E-Paper
Advertisement

భ‌ర్త‌ను చంపి రీల్స్ చూస్తూ భార్య ఎంజాయ్.. కొడుకుపై కత్తితో దాడి, కర్ణాటకలో దారుణం

భ‌ర్త‌ను చంపి రీల్స్ చూస్తూ భార్య ఎంజాయ్.. కొడుకుపై కత్తితో దాడి, కర్ణాటకలో దారుణం
Advertisement

Karnataka: కర్ణాటకలో దారుణమైన ఘటన వెలుగులోకి వచ్చింది. విలాసవంతమైన అపార్ట్‌మెంట్‌లో డాక్టర్ కిరణ్ హొన్నన్నవర్ హత్యకు గురయ్యాడు. కుమారుడు కత్తిపోట్లతో గాయపడ్డాడు. ఘటన తర్వాత డాక్టర్ భార్య రీల్స్ చూస్తూ ఎంజాయ్ చేయడం కనిపించింది. సంచనం రేపిన ఈ కేసుకు సంబంధించి డాక్టర్ ప్రియాంకను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. అసలేం జరిగింది?

కర్ణాటకలో దారుణమైన ఘటన-కర్ణాటకకు చెందిన డాక్టర్  కిరణ్ ఫ్యామిలీ దంపతులు ధార్వాడ్‌లో నివాసం ఉంటున్నారు. డాక్టర్ కిరణ్ హొన్నన్నవర్ స్థానికంగా ఉండే  చిరాయు ఆస్పత్రిలో అనస్థీషియాగా పని చేస్తున్నాడు. అతడి భార్య ప్రియాంక ఎంబీబీఎస్ పూర్తి చేసింది. ఆఫ్తాల్మాలజీలో ఎంఎస్ చేసింది. ఎనిమిదేళ్ల కొడుకుతో కలిసి ధార్వాడలోని లగ్జరీ అపార్ట్‌మెంట్‌లో నివాసం ఉంటున్నారు.

Advertisement

భర్తను చంపిన భార్య డాక్టర్ ప్రియాంక?మరి భార్యభార్తల మధ్య ఎలాంటి సమస్యలు, గొడవలు ఉన్నాయో తెలీదు. ఎందుకంటే భార్యభర్తలు ఇద్దరు వైద్యులు కావడంతో హాయిగా సాగుతున్న సంసారంలో ఏం జరిగిందో తెలీదు. డాక్టర్ కిరణ్ హొన్నన్నవర్‌ను ఆయన భార్య ప్రియాంక హత్య చేసినట్లు తెలుస్తోంది. భర్త మృతదేహం నేలపై ఉండగా ఆమె ఫోన్‌లో రీల్స్ చూస్తూ ఎంజాయ్ చేసినట్టు కనిపిస్తోంది.  8 ఏళ్ల కొడుకుపై కత్తితో దాడి చేసింది.

గాయాలతో కొడుకు-ప్రస్తుతం చికిత్స పొందుతున్నాడు ఆ దంపతుల కొడుకు. పోలీస్ కమిషనర్ శశికుమార్ కొన్ని వివరాలు తెలిపారు. ఘటన జరిగిన సమయంలో ఇంట్లో భర్త-భార్య-కొడుకు ఉన్నట్లు తెలిపారు. బయట వ్యక్తులు ఇంట్లోకి వచ్చిన ఆనవాళ్లు లభించలేదన్నారు. ఈ కేసు గురించి బుధవారం సాయంత్రం ఆ దంపతులు తమ ఫ్లాట్‌లోకి ప్రవేశించినప్పుడు డాక్టర్ ప్రియాంక కలత ఉన్నట్లు కనిపించారు.

Advertisement

పోలీసుల అదుపులో డాక్టర్ ప్రియాంక-తలుపు తెరిచిన తర్వాత ఆమె అటూ ఇటూ తిరుగుతూ కనిపించింది. ఆ తర్వాత కొడుకు గాయాలతో  పక్కన పడుకుని ఉన్నాడు. తన చుట్టూ జరుగుతున్న వాటిని పట్టించుకోకుండా ఒక మంచం మీద కూర్చుని తన మొబైల్ ఫోన్‌ చూస్తూ కనిపించింది. ఆమె భర్త మృతదేహం పక్క గదిలో లభ్యమైంది.

ALSO READ: కర్ణాటకలో ఘోరం.. పట్టపగలే యువతిని కొడవలితో నరికి చంపిన యువకుడు.. ఇదిగో వీడియో!

మంగళవారం ఉదయం నుంచి రాత్రి డాక్టర్ కిరణ్‌ పేరెంట్స్, ఫ్రెండ్స్ పలుమార్లు ఫోన్ చేశారు. ఫోన్ ఎత్తిన ప్రియాంక, విశ్రాంతి తీసుకొంటున్నారని ఒకసారి, డ్యూటీకి వెళ్లారని మరోసారి ఇలా చెబుతూ వచ్చింది. చివరకు రాత్రి వరకు ఇదే సమాధానం చెబుతూ రావడంతో అనుమానం వచ్చింది. చివరకు డాక్టర్ కిరణ్ కుటుంబసభ్యులు అపార్ట్‌మెంట్‌కు వెళ్లారు.

కిరణ్ మృతదేహం కనిపించగా,  కొడుకు  గాయపడిన కనిపించారు. ఆ సమయంలో ప్రియాంక గదిలో మొబైల్ చూస్తూ ఉండటంతో అనుమానం వచ్చి పోలీసులకు ఫిర్యాదు చేశారు. కొడుకుని తీసుకుని ఆసుపత్రిలో జాయిన్ చేశారు. పోస్టుమార్టం నివేదికలో అసలు విషయాలు తెలుస్తాయని అంటున్నారు పోలీసులు. ప్రస్తుతం డాక్టర్ ప్రియాంకను అదుపులోని తీసుకుని విచారణ చేస్తున్నారు.

 

Related News

ప్రధాని మోడీ ఇంటి ముట్టడికి కేజ్రీవాల్ బిగ్ స్కెచ్.. E20 పెట్రోల్‌పై కేజ్రీవాల్ సమరం

బీహార్‌లో బీజేపీకి బిగ్ షాక్.. భారీ మెజారిటీతో ప్రశాంత్ కిషోర్ గెలుపు

పెళ్లే కానక్కర్లేదు.. సహజీవనానికి ఆ చట్టం వర్తిస్తుంది.. సుప్రీంకోర్టు సంచలనం

సుప్రీం కోర్టులో జడ్జీల సంఖ్య పెంపు.. లోక్‌సభలో బిల్లు ఆమోదం!

ఇంజనీరింగ్ అభ్యర్థులకు గుడ్ న్యూస్..ఎయిర్‌పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియాలో ఉద్యోగాలు

డిగ్రీ అర్హతతో 11,403 క్లర్క్ పోస్టులు.. పూర్తి వివరాలివే !

కేరళలో విరిగిపడ్డ కొండచరియలు.. ‘బిగ్ టీవీ’ ప్రతినిధులకు తప్పిన పెను ప్రమాదం

నిరసనలకు జంతర్ మంతర్ గుడ్ బై? కొత్త వేదిక ఎక్కడ, సుప్రీంకోర్టులో పిటిషన్

Big Stories

Advertisement
×