E-Paper
Advertisement

గ్యాస్ వినియోగదారులకు బిగ్ అలర్ట్.. ఆ రూల్స్ తెలుసుకోకుంటే బుకింగ్ కష్టమే

గ్యాస్ వినియోగదారులకు బిగ్ అలర్ట్.. ఆ రూల్స్ తెలుసుకోకుంటే బుకింగ్ కష్టమే
Advertisement

LPG Gas Connection: సామాన్యులకు చాలా కీలకమైనది ఎల్పీజీ గ్యాస్ సిలిండర్. జేబులో సెల్‌ఫోన్ మాదిరిగా ఇంట్లో గ్యాస్ సిలిండర్ అలాంటింది. ఎల్పీజీ కనెక్షన్లకు సంబంధించిన కొత్త నిబంధనలను కస్టమర్లు ఎప్పటికప్పుడు తెలుసుకోవాలి. లేకుంటే ఇల్లు గ్యాస్ కనెక్షన్‌ బదిలీ, కొత్త కనెక్షన్ల జారీ, రీఫిల్ బుకింగ్‌, ఎల్పీజీ నుంచి పీఎన్‌జీ కనెక్షన్‌కు మారడం వంటి విషయాల్లో కఠినమైన నియమాలను అమలు చేస్తున్నాయి గ్యాస్ ఏజెన్సీలు. ఈ నిబంధనల గురించి సమాచారం లేకపోతే సిలిండర్ బుకింగ్‌లో ఇబ్బందులు తప్పవు.

గ్యాస్ వినియోగదారులకు బిగ్ అలర్ట్-కొత్త ఇంటికి మారే గృహ వినియోగదారులు కీలక సూచనలు. తమ ఎల్పీజీ పంపిణీదారులు ఇండేన్, హెచ్ఫీ, భారత్ గ్యాస్ తెలుసుకోవాలి. ఒకే ప్రాంతంలో ఇల్లు మారినప్పుడు పై ఏజెన్సీలను సంప్రదించాలి. తొలుత  గ్యాస్ ఏజెన్సీలను సంప్రదించాలి. గుర్తింపు కార్డు, కొత్త ఇంటి చిరునామా, వినియోగదారుడి గ్యాస్ బుక్, అసలు కనెక్షన్ వోచర్ వంటివి సమర్పించాలి.

Advertisement

వెంటనే గ్యాస్ ఏజెన్సీ కస్టమర్ల రికార్డులను అప్‌డేట్ చేస్తుంది. ఆ తర్వాత కొత్త చిరునామాకు సిలిండర్ సరఫరా కొనసాగుతుంది. లేకుంటే ఇబ్బందులు తప్పవు. అదే వేరే వేరే నగరానికి మారితే కొన్ని పత్రాలు అవసరం కూడా. ముందుగా కస్టమర్లు తమ వద్దనున్న గ్యాస్ సిలిండర్ , రెగ్యులేటర్‌ను గ్యాస్ ఏజెన్సీకి తప్పనిసరిగా తిరిగి ఇవ్వాలి.

బ్లాక్ మార్కెట్ అరికట్టేందుకు కొత్త రూల్స్-ఆ ఏజెన్సీ మీకు టెర్మినేషన్ వోచర్‌ను జారీ చేస్తుంది. కనెక్షన్ తీసుకునేటప్పుడు మీరు కట్టిన సెక్యూరిటీ డిపాజిట్‌ వాపసు ఇస్తుంది. కొత్త నగరానికి వెళ్లిన తర్వాత కొత్త ఏజెన్సీలో వోచర్‌, గుర్తింపు పత్రాలను సమర్పించాలి. పాత ట్రాన్స్‌ఫర్ సబ్‌స్క్రిప్షన్ వోచర్ గా మార్చి కొత్త వినియోగదారు నంబర్‌ను జారీ చేస్తుంది.

