E-Paper
Advertisement

Ex Mla CPR In Flight: ఇండిగో విమానంలో ప్రయాణికురాలికి అస్వస్థత.. సీపీఆర్ చేసి ప్రాణాలు కాపాడిన మాజీ ఎమ్మెల్యే

Ex Mla CPR In Flight: ఇండిగో విమానంలో ప్రయాణికురాలికి అస్వస్థత.. సీపీఆర్ చేసి ప్రాణాలు కాపాడిన మాజీ ఎమ్మెల్యే
Advertisement

Ex Mla CPR In Flight: గోవా నుంచి దిల్లీ వెళ్తున్న ఇండిగో విమానం గాల్లో ఉండగా ఒక ప్రయాణికురాలు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ఆ సమయంలో విమానంలోనే ఉన్న కాన్పూర్ మాజీ ఎమ్మెల్యే డాక్టర్ అంజలి నింబాల్కర్ వెంటనే స్పందించారు. బాధితురాలికి సీపీఆర్ చేసి ప్రాణాలు నిలబెట్టారు. డాక్టర్ అంజలి నింబాల్కర్ సాయంపై సోషల్ మీడియాలో ప్రశంసలు కురుస్తున్నాయి. మాజీ ఎమ్మెల్యే అంజలిపై కర్ణాటక సీఎం సిద్ధరామయ్య ప్రశంసలు కురిపించారు.

సీపీఆర్ చేసి ప్రాణాలు కాపాడి

గోవా-దిల్లీ ఇండిగో విమానంలో టేకాఫ్ అయిన కాసేపటికే కాలిఫోర్నియాకు చెందిన జెన్నీ ఒక్కసారిగా కుప్పకూలిపోయారు. అదే విమానంలో ఉన్న మాజీ ఎమ్మెల్యే డాక్టర్ అంజలి వెంటనే ఆ మహిళకు సీపీఆర్ చేసి రక్షించారు. డాక్టర్ అంజలి ప్రయత్నంతో అరగంట తర్వాత ప్రయాణికురాలు సాధారణ స్థితికి చేరుకున్నారు. విమానం దిల్లీలో లాండ్ అయిన వెంటనే అంబులెన్స్‌ లో ఆసుపత్రికి తరలించారు. అప్పటి వరకు జెన్నీని డాక్టర్ అంజలి పర్యవేక్షించారు.

Advertisement

కర్ణాటక సీఎం ప్రశంసలు

డాక్టర్ అంజలి సేవను అభినందిస్తూ కర్ణాటక సీఎం సిద్ధరామయ్య ఎక్స్‌లో ప్రశంసించారు. ఈ ఘటన చాలా స్ఫూర్తిదాయకమని, అధికారంలో ఉన్నా లేకపోయినా అంజలి వంటి నేతలు నిజమైన ప్రజాసేవకు ఉదాహరణగా నిలుస్తారన్నారు. కర్ణాటక కాంగ్రెస్‌ కూడా అంజలి సేవలను ప్రశంసిస్తూ పోస్టు పెట్టింది. నిజమైన ప్రజాసేవకు పదవులు, హోదాతో సంబంధం లేదని కితాబిచ్చింది. సోషల్ మీడియాలో ఈ వీడియో వైరల్ అవుతుంది. అంజలి చేసిన పనికి నెటిజన్లు ప్రశంసిస్తున్నారు.

Advertisement

Also Read: NH-45 Red Road: వన్యప్రాణుల రక్షణకు ‘రెడ్ రోడ్డు’.. దేశంలోనే తొలిసారిగా ఎంపీలో.. స్పెషాలిటీ ఏంటంటే?

Related News

ప్రధాని మోడీ ఇంటి ముట్టడికి కేజ్రీవాల్ బిగ్ స్కెచ్.. E20 పెట్రోల్‌పై కేజ్రీవాల్ సమరం

బీహార్‌లో బీజేపీకి బిగ్ షాక్.. భారీ మెజారిటీతో ప్రశాంత్ కిషోర్ గెలుపు

పెళ్లే కానక్కర్లేదు.. సహజీవనానికి ఆ చట్టం వర్తిస్తుంది.. సుప్రీంకోర్టు సంచలనం

సుప్రీం కోర్టులో జడ్జీల సంఖ్య పెంపు.. లోక్‌సభలో బిల్లు ఆమోదం!

ఇంజనీరింగ్ అభ్యర్థులకు గుడ్ న్యూస్..ఎయిర్‌పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియాలో ఉద్యోగాలు

డిగ్రీ అర్హతతో 11,403 క్లర్క్ పోస్టులు.. పూర్తి వివరాలివే !

కేరళలో విరిగిపడ్డ కొండచరియలు.. ‘బిగ్ టీవీ’ ప్రతినిధులకు తప్పిన పెను ప్రమాదం

నిరసనలకు జంతర్ మంతర్ గుడ్ బై? కొత్త వేదిక ఎక్కడ, సుప్రీంకోర్టులో పిటిషన్

Big Stories

Advertisement
×