E-Paper
Advertisement

IndiGo : విమానం ఆలస్యం.. పైలట్‌పై ప్రయాణికుడి దాడి..

IndiGo : విమానంలో ఓ ప్రయాణికుడు దురుసుగా ప్రవర్తించాడు. ఫ్లైట్‌ ఆలస్యంగా బయల్దేరుతుందని ప్రకటించిన పైలట్‌పై దాడికి పాల్పడ్డాడు. ఇండిగో విమానంలో జరిగిన ఈ ఘటన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి.

IndiGo : విమానం ఆలస్యం.. పైలట్‌పై ప్రయాణికుడి దాడి..
Advertisement

IndiGo : విమానంలో ఓ ప్రయాణికుడు దురుసుగా ప్రవర్తించాడు. ఫ్లైట్‌ ఆలస్యంగా బయల్దేరుతుందని ప్రకటించిన పైలట్‌పై దాడికి పాల్పడ్డాడు. ఇండిగో విమానంలో జరిగిన ఈ ఘటన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి.

డిల్లీ నుంచి గోవా వెళ్లాల్సిన ఇండిగో విమానానికి పొగమంచు కారణంగా అంతరాయం ఏర్పడింది. దీంతో ప్రయాణం ఆలస్యం అవుతుందని పైలట్ ప్రకటించాడు. ఇది విన్న వెంటనే ఓ ప్రయాణికుడు తీవ్ర ఆగ్రహంతో ఊగిపోయాడు. చివర వరుసలో కూర్చున్న అతడు పైలట్‌ వద్దకు దూసుకువచ్చి దాడికి పాల్పడ్డాడు. ఈ ఘటనపై ఇండిగో ఫిర్యాదు చేసింది. అతడిని విమానం నుంచి దించేశారు. భద్రతా సిబ్బందికి అప్పగించింది. ఈ విమానం 13 గంటల ఆలస్యమైంది. విమానం ఆలస్యానికి అందులోని సిబ్బంది ఏం చేస్తారు..? అంటూ నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే ఆ ప్రయాణికుడిని అరెస్టు చేసి, నో ఫ్లై లిస్ట్‌లో చేర్చండి అంటూ డిమాండ్ చేశారు.

Advertisement

ఉత్తర భారతాన్ని పొగమంచు కమ్మేసింది. అతి సమీపంలోని వాహనాలు కూడా కనిపించని పరిస్థితి నెలకొంది. దాంతో భారీ సంఖ్యలో విమానాలు ఆలస్యమవుతున్నాయి. సోమవారం సైతం పొగమంచు కారణంగా వందకు పైగా విమానాలు ఆలస్యం అయ్యాయి. 79 రద్దయ్యాయి. కాగా ఒక్కో విమానం కనీసం 50 నిమిషాల మేర ఆలస్యంగా నడుస్తోంది. ఈ పరిస్థితులతో ప్రయాణికులు అసహనానికి గురవుతున్నారు.

Tags

Related News

ప్రధాని మోడీ ఇంటి ముట్టడికి కేజ్రీవాల్ బిగ్ స్కెచ్.. E20 పెట్రోల్‌పై కేజ్రీవాల్ సమరం

బీహార్‌లో బీజేపీకి బిగ్ షాక్.. భారీ మెజారిటీతో ప్రశాంత్ కిషోర్ గెలుపు

పెళ్లే కానక్కర్లేదు.. సహజీవనానికి ఆ చట్టం వర్తిస్తుంది.. సుప్రీంకోర్టు సంచలనం

సుప్రీం కోర్టులో జడ్జీల సంఖ్య పెంపు.. లోక్‌సభలో బిల్లు ఆమోదం!

ఇంజనీరింగ్ అభ్యర్థులకు గుడ్ న్యూస్..ఎయిర్‌పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియాలో ఉద్యోగాలు

డిగ్రీ అర్హతతో 11,403 క్లర్క్ పోస్టులు.. పూర్తి వివరాలివే !

కేరళలో విరిగిపడ్డ కొండచరియలు.. ‘బిగ్ టీవీ’ ప్రతినిధులకు తప్పిన పెను ప్రమాదం

నిరసనలకు జంతర్ మంతర్ గుడ్ బై? కొత్త వేదిక ఎక్కడ, సుప్రీంకోర్టులో పిటిషన్

Big Stories

Advertisement
×