E-Paper
Advertisement

Karur Stampade: కరూర్ తొక్కిసలాట ఘటనపై ఎఫ్‌ఐఆర్‌లో కీలక విషయాలు..

Karur Stampade: కరూర్ తొక్కిసలాట ఘటనపై ఎఫ్‌ఐఆర్‌లో కీలక విషయాలు..
Advertisement

Karur Stampade: తమిళనాడులోని కరూర్ ర్యాలీ సందర్భంగా టీవీకే చీఫ్‌ విజయ్ వ్యవహరించిన తీరు వల్లే తొక్కిసలాట జరిగిందని ఎఫ్‌ఐఆర్‌లో పేర్కొన్నారు పోలీసులు. విజయ్ సాయంత్రం 4.45 గంటలకే కరూర్ జిల్లా సరిహద్దుకు వచ్చినా.. అక్కడ వాహనాల్ని ఆపి ఉద్దేశపూర్వకంగా ఆలస్యం చేశారని తెలిపారు. అనుమతి లేకున్నా రోడ్ షో నిర్వహించారన్నారు.

విజయ్ వైపు జనం దూసుకురావడంతో తొక్కిసలాట..
తన వాహనాన్ని జనం మధ్యంలో పార్క్ చేయడంతో.. విజయ్ వైపు జనం దూసుకురావడంతో తొక్కిసలాట జరిగిందని తెలిపారు. పరిస్థితి ఇబ్బందికరంగా మారుతోందని పార్టీ నేతలను హెచ్చరించినా పట్టించుకోలేదని ఎఫ్‌ఐఆర్‌లో పేర్కొన్నారు.

Advertisement

కరూర్ జిల్లా టీవీకే పార్టీ సెక్రటరీ అరెస్ట్ చేసిన పోలీసులు
కొందరు అక్కడ వేసిన టెంపరరీ షెడ్లు, చెట్లు ఎక్కారని.. షెడ్లు కూలిపోయి వాళ్లంతా కిందపడ్డారని తెలిపారు. ఈ క్రమంలోనే తొక్కిసలాట జరిగిందని.. జనాన్ని కంట్రోల్ చేయాలనే ఉద్దేశంతోనే లాఠీఛార్జ్ చేసినట్లు పోలీసులు తెలిపారు. అయితే.. ఎఫ్‌ఐఆర్‌లో విజయ్ పేరు మాత్రం చేర్చలేదు పోలీసులు. కరూర్ జిల్లా టీవీకే సెక్రటరీని అరెస్ట్ చేశారు పోలీసులు. టీవీకే జనరల్ సెక్రటరీ, జాయింట్ జనరల్ సెక్రటరీపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.

కరూర్ తొక్కిసలాట ఘటనపై ఎఫ్‌ఐఆర్‌లో కీలక విషయాలు..
విజయ్ మాట్లాడే సమయంలో.. కొంత సమయం కరెంట్ కట్ చేయాలంటూ టీవీకే పార్టీ నేతలే కోరారని తెలిపింది తమిళనాడు ఎలక్ట్రిసిటీ బోర్డు. కానీ తాము నిరాకరించామని తెలిపారు అధికారులు. కాగా.. తొక్కిసలాట వెనుక కుట్ర కోణం ఉన్నదని.. విజయ్ వేదిక వద్దకు రాగానే పవర్ కట్ చేశారంటూ ఆరోపించారు టీవీకే నేతలు.

Advertisement

Also Read: 220 కేవీ విద్యుత్ టవర్ ఎక్కి వేలాడుతూ వ్యక్తి హంగామా

తొక్కిసలాటపై తప్పుడు ప్రచారం చేసిన యూట్యూబర్ అరెస్ట్..
మరోవైపు.. కరూర్‌ తొక్కిసలాట ఘటనపై తప్పుడు ప్రచారం చేస్తున్న ఓ యూట్యూబర్‌ను అరెస్ట్ చేశారు పోలీసులు. 25 సోషల్ మీడియా అంకౌట్లపై కేసులు నమోదు చేశారు. కాగా.. తొక్కిసలాట ఘటనలో మృతుల సంఖ్య 41కి చేరింది. తీవ్రగాయాలతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న పలువురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తుంది.

Related News

ప్రధాని మోడీ ఇంటి ముట్టడికి కేజ్రీవాల్ బిగ్ స్కెచ్.. E20 పెట్రోల్‌పై కేజ్రీవాల్ సమరం

బీహార్‌లో బీజేపీకి బిగ్ షాక్.. భారీ మెజారిటీతో ప్రశాంత్ కిషోర్ గెలుపు

పెళ్లే కానక్కర్లేదు.. సహజీవనానికి ఆ చట్టం వర్తిస్తుంది.. సుప్రీంకోర్టు సంచలనం

సుప్రీం కోర్టులో జడ్జీల సంఖ్య పెంపు.. లోక్‌సభలో బిల్లు ఆమోదం!

ఇంజనీరింగ్ అభ్యర్థులకు గుడ్ న్యూస్..ఎయిర్‌పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియాలో ఉద్యోగాలు

డిగ్రీ అర్హతతో 11,403 క్లర్క్ పోస్టులు.. పూర్తి వివరాలివే !

కేరళలో విరిగిపడ్డ కొండచరియలు.. ‘బిగ్ టీవీ’ ప్రతినిధులకు తప్పిన పెను ప్రమాదం

నిరసనలకు జంతర్ మంతర్ గుడ్ బై? కొత్త వేదిక ఎక్కడ, సుప్రీంకోర్టులో పిటిషన్

Big Stories

Advertisement
×