E-Paper
Advertisement

Tata Punch EV Facelift: టాటా లవర్స్ కు పండుగే, లాంచ్ కు ముందే పంచ్ EV ఫేస్‌ లిఫ్ట్ ఆవిష్కరణ!

Tata Punch EV Facelift: టాటా లవర్స్ కు పండుగే, లాంచ్ కు ముందే పంచ్ EV ఫేస్‌ లిఫ్ట్ ఆవిష్కరణ!
Advertisement

Tata Punch EV Facelift Unveiled: ఫిబ్రవరి 20న ఇండియన్ మార్కెట్ లోకి టాటా పంచ్ ఎలక్ట్రిక్ ఫేస్ లిఫ్ట్ ను లాంచ్ చేయనున్నట్లు ప్రకటించింది. ఈ లోగా మరో గుడ్ న్యూస్ చెప్పింది. అధికారికంగా టాటా పంచ్ EV ఫేస్‌ లిఫ్ట్‌ ను ఆవిష్కరించింది. టాటా పంచ్ ICE (పెట్రోల్) వెర్షన్‌ను అప్‌డేట్ చేసిన కొద్దిసేపటికే ఈ కారును ఆవిష్కరించింది. రెండు సంవత్సరాల క్రితం పంచ్ EV తొలుత భారత మార్కెట్లోకి వచ్చింది.  ఆ తర్వాత టాటా అత్యంత సక్సెస్ ఫుల్ ఎలక్ట్రిక్ కార్లలో ఒకటిగా గుర్తింపు తెచ్చుకుంది.

టాటా సోషల్ మీడియాలో టీజర్ షేర్

అటు అధికారిక EV సోషల్ హ్యాండిల్స్‌ లో ఈ కారుకు సంబంధించిన టీజర్ ను షేర్ చేసింది. అంతేకాదు, ఈ కారుకు సంబంధించిన ముందస్తు కొనుగోలు రిజిస్ట్రేషన్లు ఇప్పటికే ఓపెన్ చేసింది. ఫేస్‌ లిఫ్టెడ్ పంచ్ EV ప్రస్తుత మోడల్ తమ కంపెనీ అమ్మకాల్లో మరింత వృద్ధి సాధించేలా చేస్తుందని భావిస్తోంది.

కొత్త ఈవీ ప్రత్యేకత ఏంటి?

Advertisement

పంచ్ EV ఫేస్‌ లిఫ్ట్‌ లో ముందు భాగంగలో కీలక మార్పులు, చేర్పులు ఉన్నాయి. నిలువుగా ఉన్న హెడ్‌ ల్యాంప్ లే అవుట్ అలాగే ఉంది. కానీ, యూనిట్లు ఇప్పుడు పెద్దవిగా, మరింత యాంగులర్ గా కనిపిస్తాయి. ఇది SUVకి బోల్డ్ ఫేస్ ను  ఇస్తుంది. LED డే టైమ్ రన్నింగ్ లాంప్‌లు అలాగే ఉన్నాయి. ముందు మౌంటెడ్ ఛార్జింగ్ పోర్ట్ వాటి మధ్య చక్కగా ఉంది. కింది  బంపర్ ప్రాంతం రీ మోడల్ చేయబడింది. గ్రిల్‌ పై నిలువు స్లాట్లు, వెండి కలర్ లో ఫాక్స్ స్కిడ్ ప్లేట్‌ను కలిగి ఉంటుంది. కారును మరింత దృఢంగా ఉంచడంలో ఇది సాయపడుతుంది.

