E-Paper
Advertisement

Big Shock To Maoist Party: మావోయిస్టు పార్టీకి దెబ్బ మీద దెబ్బ.. వరుసగా లొంగిపోతున్న కీలక నేతలు

Big Shock To Maoist Party: మావోయిస్టు పార్టీకి దెబ్బ మీద దెబ్బ.. వరుసగా లొంగిపోతున్న కీలక నేతలు
Advertisement

Big Shock To Maoist Party: మావోయిస్టు పార్టీకి మరో భారీ ఎదురుదెబ్బ తగిలింది. మావోయిస్టు నేత, ఎంఎంసీ జోన్‌ ప్రతినిధి అనంత్‌ ఎలియాస్‌ వికాస్‌ పోలీసుల ఎదుట లొంగిపోయారు. ఆయన సహా 15 మంది మావోయిస్టులు ఆయుధాలతో మహారాష్ట్రలోని గోండియా జిల్లాలోని దారేక్ష పోలీస్‌స్టేషన్‌లో లొంగిపోయారు. వచ్చే ఏడాది జనవరి 1వ తేదీన అందరం లొంగిపోతామని లేఖ విడుదల చేసిన రోజే సరెండర్ అయ్యారు. అనంత్‌పై 5 రాష్ట్రాల్లో కలిపి కోటి రివార్డు ఉంది.

Advertisement

లొంగిపోయిన వారిలో ఎంఎంసీ ఇంఛార్జి, విస్తార్‌ మూడో ప్లటూన్‌ కమాండర్‌ సురేంద్ర ఎలియాస్మద్వి సీమ సైతం ఉన్నారు. ఈయనపై 60 లక్షల రివార్డు ఉంది. 15 మంది మావోయిస్టుల పేరుపై మూడురాష్ట్రాల్లో మొత్తం 2 కోట్ల రివార్డు ఉన్నట్లు పోలీసులు తెలిపారు. వీరి వద్ద నుంచి ఏకే 47, ఎస్ఎస్ఆర్ రైఫిల్, ఇన్సాస్ రైఫిల్, 303 రైఫిల్, సింగిల్ షాట్ ఆయుధాలు, డిటోనేటర్లు, మందుగుండు సామగ్రి స్వాధీనం చేసుకున్నారు. లొంగిపోయిన మావోయిస్టులను జనజీ వన స్రవంతిలో కలిపేందుకు ప్రభుత్వం తరఫున సహకరిస్తామని చెప్పారు. జనవరి 1న అందరం లొంగిపోతా. మని గురువారం నాడు లేఖను విడుదల చేసిన అనంత్.. అదే రోజు లొంగిపోవడం వెనుక కారణాలు ఏమై ఉంటాయనే చర్చ జరుగుతోంది.

ఇటు ఛత్తీస్‌గఢ్‌లోని బస్తర్ జిల్లాలో వరంగల్ జిల్లాకు చెందిన శ్యాందాదా అలియాస్ చైతు పోలీసులు ఎదుట లొంగిపోయారు. జగదల్ పూర్లో పోలీసులు, సీఆర్పీఎఫ్ ఎదుట శ్యాం దాదా సహా 10 మంది నక్సలైట్లు సరెండర్ అయ్యారు. వీరిపై మొత్తంగా 66 లక్షల రివార్డు ఉందని అధికారులు తెలిపారు. లొంగిపోయిన వారిలో ముగ్గురు మహిళలు ఉన్నారని బస్తర్ రేంజ్ ఐజీ సుందర్రాజ్ తెలియజేశారు.

Advertisement

స్పెషల్ జోనల్ కమిటీ సభ్యుడు చైతుకు 25 లక్షల రివార్డు ప్రకటించారు. చైతు ప్రధానంగా జిరామ్ లోయ దాడికి ప్రధాన సూత్రధారిగా వ్యవహరించారు. చాలా కాలంగా దర్భా డివిజన్‌కు బాధ్యత వహించాడు. నక్సలైట్ వ్యతిరేక కార్యకలాపాలలో దళాల నుండి పెరుగుతున్న ఒత్తిడితో పాటు సీనియర్ మావోయిస్టు నాయకులు నిరంతరం లొంగిపోవడం.. అలాగే, రాష్ట్ర ప్రభుత్వం లొంగిపోవాలని నిరంతరం విజ్ఞప్తి చేయడంతో నక్సలైట్లు లొంగిపోయారు.

Also Read: కర్నూల్‌ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. రెండు కార్లు ఢీ.. స్పాట్‌లో ఐదుగురు మృతి

అంతకముందు మావోయిస్టు పార్టీ సంచలన ప్రకటన చేసింది. జనవరి 1న సాయుధ కాల్పులు విరమిస్తామంటూ.. MMC జోన్ ప్రతినిధి అనంత్ పేరుతో ప్రకటన విడుదల చేశారు. ఒక్కొక్కరుగా లొంగిపోయే బదులు అంతా కలిసి లొంగిపోతామని లేఖలో పేర్కొన్నారు. కమ్యూనికేషన్ కోసం ఓపెన్ ఫ్రీక్వెన్సీ నెంబర్ కూడా విడుదల చేశారు. అయితే అధిక ప్రాధాన్యతిచ్చే సర్కార్‌తో వెళ్తామని మావోయిస్టులు చెబుతున్నారు. కాగా.. ఇప్పటికే అగ్రనేతలు మల్లోజుల, ఆశన్న లొంగిపోయారు. అటు హిడ్మా ఎన్ కౌంటర్‌తో మావోయిస్టు పార్టీ మరింత బలహీనమైంది. వరుస ఎన్‌కౌంటర్లు, లొంగుబాట్లతో మావోయిస్టు మనుగడకు ముప్పుగా మారింది.

Related News

ప్రధాని మోడీ ఇంటి ముట్టడికి కేజ్రీవాల్ బిగ్ స్కెచ్.. E20 పెట్రోల్‌పై కేజ్రీవాల్ సమరం

బీహార్‌లో బీజేపీకి బిగ్ షాక్.. భారీ మెజారిటీతో ప్రశాంత్ కిషోర్ గెలుపు

పెళ్లే కానక్కర్లేదు.. సహజీవనానికి ఆ చట్టం వర్తిస్తుంది.. సుప్రీంకోర్టు సంచలనం

సుప్రీం కోర్టులో జడ్జీల సంఖ్య పెంపు.. లోక్‌సభలో బిల్లు ఆమోదం!

ఇంజనీరింగ్ అభ్యర్థులకు గుడ్ న్యూస్..ఎయిర్‌పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియాలో ఉద్యోగాలు

డిగ్రీ అర్హతతో 11,403 క్లర్క్ పోస్టులు.. పూర్తి వివరాలివే !

కేరళలో విరిగిపడ్డ కొండచరియలు.. ‘బిగ్ టీవీ’ ప్రతినిధులకు తప్పిన పెను ప్రమాదం

నిరసనలకు జంతర్ మంతర్ గుడ్ బై? కొత్త వేదిక ఎక్కడ, సుప్రీంకోర్టులో పిటిషన్

Big Stories

Advertisement
×