Advertisement

ఆ కొత్త నంబర్ ఆధారంగా కొత్త చిరునామా నుండి గ్యాస్ సిలిండర్లను బుక్ చేసుకోవచ్చు. మారుతున్న కొత్త ఇల్లు వేరే ఏజెన్సీ పరిధిలో ఉన్నట్లయితే విధానం మారుతుంది. మొదట పాత గ్యాస్ ఏజెన్సీ నుండి ట్రాన్స్‌ఫర్ టెర్మినేషన్ వోచర్ పొందాలి. ఎల్పీజీ కనెక్షన్‌ను కొత్త ప్రాంతంలోని గ్యాస్ ఏజెన్సీకి బదిలీ చేయడానికి అనుమతించే పత్రం ఉండాలి. కొత్త చిరునామాకి కనెక్షన్ బదిలీ అవుతుంది.

ఏ ఒక్కటి మిస్సయినా బుకింగ్ కష్టమే-పీఎన్‌జీ కనెక్షన్ తీసుకుంటే ఎల్పీజీ రద్దవుతుంది. మీ ఇంట్లో పైపుల ద్వారా PNG కనెక్షన్ తీసుకున్నట్లయితే ఎల్పీజీ గ్యాస్ కనెక్షన్లకు సంబంధించిన ప్రభుత్వ నిబంధనలు పాటించాలి. కొత్త నిబంధనల ప్రకారం.. పీఎన్‌జీ కనెక్షన్ తీసుకున్న నెల లోపు పాత ఎల్పీజీ కనెక్షన్‌ను నిలిపి వేయాలి.

ఒకే ఇంట్లో రెండు రకాల గ్యాస్ కనెక్షన్లను వాడటాన్ని నివారించడం, పంపిణీ వ్యవస్థను మెరుగుపరచడం ఈ నిబంధనల ప్రధాన ఉద్దేశం. జూన్ నెలాఖరుతో గడువు ముగిసింది. కొత్తగా పీఎన్‌జీ కనెక్షన్‌కు మారే ప్రతి ఒక్కరూ ఈ నిబంధనలు తెలుసుకోవాలి.

ALSO READ: దారుణం.. జ్యోతిష్యుడు చెప్పాడని కన్నకొడుకునే చంపిన తండ్రి.. అసలేం జరిగిందంటే?

అన్ని పత్రాలు సరిచూసుకోవాలని అధికారులు సూచించారు. వాణిజ్య ఎల్‌పిజి సిలిండర్ల ధరలు తగ్గడం ఉపశమనం కలిగించినప్పటికీ వినియోగదారులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా సాఫీగా జరగడం కోసం స్థానిక పంపిణీదారులు ఈ నిబంధనలను సమర్థవంతంగా అమలు చేయడం చాలా కీలకమని ఆ పరిశ్రమ నిపుణులు చెబుతున్నారు.

Related News

ప్రధాని మోడీ ఇంటి ముట్టడికి కేజ్రీవాల్ బిగ్ స్కెచ్.. E20 పెట్రోల్‌పై కేజ్రీవాల్ సమరం

బీహార్‌లో బీజేపీకి బిగ్ షాక్.. భారీ మెజారిటీతో ప్రశాంత్ కిషోర్ గెలుపు

పెళ్లే కానక్కర్లేదు.. సహజీవనానికి ఆ చట్టం వర్తిస్తుంది.. సుప్రీంకోర్టు సంచలనం

సుప్రీం కోర్టులో జడ్జీల సంఖ్య పెంపు.. లోక్‌సభలో బిల్లు ఆమోదం!

ఇంజనీరింగ్ అభ్యర్థులకు గుడ్ న్యూస్..ఎయిర్‌పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియాలో ఉద్యోగాలు

డిగ్రీ అర్హతతో 11,403 క్లర్క్ పోస్టులు.. పూర్తి వివరాలివే !

కేరళలో విరిగిపడ్డ కొండచరియలు.. ‘బిగ్ టీవీ’ ప్రతినిధులకు తప్పిన పెను ప్రమాదం

నిరసనలకు జంతర్ మంతర్ గుడ్ బై? కొత్త వేదిక ఎక్కడ, సుప్రీంకోర్టులో పిటిషన్

Big Stories

Advertisement
×