// // Sleeping Side Effects: కేవలం 6 గంటలే నిద్రపోతున్నారా?- Staging.BigTvLive -->
E-Paper
Advertisement

Sleeping Side Effects: కేవలం 6 గంటలే నిద్రపోతున్నారా? మీకు తెలియకుండానే ఈ ప్రాణాంతక వ్యాధులను ఆహ్వానిస్తున్నారు!

Sleeping Side Effects: కేవలం 6 గంటలే నిద్రపోతున్నారా? మీకు తెలియకుండానే ఈ ప్రాణాంతక వ్యాధులను ఆహ్వానిస్తున్నారు!
Advertisement

Sleeping Side Effects: మనిషి ఆరోగ్యంగా జీవించడానికి ఆహారం ఎంత ముఖ్యమో.. నిద్ర కూడా అంతే అవసరం. శారీరక శ్రమ తర్వాత శరీరానికి, రోజంతా ఆలోచనలతో అలసిపోయిన మెదడుకు రీఛార్జ్ కావాలంటే కనీసం 7 నుండి 8 గంటల నిద్ర తప్పకుండా ఉండాల్సిందే. మనం గాఢనిద్రలో ఉన్నప్పుడే శరీరం తనను తాను మరమ్మత్తు చేసుకుంటుంది. దీంతో మరుసటి రోజు ఉత్సాహంగా, ఆరోగ్యంగా ఉండటానికి వీలుంటుంది. కానీ, నేటి ఉరుకుల పరుగుల జీవితంలో చాలామంది 6 గంటల కంటే తక్కువ సమయం నిద్రపోతున్నారు. ఇలా నిద్రను నిర్లక్ష్యం చేయడం వల్ల దీర్ఘకాలంలో ప్రాణాంతక వ్యాధులైన మధుమేహం, గుండెపోటు వంటి ముప్పులు పొంచి ఉంటాయని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.

ఏకాగ్రత దెబ్బతింటుంది..

తగిన నిద్ర లేకపోవడం వల్ల శరీరం కంటే ముందుగా మెదడు ప్రభావితమవుతుంది. శరీరానికి కావాల్సిన విశ్రాంతి లేనప్పుడు ఏకాగ్రత దెబ్బతింటుంది. దీంతో చిన్న చిన్న విషయాల్లో కూడా నిర్ణయాలు తీసుకోవడం కష్టమవుతుంది. అంతేకాకుండా.. కొత్త విషయాలను గుర్తుంచుకునే సామర్థ్యం తగ్గిపోతుంది.

Advertisement

Also Read: పప్పు వండేటప్పుడు వచ్చే నురగ అమృతమా? అనారోగ్యమా? నిపుణులు చెప్పిన షాకింగ్ ఫ్యాక్ట్స్ తెలుసుకోండి..

ఉద్యోగంపైనా ప్రభావం..

రోజంతా గంటల కొద్దీ స్క్రీన్ చూడటం వల్ల మీ కళ్లు, అనేక విషయాల గురించి ఆలోచించడం వలన బుర్ర కూడా హీటెక్కిపోతుంటుంది. ఇవి రెండూ విశ్రాంతి తీసుకోవాలంటే నిద్ర ఎంతో ముఖ్యం. ఒక రకంగా చెప్పాలంటే.. నిద్రలేని మెదడు మొరాయించిన కంప్యూటర్ లాంటిది. ఇది మీ ఉద్యోగ జీవితంపైనే కాకుండా వ్యక్తిగత ప్రశాంతతను కూడా దెబ్బతీస్తుంది.

ఒత్తిడి పెరుగుతుంది..

Advertisement

శరీరంలో ఇన్సులిన్ వంటి ముఖ్యమైన హార్మోన్ల సమతుల్యత దెబ్బతినడానికి నిద్రలేమి ప్రధాన కారణం. ముఖ్యంగా ఒత్తిడిని పెంచే కార్టిసాల్ హార్మోన్ స్థాయిలు పెరగడం వల్ల టైప్-2 డయాబెటిస్ వచ్చే అవకాశాలు మెండుగా ఉన్నాయి. దీని ప్రభావం ఆరోగ్యం మీద మాత్రమే కాకుండా.. అందం మీద కూడా పడుతుంది.

త్వరగా వృద్ధాప్య ఛాయలు..

అలాగే నిద్ర సరిగ్గా లేకపోతే కళ్ల కింద నల్లటి వలయాలు రావడం, ముఖంపై త్వరగా ముడతలు పడటం వంటివి జరుగుతాయి. అంటే.. నిద్ర తగ్గితే మీరు మీ వయస్సు కంటే ముసలివారిలా కనిపించే ప్రమాదం ఉందని చెబుతున్నారు నిపుణులు. అందుకే రోజుకి కనీసం 7 నుంచి 8 గంటల నిద్ర తప్పనిసరి అని చెబుతున్నారు.

ప్రాణాంతక వ్యాధులు..

మన శరీరంలో రోగాలతో పోరాడే రోగనిరోధక వ్యవస్థ మనం నిద్రపోయే సమయంలోనే బలోపేతం అవుతుంది. నిద్ర తగ్గితే ఆ వ్యవస్థ బలహీనపడి, తరచుగా ఇన్ఫెక్షన్ల బారిన పడేలా చేస్తుంది. ఇప్పటికే బిపి, షుగర్ వంటి సమస్యలు ఉన్నవారు తక్కువ నిద్రపోతే, అది క్యాన్సర్ వంటి భయంకర వ్యాధులకు లేదా అకాల మరణానికి దారితీసే అవకాశం ఉందని అధ్యయనాలు చెబుతున్నాయి.

Also Read: మీరు ఉన్నది నిజమైన ప్రేమలోనేనా? ఈ 6 సంకేతాలు కనిపిస్తే అది ప్రేమ కాదు.. టాక్సిక్ రిలేషన్‌షిప్!

 

 

 

Related News

రాత్రి సరిగా నిద్ర పట్టలేదా? మరుసటి రోజు శరీరం చురుకుగా ఉండేందుకు ఈ టిప్స్ పాటించండి

మోసం చేసిన భర్త లేదా భార్యను క్షమించడం కరెక్టేనా?

వర్షాకాలంలో వరదల ప్రమాదం.. ప్రకృతి విపత్తు సమయంలో మీ ఫ్యామిలీని ఇలా కాపాడుకోండి

స్వస్తిక్‌కు ఇరువైపులా రెండేసి గీతలు.. అంత అర్థం ఉందా? అసలు విషయాలు తెలిస్తే షాక్

ఈ సందర్భాల్లో అబద్ధం చెప్పాలని పిల్లలకు చెప్పాలి.. తల్లిదండ్రులు నేర్పాల్సిన 5 ముఖ్యమైన విషయాలు

ఎప్పుడూ ఒంటరిగా ఉంటారు.. ఈ తేదీల్లో పుట్టినవారిని అందరూ అపార్థం చేసుకుంటారు

నిమ్మకాయ తొక్కలు పారేస్తున్నారా? వీటితో 7 అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు

వీకెండ్‌లో ఎక్కువసేపు నిద్రపోతే ఆరోగ్యానికి మంచిదా? డాక్టర్లు ఏం చెబుతున్నారంటే

Big Stories

Advertisement
×