E-Paper
Advertisement

Breaking: కుప్పకూలిన హెలికాప్టర్.. మంత్రులు మృతి

Breaking: కుప్పకూలిన హెలికాప్టర్.. మంత్రులు మృతి
Advertisement

Breaking: ఘనాలో ఘోర హెలికాప్టర్ ప్రమాదం జరిగింది. సైనిక హెలికాప్టర్ కుప్పకూలి ఇద్దరు క్యాబినెట్ మంత్రులతో సహా ఎనిమిది మంది మృతి చెందారు. సెంట్రల్ ఆశాంతి ప్రాంతంలో జరిగిన ప్రమాదంలో రక్షణ మంత్రి ఎడ్వర్డ్ ఒమానే బోమా, పర్యావరణ మంత్రి ఇబ్రహీం ముర్తాల ముహమ్మద్ చనిపోయారు. సమాచారం అందుకున్న అధికారులు ప్రమాద స్థలంలో సహాయ చర్యలు చేపట్టారు. శిథిలాల తొలగింపు కొనసాగుతోంది. ఈ సంఘటనను అక్కడి ప్రభుత్వం జాతీయ విషాదంగా ప్రకటించింది. ఇద్దరు మంత్రులు మృతి చెందడంతో అక్కడి ప్రభుత్వం ఈ ఘటనపై విచారణకు ఆదేశించింది

Also Read: కాంగ్రెస్‌లో ఫైర్ బ్రాండ్లుగా ఫోకస్ అవుతున్న కోమటిరెడ్డి బ్రదర్స్

Advertisement

జాతీయ విషాదంగా ప్రకటించిన ఘనా ప్రభుత్వం
అయితే ముగ్గురు సిబ్బంది సహా ఎనిమిది మందితో Z-9 హెలికాప్టర్ రాజధాని అక్రా నుండి ఒబువాసికి బయల్దేరింది. టేకాఫైన కాసేపటికే హెలికాప్టర్ ఏటీసీతో కమ్యూనికేషన్ తెగిపోయి క్రాష్ అయింది. ఈ ప్రమాదానికి గల కారణాన్ని అధికారులు ఇంకా నిర్ధారించలేదు. మృతుల్లో ఘనా డిప్యూటీ నేషనల్ సెక్యూరిటీ కోఆర్డినేటర్ మునీర్ మహమ్మద్, నేషనల్ డెమోక్రటిక్ కాంగ్రెస్ పార్టీ వైస్ ఛైర్మన్ శామ్యూల్‌తో పాటు ఇతర సిబ్బంది ఉన్నట్లు అధికారులు వెల్లడించారు. బోమా నివాసంతో పాటు పార్టీ ప్రధాన కార్యాలయానికి సంతాప సందేశాలు వచ్చాయి. ఘనా ప్రభుత్వం ఈ ప్రమాదాన్ని జాతీయ విషాదంగా అభివర్ణించింది.

Related News

ప్రధాని మోడీ ఇంటి ముట్టడికి కేజ్రీవాల్ బిగ్ స్కెచ్.. E20 పెట్రోల్‌పై కేజ్రీవాల్ సమరం

బీహార్‌లో బీజేపీకి బిగ్ షాక్.. భారీ మెజారిటీతో ప్రశాంత్ కిషోర్ గెలుపు

పెళ్లే కానక్కర్లేదు.. సహజీవనానికి ఆ చట్టం వర్తిస్తుంది.. సుప్రీంకోర్టు సంచలనం

సుప్రీం కోర్టులో జడ్జీల సంఖ్య పెంపు.. లోక్‌సభలో బిల్లు ఆమోదం!

ఇంజనీరింగ్ అభ్యర్థులకు గుడ్ న్యూస్..ఎయిర్‌పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియాలో ఉద్యోగాలు

డిగ్రీ అర్హతతో 11,403 క్లర్క్ పోస్టులు.. పూర్తి వివరాలివే !

కేరళలో విరిగిపడ్డ కొండచరియలు.. ‘బిగ్ టీవీ’ ప్రతినిధులకు తప్పిన పెను ప్రమాదం

నిరసనలకు జంతర్ మంతర్ గుడ్ బై? కొత్త వేదిక ఎక్కడ, సుప్రీంకోర్టులో పిటిషన్

Big Stories

Advertisement
×