E-Paper
Advertisement

LPG Gas: ఎల్పీజీ గ్యాస్ వినియోగదారులకు బిగ్ రిలీఫ్.. ఆంక్షలు ఎత్తేసిన కేంద్రం, మరి ధరలు తగ్గుతాయా?

LPG Gas: ఎల్పీజీ గ్యాస్ వినియోగదారులకు  బిగ్ రిలీఫ్.. ఆంక్షలు ఎత్తేసిన కేంద్రం, మరి ధరలు తగ్గుతాయా?
Advertisement

LPG Gas: పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు తగ్గుముఖం పట్టడంతో కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. గల్ఫ్ దేశాల నుంచి గ్యాస్ ట్యాంకర్లు రావడంతో ఓ అడుడు ముందుకేసింది. హోటళ్లు, రెస్టారెంట్ల గ్యాస్‌ సరఫరాపై విధించిన ఆంక్షలను ఎత్తివేసింది. యుద్ధ ముందున్న స్థాయికి గ్యాస్ సరఫరాను పునరుద్ధరించింది.

ఎల్పీజీ గ్యాస్ వినియోగదారులకు బిగ్ రిలీఫ్

Advertisement

ఇరాన్‌లో ఉద్రిక్తతలు తగ్గుముఖం పట్టాయి. గల్ఫ్ నుంచి ఎల్పీజీ సరఫరా మెరుగుపడుతోంది. ఈ నేపథ్యంలో కీలక నిర్ణయం తీసుకుంది కేంద్ర ప్రభుత్వం. హోటళ్లు, రెస్టారెంట్లు, పరిశ్రమలకు గ్యాస్‌ సరఫరాపై విధించిన ఆంక్షలను ఎత్తివేసింది. యుద్ధానికి ముందున్న స్థాయికి పునరుద్ధరించింది. బల్క్‌ ఎల్పీజీ సరఫరాను యుద్ధం ముందునాటితో పోలిస్తే 50 శాతం మేరా అనుమతించినట్లు ప్రకటించింది.

ఈ మేరకు గురువారం పెట్రోలియం మంత్రిత్వ శాఖ ఓ ప్రకటన విడుదల చేసింది. దేశీయంగా ఎల్పీజీ ఉత్పత్తి పెరిగింది. ముఖ్యంగా విదేశాల నుంచి దిగుమతులు పెరగడంతో ఆంక్షలను సడలించినట్లు అందులో పేర్కొంది. పారిశ్రామిక, వాణిజ్య వినియోగదారులకు బిగ్ రిలీఫ్ అన్నమాట.

Advertisement

ఆంక్షలు ఎత్తేసిన కేంద్రం, మరి ధరలు తగ్గుతాయా?

ఎల్పీజీలో 90 శాతం దిగుమతులు పశ్చిమాసియా నుంచి భారత్‌కు వస్తుంది. అమెరికా-ఇరాన్‌ యుద్ధం నేపథ్యంలో సరఫరాకు తీవ్ర ఆటంకం ఏర్పడింది. ఫలితంగా గృహావసరాలకు వంటగ్యాస్‌ కొరత తలెత్తకుండా కేంద్రం చర్యలు చేపట్టింది. ఈ క్రమంలో హోటళ్లు, రెస్టారెంట్లు, పరిశ్రమలకు వాణిజ్య సిలిండర్ల సరఫరాను నిలిపివేసింది.

అందుబాటులో ఉన్న ఎల్పీజీ గ్యాస్‌ని‌గృహావసరాలకు మళ్లించేలా చర్యలు తీసుకుంది. దేశీయంగా పెట్రో కెమికల్స్‌ తయారీ, పారిశ్రామిక అవసరాలకు ఉపయోగించే సీ3, సీ4 స్ట్రీమ్స్‌ను వంటగ్యాస్‌ వైపు మళ్లించింది. ప్రస్తుతం సరఫరా మెరుగుపడింది. తిరిగి పెట్రోకెమికల్స్‌ తయారీకి వాటిని కేటాయిస్తున్నట్లు తెలిపింది కేంద్రం.

ALSO READ: పాస్‌పోర్టు -పౌరసత్వ వ్యవహారం.. కేంద్రంపై ఓవైసీ విమర్శలు, బీజేపీ కార్డు నిరూపిస్తుందా?

అందుబాటులో ఉన్నచోట ఎల్పీజీ వినియోగదారులను దశలవారీగా పీఎన్‌జీకి మారుస్తారని తెలిపింది కేంద్రం. ఇప్పటికే పీఎన్‌జీకి మారిన వినియోగదారులు అందులో కొనసాగుతారని పేర్కొంది. వాణిజ్య-పారిశ్రామిక ఎల్పీజీ వినియోగదారుల సమగ్ర డేటా నిర్వహించాలని ఆయిల్‌ మార్కెటింగ్‌ కంపెనీలను ఆదేశించింది కేంద్రం.

దేశీయ ఎల్‌పిజి లభ్యతకు ఎలాంటి ఆటంకం కలగకుండా ఉత్పత్తి రోజుకు 40 TMT కంటే తక్కువ కాకుండా ఉండేలా చూసుకుంటోంది. మరోవైపు దేశీయ ఇంధన భద్రతను బలోపేతం చేస్తూ ఇంధనాల విస్తరణకు ప్రభుత్వం ప్రయత్నాలు మొదలుపెట్టింది.

Related News

ప్రధాని మోడీ ఇంటి ముట్టడికి కేజ్రీవాల్ బిగ్ స్కెచ్.. E20 పెట్రోల్‌పై కేజ్రీవాల్ సమరం

బీహార్‌లో బీజేపీకి బిగ్ షాక్.. భారీ మెజారిటీతో ప్రశాంత్ కిషోర్ గెలుపు

పెళ్లే కానక్కర్లేదు.. సహజీవనానికి ఆ చట్టం వర్తిస్తుంది.. సుప్రీంకోర్టు సంచలనం

సుప్రీం కోర్టులో జడ్జీల సంఖ్య పెంపు.. లోక్‌సభలో బిల్లు ఆమోదం!

ఇంజనీరింగ్ అభ్యర్థులకు గుడ్ న్యూస్..ఎయిర్‌పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియాలో ఉద్యోగాలు

డిగ్రీ అర్హతతో 11,403 క్లర్క్ పోస్టులు.. పూర్తి వివరాలివే !

కేరళలో విరిగిపడ్డ కొండచరియలు.. ‘బిగ్ టీవీ’ ప్రతినిధులకు తప్పిన పెను ప్రమాదం

నిరసనలకు జంతర్ మంతర్ గుడ్ బై? కొత్త వేదిక ఎక్కడ, సుప్రీంకోర్టులో పిటిషన్

Big Stories

Advertisement
×