టాటా పంచ్ ఎలక్ట్రిక్ ఫేస్ లిఫ్ట్ డిజైన్

అటు ఈ కారుకు సంబంధించి మొత్తం డిజైన్ మారదు. అయితే, టాటా కొత్త ఏరో ఆప్టిమైజ్ చేసిన అల్లాయ్ వీల్స్‌ ను ప్రవేశపెట్టింది. ఇది సామర్థ్యాన్ని మెరుగుపరచడానికి, లుక్‌ను రిఫ్రెష్ చేయడానికి రూపొందించబడింది. వెనుక వైపున, కొద్దిగా సవరించిన బంపర్, నవీకరించబడిన LED టెయిల్ ల్యాంప్‌ లను కలిగి ఉంది. ఇటీవల ప్రారంభించబడిన పంచ్ ఫేస్‌ లిఫ్ట్ నుంచి ప్రేరణ పొందిన కనెక్టెడ్ లైట్‌ బార్‌ను కలిగి ఉంటుంది. టాటా షేర్ చేసిన నియాన్ యెల్లో బాడీ కలర్  బ్లాక్ రూఫ్‌ తో అప్‌ గ్రేడ్ చేయబడింది. EV నిర్దిష్ట వైబ్‌ను కలిగి ఉంటుంది. లాంచ్‌ లో ఈ కారు మరిన్ని కలర్ ఆప్షన్స్ అందిస్తుందని భావిస్తున్నారు.

ఇంటీరియర్ గురించి..  

Advertisement

ఎక్స్ టీరియర్ లో చిన్న చిన్న మార్పులతో పాటు, లోపలి భాగంలో పూర్తి పునఃరూపకల్పన కాకుండా చిన్న సవరణలు ఉంటాయని భావిస్తున్నారు. కొత్త అప్హోల్స్టరీ, చిన్న డాష్‌బోర్డ్ ట్వీక్‌లు ఉండే అవకాశం ఉంది. అయితే రెండు స్పోక్ స్టీరింగ్ వీల్, డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, టచ్‌ స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ లాంటి కీలక అంశాలు అలాగే కొనసాగించనుంది.  ఫీచర్ వారీగా, పంచ్ EV ఇప్పటికే బాగుంది. ఫేస్‌లిఫ్ట్ ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్, సిక్స్ స్పీకర్ సౌండ్ సిస్టమ్, పుష్ బటన్ స్టార్ట్‌ తో కీలెస్ ఎంట్రీ, ఆటో డిమ్మింగ్ IRVM, వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్లు, వెనుక AC వెంట్స్, ఎలక్ట్రిక్ సన్‌ రూఫ్ లాంటి ఫీచర్లను కలిగి ఉంటుంది. ఈ ఫీచర్లు అత్యంత సౌకర్యవంతమైన, టెక్ లోడెడ్ కార్లలో ఒకటిగా చేయనున్నాయి.

పరిధి, పనితీరు గురించి..

టాటా కొత్త కారుకు సంబంధించిన బ్యాటరీ, మోటారు వివరాలను వెల్లడించలేదు. అయితే, పంచ్ EV ఫేస్‌లిఫ్ట్ లాంగ్ రేంజ్ వెర్షన్‌ తో సహా మల్టీఫుల్ బ్యాటరీ ఎంపికలతో కొనసాగుతుందని భావిస్తున్నారు.

Read Also: రెనాల్ట్ డస్టర్ To కియా సోరెంటో.. 2026లో లాంచ్ కానున్న క్రేజీ హైబ్రిడ్ కార్లు ఇవే!

Related News

వర్షాకాలంలో ఈ EV బైకులే బెస్ట్.. వరదలోనూ దూసుకెళ్తాయట!

ఎక్స్‌ ప్రెస్‌ వే ప్రయాణికులకు షాక్.. టోల్ రేట్లు భారీగా పెంపు!

ఈ ఏడాది అత్యధికంగా అమ్ముడైన పెట్రోల్ కార్లు ఇవే.. నెంబర్ వన్ ఏదంటే?

టెస్లా కారులో గ్రోక్ AI.. ఇండియన్ యూజర్లకు సరికొత్త స్మార్ట్ ఫీచర్లు!

మారుతి నుంచి భారీ సర్‌ ప్రైజ్.. త్వరలో 4 క్రేజీ మోడళ్లు ఎంట్రీ!

హోండా కార్లపై కళ్లు చెదిరే ఆఫర్లు.. ఆ మూడు మోడల్స్ పై ఏకంగా రూ.2.45 లక్షల డిస్కౌంట్!

జస్ట్ రూ.1.25 లక్షలకే అవోర్ EX1.. కొనేముందు ఈ 5 విషయాలు కచ్చితంగా తెలుసుకోండి!

ఆగస్టులో దేశీ మార్కెట్ లో లాంచ్ కానున్న కొత్త కార్లు.. ఏ మోడల్ ఎప్పుడు వస్తుందో తెలుసా?

Big Stories

Advertisement
×