E-Paper
Advertisement

Karnataka Plane Crash: పొలాల్లో బోల్తా పడ్డ శిక్షణ విమానం.. తృటిలో తప్పిన పెను ప్రమాదం

Karnataka Plane Crash: పొలాల్లో బోల్తా పడ్డ శిక్షణ విమానం.. తృటిలో తప్పిన పెను ప్రమాదం
Advertisement

Karnataka Plane Crash: కర్ణాటక రాష్ట్రం విజయపుర జిల్లాలో ఓ ప్రైవేట్ శిక్షణ విమానం ప్రమాదానికి గురైంది. రెడ్ బర్డ్ ఏవియేషన్ సంస్థకు చెందిన ఈ చిన్న విమానం.. బాబలేశ్వర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని మంగళూరు గ్రామ శివార్లలోని పొలాల్లో కుప్పకూలింది. ఈ ఘటన జరిగిన సమయంలో విమానంలో ఒక కెప్టెన్ , ట్రైనీ పైలట్ ఉన్నారు.

విమానం గాలిలో ఉన్నప్పుడే ఇంజిన్‌లో సాంకేతిక లోపం తలెత్తినట్లు తెలుస్తోంది. సాంకేతిక సమస్యను గుర్తించిన పైలట్ విమానాన్ని నియంత్రించేందుకు ప్రయత్నించినప్పటికీ.. అది సాధ్యపడక పొలాల్లోకి దూసుకెళ్లి బోల్తా పడింది. విమానం నేలను బలంగా ఢీకొనడంతో దాని ముందు భాగం పూర్తిగా ధ్వంసం అయ్యింది.

Advertisement

ఈ ప్రమాదంలో కెప్టెన్ ,ట్రైనీ పైలట్ ఇద్దరికీ గాయాలయ్యాయి. అదృష్టవశాత్తూ ప్రాణాపాయం తప్పింది. స్థానికులు వెంటనే స్పందించి.. వారిని విమానం నుండి బయటకు తీసి చికిత్స నిమిత్తం సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం వారి పరిస్థితి నిలకడగా ఉన్నట్లు సమాచారం.

ఘటనా స్థలానికి చేరుకున్న బాబలేశ్వర్ పోలీసులు , రెడ్ బర్డ్ ఏవియేషన్ ప్రతినిధులు పరిస్థితిని సమీక్షించారు. విమాన ప్రమాదానికి దారితీసిన ఖచ్చితమైన కారణాలను తెలుసుకోవడానికి డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (DGCA) అధికారులు , ఏవియేషన్ నిపుణులు లోతైన దర్యాప్తును ప్రారంభించారు.

Advertisement

Also Read: శ్రీకాకుళంలో దొంగల బీభత్సం.. ఒకే రాత్రి ఐదు ఇళ్లలో భారీ దోపిడీ!

Related News

ప్రధాని మోడీ ఇంటి ముట్టడికి కేజ్రీవాల్ బిగ్ స్కెచ్.. E20 పెట్రోల్‌పై కేజ్రీవాల్ సమరం

బీహార్‌లో బీజేపీకి బిగ్ షాక్.. భారీ మెజారిటీతో ప్రశాంత్ కిషోర్ గెలుపు

పెళ్లే కానక్కర్లేదు.. సహజీవనానికి ఆ చట్టం వర్తిస్తుంది.. సుప్రీంకోర్టు సంచలనం

సుప్రీం కోర్టులో జడ్జీల సంఖ్య పెంపు.. లోక్‌సభలో బిల్లు ఆమోదం!

ఇంజనీరింగ్ అభ్యర్థులకు గుడ్ న్యూస్..ఎయిర్‌పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియాలో ఉద్యోగాలు

డిగ్రీ అర్హతతో 11,403 క్లర్క్ పోస్టులు.. పూర్తి వివరాలివే !

కేరళలో విరిగిపడ్డ కొండచరియలు.. ‘బిగ్ టీవీ’ ప్రతినిధులకు తప్పిన పెను ప్రమాదం

నిరసనలకు జంతర్ మంతర్ గుడ్ బై? కొత్త వేదిక ఎక్కడ, సుప్రీంకోర్టులో పిటిషన్

Big Stories

Advertisement
×