E-Paper
Advertisement

Gambhir-Kohli: కోహ్లీపై గంభీర్ మ‌రో కుట్ర‌..వ‌న్డేలు కూడా ఆడ‌కుండా బీసీసీఐకి ఫిర్యాదు ?

Gambhir-Kohli: కోహ్లీపై గంభీర్ మ‌రో కుట్ర‌..వ‌న్డేలు కూడా ఆడ‌కుండా బీసీసీఐకి ఫిర్యాదు ?
Advertisement

Gambhir-Kohli: టీమిండియా స్టార్ క్రికెట‌ర్ విరాట్ కోహ్లీని మ‌రోసారి హెడ్ కోచ్ గౌత‌మ్ గంభీర్ టార్గెట్ చేసిన‌ట్లు వార్త‌లు వ‌స్తున్నాయి. వ‌న్డే జ‌ట్టు నుంచి కూడా విరాట్ కోహ్లీని తొల‌గించేలా పావులు క‌దుపుతున్నార‌ని నేష‌న‌ల్ మీడియాలో చాలా ర‌కాల న్యూస్ వ‌స్తున్నాయి. త్వ‌ర‌లోనే టీమిండియా వ‌ర్సెస్ న్యూజిలాండ్ జ‌ట్ల మ‌ధ్య వ‌న్డే సిరీస్ జ‌రుగ‌నుంది. టీమిండియా వ‌ర్సెస్ న్యూజిలాండ్ జ‌ట్ల మ‌ధ్య వ‌న్డే సిరీస్ జ‌న‌వ‌రి 11, 2026 నుంచి ప్రారంభం కానుంది. అయితే, ఈ టోర్నమెంట్ నేప‌థ్యంలో విరాట్ కోహ్లీకి రెస్ట్ ఇవ్వాల‌ని బీసీసీఐకి స‌మాచారం ఇచ్చార‌ట హెడ్ కోచ్ గౌత‌మ్ గంభీర్. అత‌ని స్థానంలో మ‌రో యంగ్ క్రికెట‌ర్ కు అవ‌కాశం ఇవ్వాల‌ని కుట్ర‌ల‌కు తెర‌లేపార‌ట‌. 2027 వ‌న్డే వ‌ర‌ల్డ్ క‌ప్ న‌కు చాలా రోజుల స‌మ‌యం ఉంద‌ని, ఈ త‌రుణంలో విరాట్ కోహ్లీకి రెస్ట్ అవ‌స‌రం అంటూ బీసీసీఐకి నివేదిక ఇచ్చిన‌ట్లు ఓ న్యూస్ బ‌య‌ట‌కు వ‌చ్చింది. దీంతో విరాట్ కోహ్లీ ఫ్యాన్స్ సీరియ‌స్ అవుతున్నారు.

Also Read: Team India Squad: న్యూజిలాండ్ తో ఆడే టీం ఇండియా జట్టు ఇదే.. గిల్ పై వేటు, అక్షర్ పటేల్ కు బంపర్ ఆఫర్

టీమిండియా వర్సెస్ న్యూజిలాండ్ మధ్య మూడు వన్డేల సిరీస్

Advertisement

టీమిండియా వర్సెస్ న్యూజిలాండ్ మధ్య 3 వన్డేల సిరీస్ జరగనుంది. ఈ మేరకు ఇప్పటికే షెడ్యూల్ ఖరారు అయిన సంగతి తెలిసిందే. జనవరి 11వ తేదీ నుంచి ఈ మూడు వన్డేల సిరీస్ ప్రారంభమవుతుంది. మొదటి వన్డే మ్యాచ్ జనవరి 11వ తేదీ ఆదివారం 2026 లో జరగనుంది. వడోదర స్టేడియంలో జరగనున్న ఈ మ్యాచ్ మధ్యాహ్నం 1:30 గంటలకు ప్రారంభమవుతుంది. రెండవ వ‌న్డే జనవరి 14వ తేదీన రాజ్కోట్ లోని నిరంజన్ స్టేడియం వేదికగా నిర్వహిస్తారు. ఇక మూడవ వన్డే జనవరి 18వ తేదీన ఇండోర్ లోని హోల్కర్ క్రికెట్ స్టేడియంలో జరగనుంది. ఈ మేరకు ఇప్పటికే షెడ్యూల్ కూడా ఫిక్స్ అయింది. జియో హాట్ స్టార్ లో ఈ మ్యాచ్ లు వచ్చే అవకాశాలు ఉన్నాయి.

