E-Paper
Advertisement

Delhi : ఛత్రపతి శివాజీ స్ఫూర్తి.. భారత నేవీకి కొత్త బ్యాడ్జీలు..

Delhi: భారత నౌకాదళం తాజాగా అడ్మిరల్‌ స్థాయి అధికారుల కోసం కొత్తగా రూపొందించిన బ్యాడ్జీలను విడుదల చేసింది. అడ్మిరల్‌, వైస్‌ అడ్మిరల్‌, రేయర్‌ అడ్మిరల్‌లకు సంబంధించి మొత్తం అయిదు బ్యాడ్జీలను నౌకాదళం ఆవిష్కరించింది. మరాఠా సామ్రాజ్యాధినేత ఛత్రపతి శివాజీ మహారాజ్ వారసత్వాన్ని ప్రతిబింబిచేలా ఇటీవల నౌకాదళ దినోత్సవం సందర్భంగా ప్రధాని మోదీ ప్రకటించారు. . భుజానికి ధరించే విధంగా ఈ బ్యాడ్జీ ఆకృతిని నిర్మించారు. ఈ బ్యాడ్జీ అధికారి స్థాయిని చూపిస్తుంది.

Delhi : ఛత్రపతి శివాజీ స్ఫూర్తి.. భారత నేవీకి కొత్త బ్యాడ్జీలు..
Advertisement

Delhi : భారత నౌకాదళం తాజాగా అడ్మిరల్‌ స్థాయి అధికారుల కోసం కొత్తగా రూపొందించిన బ్యాడ్జీలను విడుదల చేసింది. అడ్మిరల్‌, వైస్‌ అడ్మిరల్‌, రేయర్‌ అడ్మిరల్‌లకు సంబంధించి మొత్తం అయిదు బ్యాడ్జీలను నౌకాదళం ఆవిష్కరించింది. మరాఠా సామ్రాజ్యాధినేత ఛత్రపతి శివాజీ మహారాజ్ వారసత్వాన్ని ఈ బ్యాడ్జీలు ప్రతిబింబిస్తాయని ఇటీవల నౌకాదళ దినోత్సవం సందర్భంగా ప్రధాని మోదీ ప్రకటించారు. . భుజానికి ధరించే విధంగా ఈ బ్యాడ్జీ ఆకృతిని నిర్మించారు. ఈ బ్యాడ్జీ అధికారి స్థాయిని చూపిస్తుంది.

బ్యాడ్జీపై ఎరుపు రంగులో అష్టభుజి ఆకారంలోని చిహ్నం ఉంటుంది. ఎనిమిది దిక్కుల్లో నౌకాదళ దార్శనికతను సూచిస్తుంది. ఛత్రపతి శివాజీ మహారాజ్ రాజముద్ర నుంచి స్ఫూర్తి పొంది, నౌకాదళ చిహ్నం నుంచి దీన్ని రూపొందించారు. అష్ట భుజాకారం మీద ‘నౌకాదళ చిహ్నం’తో కూడిన బంగారు బటన్‌ను ఏర్పాటు చేశారు. బానిసత్వ మనస్తత్వాన్ని వదిలించుకోవాలనే సంకల్పాన్ని ఇది సూచిస్తుంది. బ్యాడ్జ్ నిర్మాణంలో కింద ఖడ్గం, టెలిస్కోప్‌లు ఉన్నాయి. భారతదేశ శక్తిసామర్థ్యాలను, యుద్ధాల్లో ఆధిపత్యాన్ని ఈ ‘ఖడ్గం’ సూచిస్తుంది. దూరదృష్టిని ‘టెలిస్కోప్‌’ ప్రతిబింబిస్తుంది. సేవలు అందిస్తున్న అధికారులు ర్యాంకుల బట్టి నక్షత్రాల సంఖ్య, బ్యాడ్జీ అంచు రంగు ఉంటుంది.

Advertisement

భారత నౌకాదళానికి సరికొత్త చిహ్నాన్ని (నిశాన్‌) ప్రధాని మోదీ గతేడాది సెప్టెంబరులో ఆవిష్కరించారు. దీనికి ముందు ఉన్న గుర్తు దేశ వలసవాద గతాన్ని గుర్తు చేసేలా ఉందని కేంద్రం భావించింది. దీనికి అనుగుణంగానే మన చరిత్ర నుంచి స్ఫూర్తి పొందేలా కొత్త చిహ్నాన్ని రూపొందించింది. సముద్ర జలాలు, తీరాలపై ఆధిపత్యం చెలాయించిన భారత రాజుల్లో శివాజీ ముఖ్యమైన వ్యక్తి. ఆయన అత్యంత విశ్వసనీయమైన పటిష్టమైన నౌకాదళాన్ని నిర్మించారు. శివాజీ నిర్మించిన ఈ నౌకదళం లో దాదాపుగా 60 యుద్ధ నౌకలు సేవలు అందించేవి. సుమారుగా 5 వేల మంది సైన్యం ఉండేవారని గతంలో ఓ వీడియోని నేవి అధికారులు విడుదల చేశారు. ఛత్రపతి శివాజీ పరిపాలిస్తున్నప్పుడు తీర ప్రాంతంలో ఈ దళం కీలక సేవలు అందించింది.

Related News

ప్రధాని మోడీ ఇంటి ముట్టడికి కేజ్రీవాల్ బిగ్ స్కెచ్.. E20 పెట్రోల్‌పై కేజ్రీవాల్ సమరం

బీహార్‌లో బీజేపీకి బిగ్ షాక్.. భారీ మెజారిటీతో ప్రశాంత్ కిషోర్ గెలుపు

పెళ్లే కానక్కర్లేదు.. సహజీవనానికి ఆ చట్టం వర్తిస్తుంది.. సుప్రీంకోర్టు సంచలనం

సుప్రీం కోర్టులో జడ్జీల సంఖ్య పెంపు.. లోక్‌సభలో బిల్లు ఆమోదం!

ఇంజనీరింగ్ అభ్యర్థులకు గుడ్ న్యూస్..ఎయిర్‌పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియాలో ఉద్యోగాలు

డిగ్రీ అర్హతతో 11,403 క్లర్క్ పోస్టులు.. పూర్తి వివరాలివే !

కేరళలో విరిగిపడ్డ కొండచరియలు.. ‘బిగ్ టీవీ’ ప్రతినిధులకు తప్పిన పెను ప్రమాదం

నిరసనలకు జంతర్ మంతర్ గుడ్ బై? కొత్త వేదిక ఎక్కడ, సుప్రీంకోర్టులో పిటిషన్

Big Stories

Advertisement
×