E-Paper
Advertisement

Kerala Mob Lynching: ఒంటిపై దెబ్బలు లేని చోటు లేదు.. దొంగ అనుకుని దారుణం.. కేరళలో మూకదాడి

Kerala Mob Lynching: ఒంటిపై దెబ్బలు లేని చోటు లేదు.. దొంగ అనుకుని దారుణం.. కేరళలో మూకదాడి
Advertisement

Kerala Mob Lynching: కేరళలో దారుణ ఘటన చోటుచేసుకుంది. దొంగగా భావించి ఓ వ్యక్తిపై మూకదాడి చేశారు. ఉపాధి కోసం ఉత్తరాది నుంచి వెళ్లిన వ్యక్తిపై స్థానికులు దాడి చేయడంతో అతడు మరణించాడు. పోస్ట్ మార్టమ్ రిపోర్టులో.. సంచలన విషయాలను పేర్కొ్న్నారు. ఒంటిపై దెబ్బలు లేని చోటు లేదని వైద్యులు తెలిపారు.

ఛత్తీస్‌గఢ్‌లోని కర్హి గ్రామానికి చెందిన రామ్ నారాయణ్ బాఘేల్ పొరుగువారితో కలిసి కేరళకు వెళ్లాడు. అతనికి అక్కడ తగిన ఉద్యోగం దొరకకపోవడంతో, త్వరలోనే ఇంటికి తిరిగి వస్తానని కుటుంబ సభ్యులతో చెప్పాడు. ఇంతలో డిసెంబర్ 18న కుటుంబ సభ్యులకు కేరళ పోలీసుల నుండి ఫోన్ కాల్ వచ్చింది. వెంటనే పాలక్కాడ్ రావాలని ఆ ఫోన్ కాల్ సారాంశం. రామ్ నారాయణ్ పోలీస్ స్టేషన్‌లో ఉన్నాడని పోలీసులు చెప్పారు. అతడి మరణం గురించి చెప్పలేదు.

చోరీ ఆరోపణలతో దాడి

Advertisement

డిసెంబర్ 17న అట్టప్పల్లం ప్రాంతంలోని స్థానికులు రామ్ నారాయణ్‌ దొంగతనం చేశాడన్న ఆరోపణతో బంధించి దాడి చేశారు. రామ్ నారాయణ్ మద్యం మత్తులో ఉన్నప్పటికీ, దొంగతనం చేశాడన్న దానికి ఎలాంటి ఆధారాలు లేవని పోలీసులు తెలిపారు. ఈ దాడిలో రామ్ నారాయణ్ మృతి చెందాడు. పోస్ట్ మార్టమ్ రిపోర్టులో దాడి తీవ్రతను తెలియజేశారు వైద్యులు. వాలయార్ వద్ద జరిగిన మూక దాడిలో 31 ఏళ్ల రామ్ నారాయణ్‌ను దారుణంగా కొట్టినట్లు పోస్ట్‌మార్టంలో నిర్ధారించారు. తలకు తీవ్రమైన గాయాలు అయ్యాయని, శరీరం అంతటా 80కి పైగా గాయాలు ఉన్నాయని తెలిపారు. అంతర్గతంగా రక్తస్రావం అవ్వడం, తలకు తీవ్రగాయం కావడంతో అతడు మరణించాడని నిర్ధారించారు.

గాయం లేని చోటు లేదు – వైద్యులు

పోస్ట్‌మార్టం నిర్వహించిన డాక్టర్ హితేష్ శంకర్ మీడియాతో మాట్లాడుతూ.. శరీరంలో గాయాలు లేని భాగం లేదని అన్నారు. చాలా క్రూరంగా దాడి జరిగిందన్నారు. బాధితుడిని ఒక జంతువులా కొట్టినట్లు తెలిపారు. పోలీసులు నిందితులపై హత్య అభియోగాలు మోపడానికి రెడీ అయ్యారు. ఈ కేసుకు సంబంధించి గురువారం ఐదుగురిని అరెస్టు చేశారు.

Advertisement

రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ ఈ సంఘటనను సుమోటోగా స్వీకరించి విచారణకు ఆదేశించింది. మూడు వారాల్లోగా నివేదికను సమర్పించాలని పాలక్కాడ్ జిల్లా పోలీసు అధికారిని ఆదేశించింది.

నాలుగు రోజుల క్రితమే కేరళకు

నాలుగు రోజుల క్రితమే కేరళ వెళ్లిన రామ్ నారాయణ్ ఇంతలోనే మరణించినట్లు తెలిసిందని బంధువు శశికాంత్ బాఘేల్ అన్నారు. ఉద్యోగం దొరక్క ఇంటికి తిరిగి వెళ్లాలనుకున్న సమయంలో ఈ దాడి జరిగినట్లు శశికాంత్ చెప్పారు. బాధితుడికి భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారన్నారు. బాధిక కుటుంబానికి పరిహారం అందించాలని సామాజిక కార్యకర్త జబ్బర్ డిమాండ్ చేశారు. బంగ్లాదేశ్ చొరబాటుదారుడని భావించి తీవ్రంగా కొట్టారని జబ్బర్ ఆరోపించారు.

Also Read: Doctor Attack: గౌరవంగా మాట్లాడమన్నందుకు.. పేషెంట్ పై వైద్యుడు దాడి.. వీడియో వైరల్

ఈ ఘటనపై కేరళ సీఎం పినరయి విజయన్ స్పందించారు. నిందితులను పట్టుకుని చట్టం ముందు నిలబెటతామన్నారు. బాధితులను ఆదుకుంటామని హామీ ఇచ్చారు.

 

Related News

ప్రధాని మోడీ ఇంటి ముట్టడికి కేజ్రీవాల్ బిగ్ స్కెచ్.. E20 పెట్రోల్‌పై కేజ్రీవాల్ సమరం

బీహార్‌లో బీజేపీకి బిగ్ షాక్.. భారీ మెజారిటీతో ప్రశాంత్ కిషోర్ గెలుపు

పెళ్లే కానక్కర్లేదు.. సహజీవనానికి ఆ చట్టం వర్తిస్తుంది.. సుప్రీంకోర్టు సంచలనం

సుప్రీం కోర్టులో జడ్జీల సంఖ్య పెంపు.. లోక్‌సభలో బిల్లు ఆమోదం!

ఇంజనీరింగ్ అభ్యర్థులకు గుడ్ న్యూస్..ఎయిర్‌పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియాలో ఉద్యోగాలు

డిగ్రీ అర్హతతో 11,403 క్లర్క్ పోస్టులు.. పూర్తి వివరాలివే !

కేరళలో విరిగిపడ్డ కొండచరియలు.. ‘బిగ్ టీవీ’ ప్రతినిధులకు తప్పిన పెను ప్రమాదం

నిరసనలకు జంతర్ మంతర్ గుడ్ బై? కొత్త వేదిక ఎక్కడ, సుప్రీంకోర్టులో పిటిషన్

Big Stories

Advertisement
×