E-Paper
Advertisement

LPG Gas e-Kyc: ఎల్పీజీ గ్యాస్ కనెక్షన్ కేవైసీ.. కేంద్రం కీలక ప్రకటన

LPG Gas e-Kyc: ఎల్పీజీ గ్యాస్ కనెక్షన్ కేవైసీ.. కేంద్రం కీలక ప్రకటన
Advertisement

LPG Gas e-Kyc: పశ్చిమ ఆసియాలో యుద్ధ ఉద్రిక్తతల నేపథ్యంలో ఎల్పీజీ సబ్సిడీపై కేంద్రం కీలక ప్రకటన చేసింది. ఎల్పీజీ కస్టమర్లు బయోమెట్రిక్ ఆధార్ ధృవీకరణ (ఈ-కేవైసీ) పూర్తి చేయాలని సూచించింది. గ్యాస్ సరఫరాను సులభతరం చేయడానికి వినియోగదారులు ఆధార్ ఫేస్‌ ఆర్‌డీ యాప్‌లో… ఆయిల్ మార్కెటింగ్ కంపెనీల మొబైల్ యాప్‌లను ఉపయోగించి ఇంటి వద్ద ఈ-కేవైసీ పూర్తి చేయవచ్చు. ఎల్పీజీ డిస్టిబ్యూటర్ ను సందర్శించాల్సిన అవసరం లేదు. అయితే, ఈ-కెవైసీని పూర్తి చేయకపోతే ఎల్‌పీజీ రీఫిల్‌ చేయడంలో అంతరాయం ఏర్పడవచ్చు లేదా సబ్సిడీలు ఆగిపోచవచ్చు.

ప్రతి ఆర్థిక సంవత్సరం మొదట్లో

ప్రధాన మంత్రి ఉజ్వల యోజన లబ్ధిదారులకు ఈ-కేవైసీ మరింత కఠినతరం చేశారు. సబ్సిడీ పొందాలంటే ప్రతి ఆర్థిక సంవత్సరం ప్రారంభంలో.. మొదటి సిలిండర్ తీసుకునే ముందు బయోమెట్రిక్ ద్వారా ఈ-కేవైసీ పూర్తి చేయాలి. తొమ్మిది నెలలకు పైగా రీఫిల్ బుక్ చేసుకోని కస్టమర్లు.. కొత్త సిలిండర్ బుక్ చేసుకునే ముందు డిస్ట్రిబ్యూటర్ ఆఫీసులో స్వయంగా కేవైసీ పూర్తి చేయాల్సి ఉంటుంది. ప్రపంచ వ్యాప్తంగా ముడి చమురు సరఫరాకు అంతరాయం కలగడంతో… గ్యాస్ సరఫరాపై ఒత్తిళ్లు పెరిగాయి. గ్యాస్ సిలిండర్లను అక్రమంగా నిల్వను అరికట్టేందుకు కేంద్రం చర్యలు తీసుకుంటుంది. నిజమైన వినియోగదారులకు గ్యాస్ పంపిణీ అయ్యేలా, సబ్సిడీలు చేరేలా ఈ-కేవైసీ పూర్తి చేయాలని సూచించింది.

ఇంటి నుండే LPG బయోమెట్రిక్ ఆధార్ వెరిఫికేషన్

  • LPG ప్రొవైడర్ (ఇండియన్ ఆయిల్, భారత్ పెట్రోలియం లేదా హిందుస్థాన్ పెట్రోలియం) యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
  • ఆధార్ ఫేస్‌ ఆర్‌డీ యాప్‌ను ఇన్‌స్టాల్ చేసుకోండి.
  • LPG ఖాతాలోకి లాగిన్ అవ్వడానికి, మీ రిజిస్టర్డ్ మొబైల్ నంబర్ లేదా LPG IDని ఉపయోగించండి.
  • ఈ-కేవైసీ/ఆధార్ ధ్రువీకరణను ఆప్షన్ ను ఎంచుకోండి
  • మీ ఆధార్ వివరాలను ఎంటర్ చేయండి.
  • మీ మొబైల్ నెంబర్ ఆధార్‌తో లింక్ అయి ఉండాలి.
  • ఫేస్ స్కానర్ పై క్లిక్ చేస్తే.. ఆధార్ FaceRD యాప్‌కు వెళ్తుంది.
  • కస్టమర్ ఫేస్ స్కాన్‌ను పూర్తి చేసి సబ్మిట్ చేయండి.
  • ఏడాదికి ఒకసారి ఈ-కేవైసీ పూర్తి చేయాలని గుర్తుపెట్టుకోండి.

ఈ-కేవైసీ తప్పనిసరి

Advertisement

ఎల్పీజీ పరిస్థితులు ఇంకా ఆందోళకరంగానే ఉందని కేంద్రం తెలిపింది. గ్యాస్ ఏజెన్సీల వద్ద నిల్వలు ఉన్నాయని, పంపిణీకి ఆటంకంలేదని పేర్కొంది. ఇప్పటి వరకు ఈ-కేవైసీ పూర్తి చేయనివారు మాత్రమే కేవైసీ చేసుకోవాలని తెలిపింది. ఈ ప్రక్రియను ఇప్పటికే పూర్తి చేస్తే మళ్లీ చేయాల్సిన అవసరంలేదని తెలిపింది. ఏడాదికి ఒకసారి ఈ కేవైసీ చేసుకుంటే సరిపోతుందని పేర్కొంది. ఉజ్వల లబ్దిదారులు మాత్రం ఏడాదికి ఒకసారి ఈ-కేవైసీ పూర్తి చేయాలని సూచించింది. 8, 9వ రీఫిల్స్ పై సబ్సిడీ పొందడానికి ఇది తప్పనిసరి అని పేర్కొంది.

Also Read:  గ్యాస్ కష్టాలకు చెక్.. భారత తీరానికి నందాదేవి రాక!

Related News

ప్రధాని మోడీ ఇంటి ముట్టడికి కేజ్రీవాల్ బిగ్ స్కెచ్.. E20 పెట్రోల్‌పై కేజ్రీవాల్ సమరం

బీహార్‌లో బీజేపీకి బిగ్ షాక్.. భారీ మెజారిటీతో ప్రశాంత్ కిషోర్ గెలుపు

పెళ్లే కానక్కర్లేదు.. సహజీవనానికి ఆ చట్టం వర్తిస్తుంది.. సుప్రీంకోర్టు సంచలనం

సుప్రీం కోర్టులో జడ్జీల సంఖ్య పెంపు.. లోక్‌సభలో బిల్లు ఆమోదం!

ఇంజనీరింగ్ అభ్యర్థులకు గుడ్ న్యూస్..ఎయిర్‌పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియాలో ఉద్యోగాలు

డిగ్రీ అర్హతతో 11,403 క్లర్క్ పోస్టులు.. పూర్తి వివరాలివే !

కేరళలో విరిగిపడ్డ కొండచరియలు.. ‘బిగ్ టీవీ’ ప్రతినిధులకు తప్పిన పెను ప్రమాదం

నిరసనలకు జంతర్ మంతర్ గుడ్ బై? కొత్త వేదిక ఎక్కడ, సుప్రీంకోర్టులో పిటిషన్

Big Stories

Advertisement
×