E-Paper
Advertisement

ఊసరవెల్లిలా రంగులు మార్చే పర్వతం..నిజంగా ప్రకృతి సృష్టించిన అద్భుతం!

ఊసరవెల్లిలా రంగులు మార్చే పర్వతం..నిజంగా ప్రకృతి సృష్టించిన అద్భుతం!
Advertisement

Iconic Colour Changing Mountain: ప్రపంచంలో ఎన్నో అద్భుతమైన సహజ ప్రదేశాలు ఉన్నాయి. వాటిలో కొన్ని అద్భుతాలను చూస్తే, నిజంగా ఆశ్చర్యం కలిగిస్తాయి. ప్రకృతి చేసే మాయ చూస్తే మతిపోతుంది. అలాంటిదే ఇప్పుడు మనం చెప్పుకోబోయే రంగులు మార్చే పర్వతం. సాధారణంగా పర్వతాలు ఏదో ఒకరంగులో ఉండటం చూస్తుంటాం. కానీ, ఆస్ట్రేలియాలోని ఉలూరు పర్వతం ప్రపంచంలోనే అరుదైన పర్వతం. ఒకప్పుడు ఏయర్స్ రాక్ పేరుతో ప్రసిద్ధి చెందిన ఈ భారీ ఏకశిల, గంటకో రంగు మార్చుతూ ఆకట్టుకుంటుంది. సూర్యకాంతిని బట్టి ఉదయం నుంచి సాయంత్రం వరకు విభిన్న రంగుల్లో కనిపిస్తూ సందర్శకులను ఆశ్చర్యపరుస్తుంది. అందుకే ఉలూరును ప్రపంచంలోని అత్యంత ప్రత్యేకమైన ప్రకృతి అద్భుతాల్లో ఒకటిగా పరిగణిస్తారు.

సూర్యకాంతిని బట్టి రంగుల్లో మార్పు

ఆస్ట్రేలియా ఉత్తర భూభాగంలోని ఎడారి ప్రాంతంలో ఉన్న ఈ భారీ ఇసుకరాతి ఏకశిల వేలాది ఏళ్లుగా తన అద్భుతాలను ప్రదర్శిస్తూనే ఉంది. బయటకు చూస్తే ఇది సాధారణ రాతిబండలా కనిపించినా, సూర్యుడు మారుతున్న కొద్దీ దీని రంగులు కూడా మారుతాయి. నిజానికి రాయి రంగు మారదు. అయితే, సూర్యకిరణాలు పడే కోణం, కాంతి తీవ్రత మారడం వల్ల అది ప్రతి సమయంలో కొత్త రంగులో మెరిసిపోతుంది.

రంగుల వెనుక దాగి ఉన్న సైన్స్

Advertisement

ఉలూరులో ఈ రంగుల మార్పు వెనుక శాస్త్రీయ కారణం కూడా ఉంది. ఈ రాతిలో ఇనుప ఖనిజాలు అధికంగా ఉంటాయి. కాలక్రమంలో అవి ఆక్సీకరణం చెందడంతో రాతికి ప్రత్యేకమైన ఎరుపు రంగు వచ్చింది. సూర్యోదయం, మధ్యాహ్నం, సూర్యాస్తమయం సమయంలో కాంతి వేర్వేరు కోణాల్లో పడటం వల్ల ఎరుపు, నారింజ, గులాబీ, ఊదా లాంటి రంగులు కనిపిస్తాయి. సూర్యోదయం సమయంలో ఉలూరు లేత గులాబీ రంగులో మెరిసిపోతుంది. ఉదయం సూర్యుడు పైకి రావడంతో ఆరెంజ్ కలర్ కనిపిస్తుంది. మధ్యాహ్నం వేళ లేత ఎరుపు రంగులో కనిపించే ఈ పర్వతం, సూర్యాస్తమయం సమయానికి ముదురు ఎరుపు, ఊదా రంగుల మేళవింపుతో అద్భుతమైన దృశ్యాన్నిఆవిష్కరిస్తుంది. ఈ రంగుల మార్పును ప్రత్యక్షంగా చూడటానికి ప్రపంచం నలుమూలల నుంచి పర్యాటకులు ఇక్కడికి వస్తుంటారు.