కోహ్లీ, రోహిత్ శర్మ రీ-ఎంట్రీ

న్యూజిలాండ్ వర్సెస్ టీమిండియా మధ్య జనవరిలో జరగనున్న 3 వన్డేల సిరీస్ నేపథ్యంలో స్టార్ క్రికెటర్లు రోహిత్ శర్మ అలాగే విరాట్ కోహ్లీ ఇద్దరు రీ-ఎంట్రీ ఇవ్వనున్నారు. ఈ 3 వన్డేల సిరీస్ కు ఈ ఇద్దరు క్రికెటర్లు అందుబాటులో ఉంటారు. ఇప్పటికే ఆస్ట్రేలియా అలాగే దక్షిణాఫ్రికా పైన జరిగిన వన్డే సిరీస్ లో ఈ ఇద్దరు స్టార్లు అద్భుతంగా రాణించారు. వన్డే క్రికెట్ అంతర్జాతీయ ర్యాంకింగ్స్ లో కూడా మొదటి రెండు స్థానాలలో రోహిత్ శర్మ అలాగే విరాట్ కోహ్లీ ఇద్దరు వరుసగా ఉన్నారు. ఇలాంటి నేప‌థ్యంలో గంభీర్ ఎన్ని ప్ర‌య‌త్నాలు చేసినా, ఇక విరాట్ కోహ్లీతో పాటు రోహిత్ శ‌ర్మ‌ను ఏం పీక‌లేడ‌ని అంటున్నారు క్రికెట్ ఫ్యాన్స్‌.

Advertisement

Also Read:  T20 World Cup 2026 India Squad: గిల్ పీడ విరగడైంది.. టి20 ప్రపంచ కప్ 2026 ఆడే టీమిండియా జట్టు ఇదే

 

Related News

నా బౌలింగ్ అంటేనే ధోని భ‌య‌ప‌డి, ప్యాంట్ త‌డుపుకుంటాడు !

ఐపీఎల్ 2027లోకి మహ్మద్ అమీర్…RCB ద్వారా ఎంట్రీ ?

పాకిస్తాన్ కొత్త‌ కోచ్ గా ఫ‌స్ట్ క్లాస్ క్రికెట‌ర్‌…వీరుడు వ‌స్తున్న‌ట్లు PCB బిల్డ‌ప్

ప్రీతి జింటాతో ఆస్ట్రేలియా క్రికెట‌ర్‌ బ్రెట్ లీ ఎ**ఫైర్‌..డ్రెస్సింగ్ రూంలోనే ఆ ప‌నులు?

మాకు నీతులు చెప్ప‌డం కాదు, ముందు పాకిస్తాన్ జ‌ట్టును గాడిలో పెట్టు

దంబుల్లా సిక్సర్స్ కు ప‌ట్టిన ద‌రిద్రం…ఇఫ్తికార్ అహ్మద్ అడుగుపెట్ట‌గానే ఎలిమినేట్

2011 వ‌ర‌ల్డ్ క‌ప్ నుంచి ధోనిపై ప‌గ పెంచుకున్నా..కానీ CSKలోకి వెళ్లాక మాత్రం

టీమిండియాలో 8 మందికి గాయాలు..ఇక 2027 వ‌ర‌ల్డ్ క‌ప్ మ‌ర్చిపోవాల్సిందే

Big Stories

Advertisement
×