E-Paper
Advertisement

జస్ట్ 3 నిమిషాల ఛార్జింగ్ తో 250 కి.మీ రేంజ్ ఇచ్చే ఇండియన్ ఈవీ.. ధర జస్ట్ రూ. 4.5 లక్షలే!

జస్ట్ 3 నిమిషాల ఛార్జింగ్ తో 250 కి.మీ రేంజ్ ఇచ్చే ఇండియన్ ఈవీ.. ధర జస్ట్ రూ. 4.5 లక్షలే!
Advertisement

Blink Mobility EV: భారత ఎలక్ట్రిక్ వెహికల్ మార్కెట్ లో మరో కళ్లు చెదిరే ఈవీ ఎంట్రీ ఇవ్వబోతోంది. క్షణాల్లో ఛార్జింగ్, అదిరిపోయే రేంజ్, తక్కువ ధరలో సూపర్ ఎలక్ట్రిక్ కారు అడుగు పెట్టబోతోంది. ఇంకో విషయం ఏంటంటే.. ఈ కారును ఇండియన్ స్టార్టప్ తయారు చేయడం. ఇంతకీ ఆ కారు ఏంటి? దాన్ని తయారు చేసిన కంపెనీ ఏంటి? ఆ ఈవీ స్పెషాలిటీ ఏంటి? అనేది ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం..

బ్లింక్ మొబిలిటీ స్టార్టప్ నుంచి క్రేజీ ఈవీ

గురుగ్రామ్‌కు చెందిన బ్లింక్ మొబిలిటీ అనే స్టార్టప్, దేశంలోనే అత్యంత తక్కువ ధరలో లభించే ఎలక్ట్రిక్ కారును రూపొందిస్తోంది. ఈ కారు బ్యాటరీని గంటల తరబడి ఛార్జ్ చేయాల్సిన అవసరం లేకుండా, కేవలం కొన్ని నిమిషాల్లోనే నింపేయొచ్చు. సాధారణంగా ఎలక్ట్రిక్ కార్లను ఛార్జ్ చేయడానికి కొంత సమయం పడుతుంది. ఫాస్ట్ ఛార్జింగ్ స్టేషన్లు ఉన్నా కూడా కనీసం 30 నిమిషాల నుంచి గంట వరకు వేచి ఉండాల్సి వస్తుంది. కానీ, బ్లింక్ మొబిలిటీ అభివృద్ధి చేస్తున్న ఈ కారులో బ్యాటరీ స్వాపింగ్ టెక్నాలజీను ఉపయోగిస్తున్నారు.

Advertisement

అంటే, కారులో ఉన్న బ్యాటరీ ఖాళీ అయిన తర్వాత దాన్ని ఛార్జ్ చేయాల్సిన అవసరం ఉండదు. సమీపంలోని బ్యాటరీ స్వాపింగ్ స్టేషన్‌ కు వెళ్లి, ఖాళీ బ్యాటరీని తీసేసి, పూర్తిగా ఛార్జ్ చేసిన కొత్త బ్యాటరీని ఫిక్స్ చేయించుకోవచ్చు. ఈ మొత్తం ప్రక్రియ కోసం కేవలం 2 నిమిషాల 48 సెకన్లు మాత్రమే పడుతుంది. అంటే, పెట్రోల్ బంక్‌లో ఫ్యూయల్ నింపించుకునేంత సమయానికే మళ్లీ ప్రయాణాన్ని కొనసాగించవచ్చు. ఒకసారి బ్యాటరీ మార్చిన తర్వాత 250 కి.మీ వరకు ప్రయాణించే అవకాశం ఉంటుంది.

ప్రస్తుతం ప్రయోగ దశలో..

ఈ ప్రాజెక్ట్ ప్రస్తుతం ప్రయోగ దశలో ఉంది. గురుగ్రామ్‌లో ఇప్పటికే ఒక బ్యాటరీ స్వాపింగ్ స్టేషన్‌ను ఏర్పాటు చేసిన కంపెనీ, పబ్లిక్ రోడ్లపై ఈ కారును పరీక్షిస్తోంది. పరీక్షలు విజయవంతమైతే, భవిష్యత్తులో మరిన్ని నగరాల్లో కూడా ఇలాంటి స్వాపింగ్ స్టేషన్లను ఏర్పాటు చేసే అవకాశం ఉంది.

ధర కేవలం రూ. 4.5 లక్షలు

Advertisement

ఈ ఎలక్ట్రిక్ కారు ధర కూడా అందరినీ ఆకట్టుకునేలా ఉండొచ్చని భావిస్తున్నారు. కంపెనీ అంచనాల ప్రకారం దీని ధర సుమారు రూ.4.5 లక్షలు ఉండే అవకాశం ఉంది. అదే జరిగితే, ప్రస్తుతం భారత మార్కెట్లో లభిస్తున్న చాలా ఎలక్ట్రిక్ కార్ల కంటే ఇది చాలా తక్కువ ధరలో అందుబాటులోకి వచ్చే మోడల్‌గా నిలుస్తుంది. తక్కువ ధర, వేగవంతమైన బ్యాటరీ ఛేంజ్, 250 కిలోమీటర్లకు పైగా రేంజ్ తో వినియోగదారులకు అందుబాటులోకి వస్తే, భారత ఎలక్ట్రిక్ కారు మార్కెట్లో బ్లింక్ మొబిలిటీ కొత్త అధ్యాయాన్ని ప్రారంభించే అవకాశాలు కనిపిస్తున్నాయి.

Read Also: తక్కువ బడ్జెట్.. ఎక్కువ మైలేజ్.. రూ.10 లక్షల్లో బెస్ట్ ఆటోమేటిక్ CNG కార్లు ఇవే!

Related News

వర్షాకాలంలో ఈ EV బైకులే బెస్ట్.. వరదలోనూ దూసుకెళ్తాయట!

ఎక్స్‌ ప్రెస్‌ వే ప్రయాణికులకు షాక్.. టోల్ రేట్లు భారీగా పెంపు!

ఈ ఏడాది అత్యధికంగా అమ్ముడైన పెట్రోల్ కార్లు ఇవే.. నెంబర్ వన్ ఏదంటే?

టెస్లా కారులో గ్రోక్ AI.. ఇండియన్ యూజర్లకు సరికొత్త స్మార్ట్ ఫీచర్లు!

మారుతి నుంచి భారీ సర్‌ ప్రైజ్.. త్వరలో 4 క్రేజీ మోడళ్లు ఎంట్రీ!

హోండా కార్లపై కళ్లు చెదిరే ఆఫర్లు.. ఆ మూడు మోడల్స్ పై ఏకంగా రూ.2.45 లక్షల డిస్కౌంట్!

జస్ట్ రూ.1.25 లక్షలకే అవోర్ EX1.. కొనేముందు ఈ 5 విషయాలు కచ్చితంగా తెలుసుకోండి!

ఆగస్టులో దేశీ మార్కెట్ లో లాంచ్ కానున్న కొత్త కార్లు.. ఏ మోడల్ ఎప్పుడు వస్తుందో తెలుసా?

Big Stories

Advertisement
×