E-Paper
Advertisement

 Jharkhand Horror: చిచ్చు అక్కడే మొదలైంది.. హైకోర్టు లాయర్ ఫ్యామిలీ ఆత్మహత్యాయత్నం!

 Jharkhand Horror: చిచ్చు అక్కడే మొదలైంది.. హైకోర్టు లాయర్ ఫ్యామిలీ ఆత్మహత్యాయత్నం!
Advertisement

Jharkhand Horror: పాపం.. రాంచీలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. ఉన్నత విద్యావంతుల కుటుంబంలో కూడా ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటారా? అని అందరు షాక్ అవుతున్నారు.. అయితే జార్ఖండ్ రాజధాని రాంచీలోని విలాసవంతమైన ప్రాంతంగా పేరున్న అశోక్ నగర్ ఒక్కసారిగా తీవ్ర దిగ్భ్రాంతికి గురైంది. జార్ఖండ్ హైకోర్టులో న్యాయవాదిగా పనిచేస్తున్న స్నేహ అఖౌరి, ఆమె ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్యకు ప్రయత్నించిన ఘటన స్థానికంగా కలకలం రేపింది. ఈ విషాదంలో ఆమె కుమారుడు ప్రాణాలు కోల్పోగా, స్నేహ అఖౌరి, ఆమె కుమార్తె ప్రస్తుతం మృత్యువుతో పోరాడుతున్నారు. చుట్టుపక్కల వారు గమనించి పోలీసులకు సమాచారం అందించడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది.

పోలీసుల ప్రాథమిక విచారణ ప్రకారం, స్నేహ అఖౌరి కుమారుడు మిహిర్ ఇటీవలే చార్టర్డ్ అకౌంటెంట్ (CA)గా అర్హత సాధించి, కోల్‌కతాలో ఒక ప్రతిష్టాత్మక సంస్థలో ఉద్యోగంలో చేరాడు. సెలవుల నిమిత్తం తన ఇంటికి వచ్చిన మిహిర్, సోమవారం నాడు తన గదిలో ఉరివేసుకుని ప్రాణాలు విడిచాడు. తీవ్ర దుఃఖంలో ఉన్న ఆమె అదే సమయంలో స్నేహ అఖౌరి, ఆమె కుమార్తె విషం తాగి అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయారు. ఒకే ఇంట్లో ముగ్గురు ఇలాంటి ఘాతుకానికి పాల్పడటం తీవ్ర కలకలం సృష్టించింది.

Advertisement

సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు పరిస్థితిని సమీక్షించి, బాధితులను వెంటనే స్థానిక ఆసుపత్రికి తరలించారు. అప్పటికే మిహిర్ మరణించినట్లు వైద్యులు ధృవీకరించారు. కాగా, న్యాయవాది స్నేహ, ఆమె కుమార్తె పరిస్థితి ప్రస్తుతం అత్యంత విషమంగా ఉన్నట్లు సమాచారం. నిపుణులైన వైద్య బృందం పర్యవేక్షణలో వారికి చికిత్స అందుతోంది. ఉన్నత స్థాయి వృత్తుల్లో స్థిరపడిన ఈ కుటుంబం ఇలాంటి తీవ్ర నిర్ణయం తీసుకోవడానికి గల కారణాల కోసం పోలీసులు గాలిస్తున్నారు.

ఈ ఘటనకు సంబంధించి ఇప్పటివరకు ఎటువంటి ఆత్మహత్య లేఖ (Suicide Note) లభించలేదని సమాచారం. ఆర్థికపరమైన ఇబ్బందులా లేక వ్యక్తిగత కుటుంబ సమస్యలా అనే కోణంలో పోలీసులు దర్యాప్తును ముమ్మరం చేశారు. ఒక వైపు వృత్తిరీత్యా ఎంతో మందికి న్యాయం అందించే స్థాయిలో ఉన్న వ్యక్తి, మరోవైపు కెరీర్ ప్రారంభంలోనే ఉన్న కుమారుడు ఉన్న ఇంటిలో ఇలా జరగడం అందరినీ కలిచివేస్తోంది. స్థానికుల నుంచి, బంధువుల నుంచి పోలీసులు వివరాలు సేకరిస్తున్నారు.

Advertisement

Also Read: పాకిస్తాన్‌కు చుక్కలు చూపించిన ఇద్దరు మహిళలు.. చివరికి!

మొత్తానికి, ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు వ్యక్తులు మరణం అంచు వరకు వెళ్లడం రాంచీలో చర్చనీయాంశంగా మారింది. మిహిర్ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం రిమ్స్ (RIMS) ఆసుపత్రికి తరలించారు. పోలీసులు ఈ కేసును నమోదు చేసుకుని, అన్ని కోణాల్లో విచారణ జరుపుతున్నారు. త్వరలోనే ఈ ఆత్మహత్యాయత్నానికి గల అసలు కారణాలు బయటకు వచ్చే అవకాశం ఉంది.

Related News

ప్రధాని మోడీ ఇంటి ముట్టడికి కేజ్రీవాల్ బిగ్ స్కెచ్.. E20 పెట్రోల్‌పై కేజ్రీవాల్ సమరం

బీహార్‌లో బీజేపీకి బిగ్ షాక్.. భారీ మెజారిటీతో ప్రశాంత్ కిషోర్ గెలుపు

పెళ్లే కానక్కర్లేదు.. సహజీవనానికి ఆ చట్టం వర్తిస్తుంది.. సుప్రీంకోర్టు సంచలనం

సుప్రీం కోర్టులో జడ్జీల సంఖ్య పెంపు.. లోక్‌సభలో బిల్లు ఆమోదం!

ఇంజనీరింగ్ అభ్యర్థులకు గుడ్ న్యూస్..ఎయిర్‌పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియాలో ఉద్యోగాలు

డిగ్రీ అర్హతతో 11,403 క్లర్క్ పోస్టులు.. పూర్తి వివరాలివే !

కేరళలో విరిగిపడ్డ కొండచరియలు.. ‘బిగ్ టీవీ’ ప్రతినిధులకు తప్పిన పెను ప్రమాదం

నిరసనలకు జంతర్ మంతర్ గుడ్ బై? కొత్త వేదిక ఎక్కడ, సుప్రీంకోర్టులో పిటిషన్

Big Stories

Advertisement
×