‌లాగా ఆడుకున్నాడు..కోచ్ పై ఫిర్యాదు చేసిన‌ పాకిస్తాన్ ప్లేయ‌ర్లు

 

Advertisement

Related News

నా బౌలింగ్ అంటేనే ధోని భ‌య‌ప‌డి, ప్యాంట్ త‌డుపుకుంటాడు !

ఐపీఎల్ 2027లోకి మహ్మద్ అమీర్…RCB ద్వారా ఎంట్రీ ?

పాకిస్తాన్ కొత్త‌ కోచ్ గా ఫ‌స్ట్ క్లాస్ క్రికెట‌ర్‌…వీరుడు వ‌స్తున్న‌ట్లు PCB బిల్డ‌ప్

ప్రీతి జింటాతో ఆస్ట్రేలియా క్రికెట‌ర్‌ బ్రెట్ లీ ఎ**ఫైర్‌..డ్రెస్సింగ్ రూంలోనే ఆ ప‌నులు?

మాకు నీతులు చెప్ప‌డం కాదు, ముందు పాకిస్తాన్ జ‌ట్టును గాడిలో పెట్టు

దంబుల్లా సిక్సర్స్ కు ప‌ట్టిన ద‌రిద్రం…ఇఫ్తికార్ అహ్మద్ అడుగుపెట్ట‌గానే ఎలిమినేట్

2011 వ‌ర‌ల్డ్ క‌ప్ నుంచి ధోనిపై ప‌గ పెంచుకున్నా..కానీ CSKలోకి వెళ్లాక మాత్రం

టీమిండియాలో 8 మందికి గాయాలు..ఇక 2027 వ‌ర‌ల్డ్ క‌ప్ మ‌ర్చిపోవాల్సిందే

Big Stories

Advertisement
×