E-Paper
Advertisement

పెద్ది స్పెషల్ సాంగ్ పై మృణాళ్ ఠాకూర్ రియాక్షన్ ..ఒక్క మాటతో క్లారిటీ ఇచ్చేసిందిగా?

పెద్ది స్పెషల్ సాంగ్ పై మృణాళ్ ఠాకూర్ రియాక్షన్ ..ఒక్క మాటతో  క్లారిటీ ఇచ్చేసిందిగా?
Advertisement

Mrunal Thakur: మృణాళ్ ఠాకూర్ ప్రస్తుతం బాలీవుడ్ సినిమాలతో పాటు సౌత్ సినిమాలలో కూడా నటిస్తూ కెరియర్ పరంగా ఎంతో బిజీగా ఉన్నారు. ఇక ఈమె త్వరలోనే తెలుగులో అడివి శేష్ (Adivi Sesh)హీరోగా నటించిన డెకాయిట్(Dacoit) సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతున్నారు. ఈ సినిమా ఏప్రిల్ 10వ తేదీ విడుదల కాబోతున్న నేపథ్యంలో ప్రమోషన్ కార్యక్రమాలను మొదలుపెట్టారు. ఈ సినిమా ప్రమోషన్లలో భాగంగా నేడు ట్రైలర్ లాంచ్ కార్యక్రమాన్ని నిర్వహించిన సంగతి తెలిసిందే. ఈ ట్రైలర్ లాంచ్ కార్యక్రమం ముంబైలో జరగగా ఈరోజు సాయంత్రం హైదరాబాదులో డెకాయిట్ ట్రైలర్ రేజ్ ఈవెంట్ నిర్వహించారు. ఇందులో భాగంగా మీడియా సమావేశంలో కూడా చిత్ర బృందం పాల్గొన్నారు.

పెద్ది కాదు.. డెకాయిట్ గురించి అడగండి..

ఈ మీడియా సమావేశంలో భాగంగా చిత్ర బృందానికి ఎన్నో ప్రశ్నలు ఎదురయ్యాయి.అయితే మృణాళ్ ఠాకూర్ కు పెద్ది సినిమా(Peddi Movie) గురించి ప్రశ్నలు ఎదురయ్యాయి. మీరు పెద్ది సినిమాలో స్పెషల్ సాంగ్ చేయబోతున్నారు అంటూ చాలా బజ్ ఉంది. నిజమేనా మీరు పెద్ది సినిమాలో స్పెషల్ సాంగ్ చేస్తున్నారా? అంటూ ప్రశ్నలు ఎదురయ్యాయి. ఈ ప్రశ్నకు మృణాళ్ స్పందిస్తూ ఏదైనా అడగాలనుకుంటే డెకాయిట్ సినిమా గురించి అడగండి నేను వాటికోసం ఎదురు చూస్తున్నాను అంటూ పెద్ది స్పెషల్ సాంగ్ గురించి కనీసం మాట్లాడటానికి కూడా ఇష్టపడలేదు.

పెద్ది స్పెషల్ సాంగ్ పై స్పందించని మృణాళ్..

Advertisement

ఇలా పెద్ద స్పెషల్ సాంగ్ గురించి మృణాళ్ స్పందించకపోవడంతో ఈమె పక్కాగా పెద్ది సినిమాలో స్పెషల్ సాంగ్ చేస్తున్నారని, అందుకే సమాధానం చెప్పలేదు అంటూ అభిమానులు భావిస్తున్నారు. ఒకవేళ పెద్ది స్పెషల్ సాంగ్ చేయకపోయి ఉంటే నిర్మొహమాటంగా తనని ఎవరు అప్రోచ్ అవ్వలేదని సమాధానం చెప్పి ఉండేది కానీ, పెద్ది స్పెషల్ సాంగ్ గురించి మాట్లాడటానికి కూడా ఇష్టపడకపోవడంతో ఖచ్చితంగా రామ్ చరణ్ (Ramcharan)జోడిగా మృణాళ్ స్పెషల్ స్టెప్పులు వేయబోతున్నారు అంటూ అభిమానులు కూడా ఓ క్లారిటీకి వచ్చేసారు. ఇక ఈ విషయం గురించి పెద్ది చిత్ర బృందం నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.

అనుకున్న సమయానికి పెద్ది వస్తాడా?

Advertisement

పెద్ద సినిమా కూడా దాదాపు షూటింగ్ పనులు పూర్తి అయ్యాయి కేవలం ఒక సాంగ్ షూటింగ్ మాత్రమే మిగిలి ఉందని తెలుస్తోంది. ఎలాగైనా ఈ సినిమాని ముందుగా అనుకున్న విధంగానే ఏప్రిల్ 30వ తేదీ ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి చిత్ర నిర్మాతలు గట్టి ప్రయత్నాలు చేస్తున్నారు. మరి సినిమా షూటింగ్ అన్ని పూర్తి చేసుకుని, అనుకున్న విధంగానే ఏప్రిల్ 30వ తేదీ పెద్ది వస్తారా? లేదా? అనేది తెలియాల్సి ఉంది.

Also Read: పీకల్లోతు ప్రేమలో మృణాళ్ ఠాకూర్..హద్దులు దాటే సమయం రాబోతుందంటూ !

Related News

కూతురికి మంత్రాలు నేర్పిస్తున్న ప్రియాంక చోప్రా.. వీడియో వైరల్!

అక్క రెడీ అంటోంది… మరి నువ్వెక్కడ మోక్షజ్ఞ?

ఇంకా ఆమె మాటే వింటున్నావా..? తమ్ముడిని ఆటాడేసుకున్న సల్మాన్!

ఈ హీరోయిన్ల బ్యాగ్‌ల రేట్లు చూస్తే షాక్ అవ్వాల్సిందే!

రష్మిక హెల్త్‌పై బిగ్ అప్‌డేట్.. గాయం తర్వాత మొదటిసారి స్పందన!

మళ్లీ అదే కథేనా… ‘ఫౌజీ’ రిలీజ్‌పై ఫ్యాన్స్ టెన్షన్!

నేనో దొంగనాకొడుకు అంటున్న లిటిల్ హార్ట్స్ మౌళి !

బేబీ బంప్‌తో కనిపించిన సమంత.. ఫొటో వైరల్!

Big Stories

Advertisement
×