E-Paper
Advertisement

తమిళనాడు అసెంబ్లీలో ఆసక్తికర దృశ్యం.. సీఎం విజయ్-ప్రతిపక్ష నేత ఉదయనిధి స్టాలిన్, కేబినెట్ మంత్రి జేబులో

తమిళనాడు అసెంబ్లీలో ఆసక్తికర దృశ్యం.. సీఎం విజయ్-ప్రతిపక్ష నేత ఉదయనిధి స్టాలిన్, కేబినెట్ మంత్రి జేబులో
Advertisement

Tamilnadu Assembly: తమిళనాడులో టీవీకే ప్రభుత్వం కొలువు దీరింది. బల నిరూపణకు సమయం దగ్గర పడుతుండడంతో అసెంబ్లీ ఏర్పాటు చేసింది. తొలుత ఎమ్మెల్యేల ప్రమాణ స్వీకారం జరిగింది. తొలుత సీఎం విజయ్ ప్రమాణ స్వీకారం చేశారు. చెపాక్-తిరువల్లికేని స్థానం నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందిన ఉదయనిధి స్టాలిన్ ప్రమాణ స్వీకారం చేశారు.

తమిళనాడు అసెంబ్లీలో అసక్తికర దృశ్యం

Advertisement

స్టాలిన్ పేరు చెప్పగానే డీఎంకే సభ్యులు పెద్దగా చప్పట్లు కొట్టడంతో లైటుగా స్మైల్ ఇచ్చారు సీఎం విజయ్. మాజీ సీఎం స్టాలిన్ తన నియోజకవర్గం నుంచి ఓటమి పాలవ్వడంతో ఆయన వారసుడి ఉదయనిధి స్టాలిన్ ప్రతిపక్ష నేతగా వ్యవహరించనున్నారు. అన్నట్లు సీఎం విజయ్-ప్రతిపక్ష నేత ఉదయనిధి స్టాలిన్ మంచి ఫ్రెండ్స్ కూడా.

సీఎం విజయ్-ప్రతిపక్ష నేత ఉదయనిధి మధ్య విభేదాలు స్పష్టంగా కనిపించాయి. విజయ్ ప్రమాణ స్వీకారం చేస్తున్నంత సేపు ఉదయనిధి ఆయన ముఖం చూడటానికి ఇష్టపడలేదు. ఉదయనిధి ప్రమాణం చేస్తుండగా విజయ్ అతడి వైపు వైపు చూస్తూ చిరునవ్వుతో కనిపించారు.

Advertisement

సీఎం విజయ్-ప్రతిపక్ష నేత ఉదయనిధి స్టాలిన్

ఉదయనిధి స్టాలిన్ ముందు సవాల్ లేకపోలేదు. శతాబ్ద చరిత్ర కలిగిన డీఎంకె పార్టీలో గెలుపోటములు కొత్త కాదు. ఈ విషయంలో మాజీ సీఎం స్టాలిన్ పాలన విఫలం కాలేదని నిరూపించాలి. గతంలో ఉదయనిధి స్టాలిన్ మంత్రిగా పని చేసిన అనుభవం ఉంది.  పాలనా అనుభవం లేని సీఎం విజయ్ ముందు తానేంటో నిరూపించుకోవాల్సిన సమయం ఆసన్నమైంది.

మర్యాద పూర్వకంగా సీఎం విజయ్‌ని పలకరిస్తారని సభ్యులు భావించారు. అటు వైపు కనీసం కన్నెత్తి కూడా చూడలేదు ఉదయనిధి స్టాలిన్. ఈ సన్నివేశం తమిళనాడులో ఇప్పుడు హాట్ హాట్ చర్చ సాగుతోంది. ఇదిలా ఉండగా తమిళనాడు విజయ్ కేబినెట్‌లో సీనియర్ మంత్రి సెంగోట్టయన్ గురించి ఆసక్తికర చర్చకు దారితీసింది.

ALSO READ: వైద్య విద్యార్థుల భవిష్యత్తుతో చెలగాటం? నీట్-2026 పేపర్ లీక్ ఆరోపణలు.. NTA క్లారిటీ ఇదే!

అసెంబ్లీలో ఎమ్మెల్యేగా ఆయన ప్రమాణ స్వీకారం సయమంలో ఆయన షర్ట్ జేబులో మాజీ సీఎం జయలలిత ఫొటో ఉండటమే అందుకు కారణం. ఆదివారం మంత్రిగా ప్రమాణ స్వీకారం సందర్భంగా, సోమవారం అసెంబ్లీలో ప్రమాణం సమయంలో జేబులో జయలలిత ఫొటో కనిపించింది. 2012 ఏడాది జయలలిత ప్రభుత్వంలో సెంగోట్టయన్ రెవెన్యూ మంత్రిగా పని చేశారు.

అంతేకాదు ఎంజీఆర్ కాలం నుంచి అన్నాడీఎంకె పార్టీలో ఉండేవారు. అయితే ఆమె మరణం తర్వాత పళనిస్వామిపై విమర్శలు గుప్పించడంపై ఆయనపై పార్టీ వేటు వేసిన విషయం తెల్సిందే. ఇక జయలలిత ఫోటో విషయానికి వద్దాం. ఆమె ఫొటోను జేబులో పెట్టుకోవడానికి సీఎం విజయ్ అంగీకరించినట్లు సమాచారం.

ఇదిలావుండగా టీవీకే పార్టీకి చెందిన మంత్రి కీర్తన, తన గెలుపు ధృవీకరణ పత్రాన్ని వెంట తీసుకురాలేదు. ఫలితంగా ఎమ్మెల్యేగా ఆమె ప్రమాణ స్వీకారం చేయలేకపోయారు. నిబంధనల ప్రకారం ఎన్నికల అధికారి ఇచ్చిన సర్టిఫికేట్ తప్పనిసరి కావడంతో ఆమె ప్రమాణ స్వీకారం నిలిచిపోయింది. ఆ పత్రాన్ని సమర్పించిన వెంటనే ఎమ్మెల్యేగా ప్రమాణం చేస్తారని అసెంబ్లీ అధికారులు తెలిపారు.

 

 

Related News

ప్రధాని మోడీ ఇంటి ముట్టడికి కేజ్రీవాల్ బిగ్ స్కెచ్.. E20 పెట్రోల్‌పై కేజ్రీవాల్ సమరం

బీహార్‌లో బీజేపీకి బిగ్ షాక్.. భారీ మెజారిటీతో ప్రశాంత్ కిషోర్ గెలుపు

పెళ్లే కానక్కర్లేదు.. సహజీవనానికి ఆ చట్టం వర్తిస్తుంది.. సుప్రీంకోర్టు సంచలనం

సుప్రీం కోర్టులో జడ్జీల సంఖ్య పెంపు.. లోక్‌సభలో బిల్లు ఆమోదం!

ఇంజనీరింగ్ అభ్యర్థులకు గుడ్ న్యూస్..ఎయిర్‌పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియాలో ఉద్యోగాలు

డిగ్రీ అర్హతతో 11,403 క్లర్క్ పోస్టులు.. పూర్తి వివరాలివే !

కేరళలో విరిగిపడ్డ కొండచరియలు.. ‘బిగ్ టీవీ’ ప్రతినిధులకు తప్పిన పెను ప్రమాదం

నిరసనలకు జంతర్ మంతర్ గుడ్ బై? కొత్త వేదిక ఎక్కడ, సుప్రీంకోర్టులో పిటిషన్

Big Stories

Advertisement
×