E-Paper
Advertisement

K Ponmudy | విద్యాశాఖ మంత్రి, భార్యకు 3 ఏళ్ల జైలు శిక్ష

K Ponmudy | విద్యాశాఖ మంత్రి, భార్యకు 3 ఏళ్ల జైలు శిక్ష
Advertisement

K Ponmudy | తమిళనాడు విద్యాశాఖ మంత్రి, డీఎంకే సీనియర్ నేత కె పొన్ముడి, ఆయన భార్యకు గురువారం మద్రాస్ హైకోర్టు మూడేళ్ల జైలు శిక్ష విధించింది. ఆదాయానికి మించి అక్రమాస్తుల కేసులో మంత్రి దంపతులకు కోర్టు ఈ శిక్ష విధించింది. పైగా రూ. 50 లక్షలు చొప్పున ఇద్దరూ జరిమానా కూడా చెల్లించాలని తీర్పు వెలువరించింది.

2006 సంవత్సరం నుంచి 2011 వరకు ఖనిజ శాఖ మంత్రిగా ఉన్న పొన్ముడి కోట్లు విలువ చేసే అక్రమాస్తులను కూటబెట్టుకున్నారనే కేసులో మద్రాస్ కోర్టు మంత్రి పొన్ముడి, ఆయన భార్య విశాలాక్షికి డెసెంబర్ 19న దోషిగా తేల్చింది. ఈ కేసులో గురువారం దంపతులిద్దరికీ మూడేళ్ల జైలు, ఒక్కొక్కొరికి రూ.50 లక్షలు జరిమానా విధించింది. పై కోర్టులో అప్పీలు చేసుకునేందుకు దంపతులిద్దరికీ 30 రోజుల గడువు విధించింది.

Advertisement

ఈ కేసులో మంత్రి పొన్ముడి వయసు(73), ఆరోగ్య కారణాలు చూపుతూ మినహాయింపు కోరినా కోర్టు ఈ కారణాలను తోసిపుచ్చింది.

ఇంతకు ముందు ఇదే కేసులో ఒక సెషన్స్ కోర్టు 2016 సంవత్సరంలో ఇద్దరూ నిర్దోషులుగా తీర్పు వెలువరించింది. కానీ విజిలెన్స్ అధికారులు ఈ కేసుని హైకోర్టులో సవాల్ చేశారు.

Advertisement

రనే కేసులో పొన్ముడితో పాటు ఆయన భార్య విశాలాక్షిని మద్రాస్ హైకోర్టు ఈనెల 19న దోషిగా తేల్చింది. ఇదే కేసు నుంచి వారిద్దరికీ విముక్తి కల్పిస్తూ 2016లో దిగువ న్యాయస్థానం ఇచ్చిన తీర్పును హైకోర్టు కొట్టివేసింది. అయితే, ఆగస్టు నెలలో ఈ కేసును మద్రాసు హైకోర్టు సుమోటోగా తీసుకుని విచారణ చేపట్టాలని నిర్ణయించింది. ఈ క్రమంలోనే ఇవాళ తీర్పు వెలువరించిన న్యాయమూర్తి పొన్ముడికి మూడేళ్ల జైలు శిక్ష విధించారు. ఈ కేసులో ఆయన పైకోర్టుకు అప్పీలు చేసుకునేందుకు హైకోర్టు 30 రోజుల గడువు విధించింది.

Related News

ప్రధాని మోడీ ఇంటి ముట్టడికి కేజ్రీవాల్ బిగ్ స్కెచ్.. E20 పెట్రోల్‌పై కేజ్రీవాల్ సమరం

బీహార్‌లో బీజేపీకి బిగ్ షాక్.. భారీ మెజారిటీతో ప్రశాంత్ కిషోర్ గెలుపు

పెళ్లే కానక్కర్లేదు.. సహజీవనానికి ఆ చట్టం వర్తిస్తుంది.. సుప్రీంకోర్టు సంచలనం

సుప్రీం కోర్టులో జడ్జీల సంఖ్య పెంపు.. లోక్‌సభలో బిల్లు ఆమోదం!

ఇంజనీరింగ్ అభ్యర్థులకు గుడ్ న్యూస్..ఎయిర్‌పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియాలో ఉద్యోగాలు

డిగ్రీ అర్హతతో 11,403 క్లర్క్ పోస్టులు.. పూర్తి వివరాలివే !

కేరళలో విరిగిపడ్డ కొండచరియలు.. ‘బిగ్ టీవీ’ ప్రతినిధులకు తప్పిన పెను ప్రమాదం

నిరసనలకు జంతర్ మంతర్ గుడ్ బై? కొత్త వేదిక ఎక్కడ, సుప్రీంకోర్టులో పిటిషన్

Big Stories

Advertisement
×