E-Paper
Advertisement

Nitin Nabin: బీజేపీ కొత్త బాస్ ఫిక్స్.. జాతీయ అధ్యక్షుడిగా నితిన్ నబీన్ ఏకగ్రీవం!

Nitin Nabin: బీజేపీ కొత్త బాస్ ఫిక్స్.. జాతీయ అధ్యక్షుడిగా నితిన్ నబీన్ ఏకగ్రీవం!
Advertisement

Nitin Nabin: భారతీయ జనతా పార్టీ (BJP) నూతన జాతీయ అధ్యక్షుడిగా నితిన్ నబీన్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. జేపీ నడ్డా పదవీకాలం ముగియడంతో, పార్టీ పగ్గాలను యువ నాయకుడైన నితిన్ నబీన్‌కు అప్పగిస్తూ బీజేపీ అధిష్టానం నిర్ణయం తీసుకుంది. 50 ఏళ్ల లోపు వయసున్న నితిన్ నబీన్‌ను ఎంపిక చేయడం ద్వారా పార్టీ నాయకత్వంలో యువతకు పెద్దపీట వేస్తున్నట్లు బీజేపీ సంకేతాలిచ్చింది.

నితిన్ నబీన్ పేరును ప్రతిపాదిస్తూ మొత్తం 37 సెట్ల నామినేషన్లు దాఖలయ్యాయి. వేరే ఎవరూ పోటీలో లేకపోవడంతో ఆయన ఎన్నిక ఏకగ్రీవమైంది. రేపు (మంగళవారం) ఉదయం 11 గంటలకు నితిన్ నబీన్ బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా ప్రమాణస్వీకారం చేయనున్నారు. ఈ కార్యక్రమానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌తో పాటు పలువురు కేంద్ర మంత్రులు, బీజేపీ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు హాజరుకానున్నారు.

Advertisement

బీహార్ రాష్ట్రానికి చెందిన కీలక నాయకుడు నితిన్ నబీన్..  ఆయన బీహార్‌లోని బంకీపూర్ నియోజకవర్గం నుండి వరుసగా నాలుగుసార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు. గతంలో బీజేపీ యువ మోర్చా (BJYM) జాతీయ ఉపాధ్యక్షుడిగా పనిచేశారు. బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా ఎన్నికవ్వడానికి ముందు ఛత్తీస్‌గఢ్ రాష్ట్ర బీజేపీ ఇంచార్జ్‌గా పనిచేశారు. అక్కడ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ విజయం సాధించడంలో ఆయన వ్యూహాలు కీలక పాత్ర పోషించాయి. నితీష్ కుమార్ మంత్రివర్గంలో గతంలో రోడ్డు నిర్మాణ శాఖ మంత్రిగా కూడా బాధ్యతలు నిర్వహించారు.

Read Also:  బ్రిటీష్ జనతా పార్టీ వర్సెస్ ఇటలీ నేషనల్ కాంగ్రెస్.. సీఎం రేవంత్ రెడ్డికి బండి సంజయ్ కౌంటర్

Related News

ప్రధాని మోడీ ఇంటి ముట్టడికి కేజ్రీవాల్ బిగ్ స్కెచ్.. E20 పెట్రోల్‌పై కేజ్రీవాల్ సమరం

బీహార్‌లో బీజేపీకి బిగ్ షాక్.. భారీ మెజారిటీతో ప్రశాంత్ కిషోర్ గెలుపు

పెళ్లే కానక్కర్లేదు.. సహజీవనానికి ఆ చట్టం వర్తిస్తుంది.. సుప్రీంకోర్టు సంచలనం

సుప్రీం కోర్టులో జడ్జీల సంఖ్య పెంపు.. లోక్‌సభలో బిల్లు ఆమోదం!

ఇంజనీరింగ్ అభ్యర్థులకు గుడ్ న్యూస్..ఎయిర్‌పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియాలో ఉద్యోగాలు

డిగ్రీ అర్హతతో 11,403 క్లర్క్ పోస్టులు.. పూర్తి వివరాలివే !

కేరళలో విరిగిపడ్డ కొండచరియలు.. ‘బిగ్ టీవీ’ ప్రతినిధులకు తప్పిన పెను ప్రమాదం

నిరసనలకు జంతర్ మంతర్ గుడ్ బై? కొత్త వేదిక ఎక్కడ, సుప్రీంకోర్టులో పిటిషన్

Big Stories

Advertisement
×