ఉలూరు కేవలం ఒక పర్యాటక ప్రదేశం మాత్రమే కాదు. ఇది స్థానిక అనాంగు ఆదివాసీ ప్రజలకు అత్యంత పవిత్రమైన స్థలం. వేల సంవత్సరాలుగా వారు ఈ ప్రాంతాన్ని తమ సాంస్కృతిక వారసత్వంలో భాగంగా భావిస్తున్నారు. ఈ ప్రాంతంలో అనేక పవిత్ర ప్రదేశాలు, పురాతన రాతి చిత్రాలు, సంప్రదాయాలకు సంబంధించిన ఆనవాళ్లు ఇప్పటికీ కనిపిస్తాయి. అందుకే ఇక్కడికి వచ్చే సందర్శకులు స్థానిక సంస్కృతిని గౌరవించాలని అధికారులు సూచిస్తుంటారు.

ఎప్పుడు వెళ్తే బాగుంటుందంటే?   

Advertisement

ఉలూరును సందర్శించడానికి మే నుంచి సెప్టెంబర్ వరకు కాలం అత్యంత అనుకూలంగా భావిస్తారు. ఈ సమయంలో వాతావరణం చల్లగా ఉండటంతో ఎడారి ప్రాంతంలో ప్రయాణం సౌకర్యంగా ఉంటుంది. ముఖ్యంగా సూర్యోదయం, సూర్యాస్తమయం వేళ ఉలూరు రంగులు మారే దృశ్యాన్ని చూడడం జీవితాంతం గుర్తుండిపోయే అనుభూతిని ఇస్తుంది. రోజంతా మారుతున్న రంగులతో కనువిందు చేసే ఈ పర్వతం, ఆస్ట్రేలియాకు వెళ్లే ప్రతి ఒక్కరు తప్పక చూడాల్సిన అద్భుత గమ్యస్థానంగా చెప్పుకోవచ్చు.

Read Also: నల్లగొండలో ఆర్జాలబావి.. ఈ పేరు వెనుక ఇంత ఆసక్తికరమైన చరిత్ర ఉందా?

Related News

శ్రీలంకలో సీతమ్మ గుడి.. రామాయణంలో అశోకవాటిక ఇక్కడే.. లంక టూర్ వేసేయండి

విదేశీ ట్రిప్‌లో రోమింగ్, ఛార్జింగ్ టెన్షన్ ఉండకూడదంటే.. ఈ 5 గాడ్జెట్స్ మీ వద్ద ఉండాల్సిందే!

సరిహద్దు దాటకుండానే.. విదేశాలకు వెళ్లిన ఫీల్.. దేశంలోని 5 నెవర్ బిఫోర్ టౌన్స్!

కేరళలో భారీ వర్షాలు.. శబరిమల భక్తులకు ప్రభుత్వం కీలక సూచనలు!

జస్ట్.. పాస్‌ పోర్ట్ ఉంటే చాలు.. వీసా లేకుండా ఇండియన్స్ ఈ 27 దేశాలకు వెళ్లొచ్చు!

విశాఖ-బెంగళూరు వందే భారత్ స్లీపర్‌.. సౌత్ కోస్ట్ రైల్వే కీలక ప్రకటన!

ఉల్కాపాతం నుంచి పుట్టిన అద్భుతం.. 50 వేల ఏళ్లనాటి ఈ అరుదైన సరస్సు గురించి మీకు తెలుసా?

దుబాయ్, మక్కా టు చైనా.. ప్రపంచంలోని అత్యంత ఎత్తైన 5 భవనాలు.. వీటి పొడవు ఎంతో తెలుసా?

Big Stories

Advertisement
×