E-Paper
Advertisement

అమ్మ పెళ్లి సంబంధాలు చూస్తోందని.. ఊహించని షాక్ ఇచ్చిన కూతురు.. ఏం చేసిందంటే?

అమ్మ పెళ్లి సంబంధాలు చూస్తోందని.. ఊహించని షాక్ ఇచ్చిన కూతురు.. ఏం చేసిందంటే?
Advertisement

Viral Video: ఇంటర్నెట్ ప్రపంచంలో రోజూ ఎన్నో వింతలు, విశేషాలు చూస్తూనే ఉంటాం. కానీ, పెళ్లి నుంచి తప్పించుకోవడానికి ఒక అమ్మాయి చేసిన క్రేజీ ప్లాన్ చూస్తే మాత్రం ఎవరైనా సరే నోరెళ్లబెట్టాల్సిందే.. సాధారణంగా పెళ్లి అనగానే కొందరు మురిసిపోతే, మరికొందరు మాత్రం “అమ్మో… ఇప్పుడే వద్దు బాబోయ్” అని పారిపోతుంటారు. అయితే, ఇక్కడొక అమ్మాయి ఏకంగా తన తల నీలాలను త్యాగం చేసి సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా నిలిచింది.

పెళ్లి చూపులా? అయితే గుండు బాస్!
“మా అమ్మ నా పెళ్లి చేయాలని తెగ ప్రయత్నిస్తోంది.” అనే క్యాప్షన్‌తో ఓ యువతి షేర్ చేసిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ హల్‌చల్ చేస్తోంది. ఇంట్లో పెళ్లి సంబంధాలు చూస్తున్నారని తెలిసి, ఎలాగైనా ఆ పెళ్లి చూపులను చెడగొట్టాలని డిసైడ్ అయిపోయింది ఆ కిలాడీ లేడీ. అందుకోసం ఆమె ఎంచుకున్న మార్గం ఏంటో తెలుసా? నేరుగా సెలూన్‌కి వెళ్లి జుట్టునంతా కత్తిరించుకుని, గుండు చేయించుకుంది. పెళ్లి చూపులకి వచ్చే అబ్బాయిలు గుండు చూసి పారిపోవాలనేది ఆమె మాస్టర్ ప్లాన్ కావచ్చు. ఈ సాహసోపేతమైన నిర్ణయానికి సంబంధించిన వీడియో ఇప్పుడు నెట్టింట తెగ వైరల్ అవుతోంది.

Advertisement

నెటిజన్ల ఫన్నీ కామెంట్స్.. నువ్వు తోపు గురూ!
ఈ వీడియో చూసిన నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తూ నవ్వుల పువ్వులు పూయిస్తున్నారు. “అరేంజ్డ్ మ్యారేజ్ నుంచి తప్పించుకోవడానికి ఇంతకంటే బెస్ట్ ఐడియా మరొకటి లేదు బాస్” అంటూ కొందరు ఆమె తెలివికి జోహార్లు అర్పిస్తుంటే.. మరికొందరు మాత్రం కాస్త ఎమోషనల్‌గా కనెక్ట్ అయ్యారు. “నచ్చని పెళ్లి చేసుకుని ఒక అబ్బాయి జీవితాన్ని, నీ జీవితాన్ని నాశనం చేయడం కంటే.. ఇలా క్లియర్‌గా నో చెప్పడం చాలా మంచి నిర్ణయం” అంటూ ఆమె బోల్డ్‌నెస్‌ను మెచ్చుకుంటున్నారు.

జీవితాంతం గుండుతోనే ఉంటావా తల్లి?
మెచ్చుకునే వాళ్లు ఒకవైపు ఉంటే, లాజిక్కులు మాట్లాడే బ్యాచ్ కూడా రంగంలోకి దిగింది. “సరే, ఈ పెళ్లి చూపుల గండం గట్టెక్కడానికి గుండు చేయించుకున్నావ్ సరే.. మరి మళ్లీ జుట్టు పెరిగాక ఇంట్లో వాళ్లు ఇంకో సంబంధం చూడరా? అప్పుడు ఏం చేస్తావ్? జీవితాంతం గుండుతోనే ఉండిపోతావా ఏంటి?” అంటూ నెటిజన్లు ఫన్నీగా లాజిక్ ప్రశ్నలు సంధిస్తున్నారు. ఏది ఏమైనా, పెళ్లి ప్రెజర్ తట్టుకోలేక ఈ అమ్మాయి చేసిన పని మాత్రం ప్రస్తుతం సోషల్ మీడియాలో పెద్ద చర్చకే దారితీసింది.

Advertisement

పెళ్లి భయాలు.. ట్రెండ్ మారుతోంది!
ఈ నవ్వుల వెనుక నేటితరం ఆలోచనలు కూడా స్పష్టంగా కనిపిస్తున్నాయి. పెళ్లి అనేది జీవితంలో ఒక ముఖ్యమైన ఘట్టం. కానీ, కెరీర్ సెట్ కాకుండా, మానసికంగా సిద్ధపడకుండా ఇంట్లో వాళ్లు బలవంతం చేస్తుంటే యువత ఎలాంటి క్రేజీ నిర్ణయాలైనా తీసుకోవడానికి వెనకాడటం లేదని ఈ ఘటన నిరూపిస్తోంది. ఏదేమైనా, సమస్యను కూర్చోబెట్టి తల్లిదండ్రులతో మాట్లాడి ఒప్పించడం కంటే.. ఇలా గుండుతో షాక్ ఇవ్వడం మాత్రం ఈ డిజిటల్ కాలంలో ఒక ట్రెండ్ సెట్టింగ్ “మ్యారేజ్ ఎస్కేప్ ప్లాన్” అని చెప్పక తప్పదు.

Also Read:హైదరాబాద్ లులు మాల్‌లో గన్‌తో హల్‌చల్.. పార్కింగ్‌ గొడవతో అసలు గుట్టు రట్టు!

Related News

ప్రధాని మోడీ ఇంటి ముట్టడికి కేజ్రీవాల్ బిగ్ స్కెచ్.. E20 పెట్రోల్‌పై కేజ్రీవాల్ సమరం

బీహార్‌లో బీజేపీకి బిగ్ షాక్.. భారీ మెజారిటీతో ప్రశాంత్ కిషోర్ గెలుపు

పెళ్లే కానక్కర్లేదు.. సహజీవనానికి ఆ చట్టం వర్తిస్తుంది.. సుప్రీంకోర్టు సంచలనం

సుప్రీం కోర్టులో జడ్జీల సంఖ్య పెంపు.. లోక్‌సభలో బిల్లు ఆమోదం!

ఇంజనీరింగ్ అభ్యర్థులకు గుడ్ న్యూస్..ఎయిర్‌పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియాలో ఉద్యోగాలు

డిగ్రీ అర్హతతో 11,403 క్లర్క్ పోస్టులు.. పూర్తి వివరాలివే !

కేరళలో విరిగిపడ్డ కొండచరియలు.. ‘బిగ్ టీవీ’ ప్రతినిధులకు తప్పిన పెను ప్రమాదం

నిరసనలకు జంతర్ మంతర్ గుడ్ బై? కొత్త వేదిక ఎక్కడ, సుప్రీంకోర్టులో పిటిషన్

Big Stories

Advertisement
×