E-Paper
Advertisement

Judges Politics Chandrachud: మాజీ న్యాయమూర్తులు రాజకీయాల్లో రావడం కరెక్టేనా?.. జస్టిస్ చంద్రచూడ్ ఏం చెప్పారంటే?..

Judges Politics Chandrachud: మాజీ న్యాయమూర్తులు రాజకీయాల్లో రావడం కరెక్టేనా?.. జస్టిస్ చంద్రచూడ్ ఏం చెప్పారంటే?..
Advertisement

Judges Politics Chandrachud| న్యాయమూర్తులు అంటే సమాజంలో భగవంతుడితో సమానం. మనిషి తనకు ఏదైనా అన్యాయం జరిగితే తనకు న్యాయం చేయమని కనిపించని ఆ భగవంతుడికి.. కోర్టులో న్యాయం చేయడానికే కూర్చొని ఉండే న్యాయమూర్తిని వేడుకుంటాడు. కానీ అటువంటి న్యాయమూర్తి చేసే న్యాయంలో పారదర్శక ఉండడం చాలా అనవసరం. లేకపోతే న్యాయం చేసినా.. అందులో విశ్వాసం లోపిస్తుంది. ఇదే విషయం తాజాగా సుప్రీం కోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డివై చంద్రచూడ్ అన్నారు.

న్యాయమూర్తులు పదవి విరమణ తరువాత రాజకీయాల్లోకి రావడం ఎంతవరకు సమంజసం అనే ప్రశ్నకు జస్టిస్ చంద్రచూడ్ చక్కగా సమాధానమిచ్చారు. ఒక ప్రముఖ జాతీయ మీడియా ఛానెల్ కార్యక్రమంలో జస్టిస్ చంద్రచూడ్ మాట్లాడుతూ.. “ఈ సమాజం మాజీ న్యాయమూర్తులను చట్టానికి పరిరక్షకులుగా భావిస్తుంది. అందుకే న్యాయమూర్తల వ్యక్తిగత జీవితం కూడా సమాజంలో ఆదర్శప్రాయంగా ఉండాలి. పక్షపాతం ఉండకూడదు. న్యాయమూర్తుల రిటైర్మెంట్ వయసు 65. నేను 65 ఏళ్ల వయసు తరువాత కూడా నా వృత్తి, న్యాయ వ్యవస్థపై అనుమానం కలిగించే ఏ పనీ చేయను.

Advertisement

Also Read: దేవుని ముందు కూర్చొని ప్రార్థించా’.. అయోధ్య కేసు తీర్పుపై సిజెఐ

ఈ సమాజం న్యాయమూర్తులు రిటైర్ అయినా.. వారిని న్యాయానికి ప్రతీకగా చూస్తుంది. అందుకే సాధారణం పౌరులకు భిన్నంగా మాజీ న్యాయమూర్తులు జీవించాల్సి ఉంటుంది. అవును పదవిలో లేకపోయినా ఒక మాజీ న్యాయమూర్తి ప్రతిష్ట న్యాయానికి, పారదర్శకతకు ప్రతీకగానే ఉంటుంది. అందుకే న్యాయమూర్తి పదవిలో పనిచేసే ప్రతి వ్యక్తి కూడా తాను రిటైర్మెంట్ తరువాత ఎలాంటి జీవితం గడపాలో బాలా ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి. ఎందుకంటే అతను తీసుకునే నిర్ణయం అతను ఇంతకాలం చేసిన పని పారదర్శతపై ప్రభావం చూపుతుంది. ఉదాహరణకు ఒక జడ్జి రిటైర్మెంట్ తరువాత రాజకీయాల్లోకి వెళితే.. అతను రిటైర్మెంట్‌కు ముందు చెప్పిన తీర్పులు న్యాయ సమ్మతమేనా? అనే అనుమానం కలుగుతుంది. అందుకే ఒక మాజీ న్యాయమూర్తి జీవన విధానం కూడా న్యాయ వ్యవస్థను ప్రభావితం చేస్తుంది.

Advertisement

న్యాయమూర్తులు కూడా ఒక సాధారణ పౌరునితో సమానమైనప్పటికీ వారి నుంచి సమాజం ఒక ఆదర్శ జీవిన విధానం కోరుకుంటుంది. అందుకే న్యాయవ్యవస్థలో న్యాయమూర్తుల రిటైర్మెంట్ తరువాత వారి జీవితంలో ఏది ఆమోదయోగ్యం, ఏది ఆమోదయోగ్యం కాదు అనే విషయంపై ఏకాభిప్రాయం కుదరాలి. పదవిలో ఉన్న న్యాయమూర్తులు, రిటైర్ అయిన జడ్జీలతో చర్చించి రిటైర్మెంట్ అయిన తరువాత జీవితంలో ఏది సమంజసం, ఏది కాదు అనేది నిర్ణయించాలి. ఇలాంటి ఏకాభిప్రాయం ఇప్పటికైతే కుదరలేదు.” అని జస్టిస్ చంద్రచూడ్ అన్నారు

Related News

ప్రధాని మోడీ ఇంటి ముట్టడికి కేజ్రీవాల్ బిగ్ స్కెచ్.. E20 పెట్రోల్‌పై కేజ్రీవాల్ సమరం

బీహార్‌లో బీజేపీకి బిగ్ షాక్.. భారీ మెజారిటీతో ప్రశాంత్ కిషోర్ గెలుపు

పెళ్లే కానక్కర్లేదు.. సహజీవనానికి ఆ చట్టం వర్తిస్తుంది.. సుప్రీంకోర్టు సంచలనం

సుప్రీం కోర్టులో జడ్జీల సంఖ్య పెంపు.. లోక్‌సభలో బిల్లు ఆమోదం!

ఇంజనీరింగ్ అభ్యర్థులకు గుడ్ న్యూస్..ఎయిర్‌పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియాలో ఉద్యోగాలు

డిగ్రీ అర్హతతో 11,403 క్లర్క్ పోస్టులు.. పూర్తి వివరాలివే !

కేరళలో విరిగిపడ్డ కొండచరియలు.. ‘బిగ్ టీవీ’ ప్రతినిధులకు తప్పిన పెను ప్రమాదం

నిరసనలకు జంతర్ మంతర్ గుడ్ బై? కొత్త వేదిక ఎక్కడ, సుప్రీంకోర్టులో పిటిషన్

Big Stories

Advertisement
×