// // PNG Connection Apply: పీఎన్జీ కనెక్షన్ దరఖాస్తు ఇలా?.. కావాల్సిన పత్రాలు ఏంటంటే? - Staging.BigTvLive -->
E-Paper
Advertisement

పీఎన్జీ కనెక్షన్ దరఖాస్తు విధానం ఇదే.. కావాల్సిన పత్రాలు ఏంటంటే?

పీఎన్జీ కనెక్షన్ దరఖాస్తు విధానం ఇదే.. కావాల్సిన పత్రాలు ఏంటంటే?
Advertisement

PNG Connection Apply: అంతర్జాతీయ పరిస్థితులతో ఎల్పీజీ సమస్యలు తలెత్తాయి. దీంతో ప్రభుత్వం పైపుల ద్వారా సరఫరా చేసే పీఎన్జీ నెట్‌వర్క్‌ను వేగంగా విస్తరిస్తోంది. ఇప్పటికే పీఎన్జీ పైపు లైన్స్ అందుబాటులో ఉన్న ప్రాంతాలలో దాని వినియోగంపై దృష్టి పెట్టింది. అయితే కొత్తగా ఎన్పీజీ కనెక్షన్ కోసం ఎలా అప్లై చేసుకోవాలి, కావాల్సిన డాక్యుమెంట్స్ గురించి తెలుసుకుందాం.

PNG కనెక్షన్ కోసం ఎలా దరఖాస్తు చేసుకోవాలి?

Step 1: మొదటిగా మీ ప్రాంతంలో PNG సర్వీస్ అందుబాటులో ఉందో లేదో తెలుసుకోండి. పీఎన్జీ పంపిణీదారుడి వెబ్‌సైట్‌లో మీ ప్రాంతం పిన్‌కోడ్ ఎంటర్ చేస్తే లభ్యత వివరాలు తెలుస్తాయి. ఇప్పటికే పైప్‌లైన్‌లు వేస్తే ఆన్ లైన్ లేదా ఆఫ్ లైన్ లో అప్లై చేసుకోవచ్చు.
Step 2: గుర్తింపు పత్రాలు, అడ్రస్ ఫ్రూఫ్, ఓనర్ షిప్ ఐడెంటిఫికేషన్ సర్టిఫికెట్ లేదా రెంట్ అగ్రిమెంట్ వంటి సంబంధిత పత్రాలు సమర్పించాలి.
Step 3: సెక్యూరిటీ డిపాజిట్ చెల్లించాలి. ఉదాహరణకు IGL వంటి కంపెనీలో సెక్యూరిటీ డిపాజిట్ రూ. 5,000–రూ. 10,000 మధ్య ఉంటుంది. కనెక్షన్ నిలిపివేసిన తర్వాత దీనిని తిరిగి చెల్లిస్తారు.
Step 4: ఈ అప్లికేషన్ ను సదరు సంస్థ అప్రూవ్ చేసిన తర్వాత సైట్ చెకింగ్ చేస్తారు. సెక్యూరిటీ చెకింగ్ తర్వాత పైప్‌లైన్, మీటర్ ను ఏర్పాటు చేస్తారు.
Step 5: ఇప్పటికే పైప్‌లైన్‌లు ఉంటే కనెక్షన్ కు 7–15 రోజులు పట్టవచ్చు. కొత్త ప్రాంతాలకు మరింత సమయం పడుతుంది.

PNG కనెక్షన్ కు కావాల్సిన డాక్యుమెంట్స్

  • గుర్తింపు పత్రాలు: ఆధార్, పాన్, ఓటర్ ఐడీ, పాస్‌పోర్ట్ లేదా డ్రైవింగ్ లైసెన్స్
  • అడ్రస్ ఫ్రూఫ్ : యుటిలిటీ బిల్లు (విద్యుత్ లేదా BSNL), రెంటల్ అగ్రిమెంట్ , రేషన్ కార్డు లేదా ఆస్తి పన్ను బిల్లు
  • యాజమాన్య పత్రాలు: సేల్ డీడ్, రిజిస్టర్డ్ డాక్యుమెంట్స్, సొసైటీ సర్టిఫికేట్, లేదా పన్ను రసీదు.
  • అద్దెకు ఉన్న వారికి : యజమాని నుంచి NOC
  • దరఖాస్తుదారుడి పాస్‌పోర్ట్ సైజు ఫోటోలు
Advertisement

Also Read: LPG గ్యాస్ ఆదా సీక్రెట్: ప్రెజర్ కుక్కర్ Vs ఓపెన్ కుకింగ్.. ఏది వాడితే మంచిది?

PNG కనెక్షన్‌లో నిరంతరం గ్యాస్ సరఫరా చేస్తారు. నెలలవారీగా బిల్లు చెల్లించాల్సి ఉంటుంది. LPG లో లాగా వినియోగదారులు సిలిండర్ రీఫిల్‌ చేసుకోవాల్సిన అవసరం లేదు. అయితే పీఎన్జీ ప్రస్తుతం పెద్ద నగరాల్లో మాత్రమే అందుబాటులో ఉంది. పట్టణాలు, చిన్న నగరాల్లో పీఎన్జీ మౌలిక సదుపాయాలు అభివృద్ధి చేయాల్సి ఉంది.

Tags

Related News

ప్రధాని మోడీ ఇంటి ముట్టడికి కేజ్రీవాల్ బిగ్ స్కెచ్.. E20 పెట్రోల్‌పై కేజ్రీవాల్ సమరం

బీహార్‌లో బీజేపీకి బిగ్ షాక్.. భారీ మెజారిటీతో ప్రశాంత్ కిషోర్ గెలుపు

పెళ్లే కానక్కర్లేదు.. సహజీవనానికి ఆ చట్టం వర్తిస్తుంది.. సుప్రీంకోర్టు సంచలనం

సుప్రీం కోర్టులో జడ్జీల సంఖ్య పెంపు.. లోక్‌సభలో బిల్లు ఆమోదం!

ఇంజనీరింగ్ అభ్యర్థులకు గుడ్ న్యూస్..ఎయిర్‌పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియాలో ఉద్యోగాలు

డిగ్రీ అర్హతతో 11,403 క్లర్క్ పోస్టులు.. పూర్తి వివరాలివే !

కేరళలో విరిగిపడ్డ కొండచరియలు.. ‘బిగ్ టీవీ’ ప్రతినిధులకు తప్పిన పెను ప్రమాదం

నిరసనలకు జంతర్ మంతర్ గుడ్ బై? కొత్త వేదిక ఎక్కడ, సుప్రీంకోర్టులో పిటిషన్

Big Stories

Advertisement
×