E-Paper
Advertisement

Fire Accident: మేడ్చల్‌లో భారీ అగ్ని ప్రమాదం.. ఎగసిపడ్డ మంటలు.. తగలబడిన టైర్ల షాప్‌..

Fire Accident: మేడ్చల్‌లో భారీ అగ్ని ప్రమాదం.. ఎగసిపడ్డ మంటలు.. తగలబడిన టైర్ల షాప్‌..
Advertisement

Fire Accident: మేడ్చల్‌ జిల్లా సుచిత్ర సర్కిల్‌లో భారీ అగ్నిప్రమాదం జరిగింది. రాఘవేంద్రనగర్‌ కాలనీలోని కార్ సర్వీస్ సెంటర్‌లో ఒక్కసారిగా మంటలు చేలరేగాయి. షాపులో టైర్లు ఉండటంతో పెద్ద ఎత్తున మంటలు ఉవ్వెత్తున ఎగసిపడుతున్నాయి. దీంతో ఆ ప్రాంతమంతా దట్టమైన పొగతో నిండిపోయింది. 4 ఫైర్ ఇంజన్లతో మంటల్ని ఆర్పేందుకు తీవ్ర ప్రయత్నం చేస్తున్నారు అధికారులు.

కార్ సర్వీస్ సెంటర్ చెలరేగిన మంటలు
అయితే టైర్లు ఒకదానికి మరొకటి వేగంగా మంటలు అంటుకోవడంతో కంట్రోల్ చేసేందుకు ఫైర్ సిబ్బంది ఇబ్బందులు పడుతున్నారు. మంటలు పక్కనే ఉన్న షాపులకు వ్యాప్తంచకుండా చర్యలు తీసుకుంటున్నారు. ఉదయం 4 గంటల సమయంలో అగ్నిప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది.

Advertisement

సుమారు రూ.2 కోట్ల మేర ఆస్థినష్టం జరిగింది -ఓనర్
ప్రమాదంపై తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు టైర్ షాపు ఓనర్. తెల్లవారుజామున టైర్ షాప్‌లో అగ్నిప్రమాదం జరిగిందని ఫోన్ కాల్ వచ్చిందన్నారు. వెంటనే తాను షాప్ వద్దకు వచ్చేసరికి మంటలు వ్యాపించి, దట్టమైన పొగలు వస్తున్నాయన్నారు. ప్రమాద సమయంలో షాప్‌లో ఎవరూ లేకపోవడం ఊరటనిచ్చిందన్నారు. టైర్లతో పాటు ఆటోమొబైల్ సామాగ్రి కాలిపోవడం వల్ల.. సుమారు రెండు కోట్లకు పైగా ఆస్తి నష్టం జరిగిందని వాపోయారు.

షాప్‌పై ఆధారపడిన 20 కుటుంబాలు నడిరోడ్డున పడ్డాయి -షాప్ ఓనర్..
తన షాప్‌పై ఆధారపడిన 20 కుటుంబాలు, నడిరోడ్డున పడ్డాయని, భారీ నష్టంతో తీవ్రంగా నష్టపోయానంటూ ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వమే తనను ఆదుకోవాలని కోరుతున్నాను. కాల్ రాగానే వెంటనే ఘటన స్థలానికి చేరుకున్నామన్నారు ఫైర్ డిపార్ట్మెంట్ అధికారి.

Advertisement

Also Read: మావోయిస్టు పార్టీకి దెబ్బ మీద దెబ్బ.. వరుసగా లొంగిపోతున్న కీలక నేతలు

మొదట రెండు ఫైర్ ఇంజన్లతో మంటలను ఆర్పే ప్రయత్నం చేసినప్పటికీ.. అదుపులోకి రాలేదన్నారు. నాలుగు ఫైర్ ఇంజన్లతో మంటలను అదుపు చేశామన్నారు. ఈ అగ్నిప్రమాదానికి సంబంధించిన కారణాలు తెలియాల్సి ఉందన్నారు. షాపులో ఫైర్ సేఫ్టీ మేనేజ్‌మెంట్ ఉందా లేదా అనేది విచారణలో తెలుస్తుందన్నారు.

Related News

ప్రశాంత్ కిషోర్ గెలుపు పై మంత్రి పొన్నం సంచలన వ్యాఖ్యలు.. ఏమన్నారంటే..?

సుప్రీం కోర్టు జడ్జీల పెంపుపై.. ఎంపీ రఘునందన్ రావు సంచలన వ్యాఖ్యలు!

రొబోటిక్ శస్త్రచికిత్సల్లో నిమ్స్ సరికొత్త రికార్డు.. సీఎం రేవంత్ ప్రశంసల జల్లు!

పగలు కుక్కర్లు అమ్ముతూ రాత్రి రెక్కీ వేసి దోపిడి.. బంగ్లాదేశ్ దొంగల ముఠా అరెస్ట్!

దివాళా తీసిన ఎల్లంపేట్ మున్సిపాలిటీ.. సొంత ఆఫీస్ ముందే ఘోర పరిణామాలు!

అక్రమ మోటార్లతో నీళ్ల దోపిడీ.. దాహంతో అలమటిస్తున్న కాలనీవాసులు!

కౌంట్‌డౌన్ స్టార్ట్.. ఈ నెల దాటితే మరో ఏడాదంతా ప్రమోషన్లు బంద్!

రేవంత్‌కి నామినేషన్ ఫామ్ నింపడం వచ్చా? కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు!

Big Stories

Advertisement
×