E-Paper
Advertisement

Keralam Politics: కేరళం కొత్త సీఎంపై ఉత్కంఠ.. రేసులో ముగ్గురు సీనియర్లు, తెరపైకి కొత్త ఫార్ములా!

Keralam Politics: కేరళం కొత్త సీఎంపై ఉత్కంఠ.. రేసులో ముగ్గురు సీనియర్లు, తెరపైకి కొత్త ఫార్ములా!
Advertisement

Keralam Politics: కేరళం కొత్త సీఎం ఎవరు? కాంగ్రెస్ పార్టీ నుంచి ముగ్గురు నేతలు రేసులో ఉన్నారా? హైకమాండ్ ఎవరి వైపు మొగ్గు చూపుతుంది? ఒక సీఎం, ఇద్దరు డిప్యూటీ సీఎం కాన్సెఫ్ట్ తీసుకొస్తుందా? ఏఐసీసీ పరిశీలకులు నిర్ణయం ప్రకారం హైకమాండ్ మొగ్గు చూపుతుందా? అవుననే అంటున్నారు పార్టీ నేతలు.

కేరళం కొత్త సీఎంపై ఉత్కంఠ.. రేసులో ముగ్గురు సీనియర్లు

Advertisement

కేరళం కొత్త ముఖ్యమంత్రి ఎవరన్న దానిపై కాంగ్రెస్ పార్టీలో ఉత్కంఠ మొదలైంది. తొలుత ఐదుగురు పేర్లు బయటకు రాగా, బుధవారం నాటికి ఐదుగురు కాస్త ముగ్గురికి చేరారు. వారంతా కాంగ్రెస్ పార్టీలో సీనియర్ నేతలు, పార్టీని నమ్ముకుని ఉన్నవారు ఉన్నారు. వారంతా ఎన్నికల్లో గెలిచినవారు కూడా. ముఖ్యమంత్రి రేసులో వీడి సతీషన్, రమేష్ చెనితల, కేసీ వేణుగోపాల్ వంటి నేతలు ఉన్నారు.

వీరిలో ఎవరి వైపు మొగ్గు చూపాలో కాంగ్రెస్ పార్టీ ఆలోచనలో పడింది. పార్టీ అధికారంలోకి రావడం వెనుక ముగ్గురు నేతలు కీలక పాత్ర పోషించారు. ఈ నేపథ్యంలో సీఎం ఎంపిక అధిష్టానికి కత్తిమీద సాముగా మారింది. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి అభ్యర్థి ఎవరనే దానిపై ఏఐసీసీ పరిశీలకులు అజయ్ మాకెన్, ముకుల్ వాస్నిక్ కేరళ వెళ్తున్నారు. పర్యటనకు ముందు పార్టీ చీఫ్ మల్లిఖార్జున ఖర్గే‌తో ఇద్దరు నేతలు సమావేశమయ్యారు.

Advertisement

తెరపైకి కొత్త ఫార్ములా! సీఎం.. డిప్యూటీ సీఎంలు

ముఖ్యమంత్రి రేసులో ముందు ఉన్నారు వీడీ సతీషన్. ఇదిలావుండగా అధిష్టానం పెద్దలను కలిసేందుకు ఢిల్లీకి చేరుకున్నారు మరొక సీనియర్ నేత రమేష్ చెనితాల. మరొక సీనియర్ నేత కేసీ వేణుగోపాల్ నిత్యం కాంగ్రెస్ పెద్దలతో టచ్‌లో ఉంటారు. అంతేకాదు ఏ రాష్ట్రాల కాంగ్రెస్ నేతలు ఢిల్లీకి వెళ్లినా తొలుత కేసీ వేణుగోపాల్‌ని కలవాల్సిందే.

ఈ నేపథ్యంలో కాంగ్రెస్ హైకమాండ్ ఎవరి వైపు మొగ్గు చూపుతుందనేది ఆసక్తికరంగా మారింది. ఇదిలావుండగా ఢిల్లీ పొలిటికల్ సర్కిల్స్ లో మరొక వార్త చక్కర్లు కొడుతోంది. ముఖ్యమంత్రి ఒకరు.. ఇద్దరు డిప్యూటీ సీఎంలను పరిశీలన చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ ముగ్గురు నేతల్లో సీఎం ఎవరు, డిప్యూటీ సీఎం ఎవరు అనేది తేలాల్చివుంది.

ALSO READ: బెంగాల్ రాజకీయాల్లో హైడ్రామా.. గవర్నర్‌తో ఎన్నిక‌ల ప్ర‌ధానాధికారి భేటీ.. మమతాపై వేటుకు రంగం సిద్ధం!

Related News

ప్రధాని మోడీ ఇంటి ముట్టడికి కేజ్రీవాల్ బిగ్ స్కెచ్.. E20 పెట్రోల్‌పై కేజ్రీవాల్ సమరం

బీహార్‌లో బీజేపీకి బిగ్ షాక్.. భారీ మెజారిటీతో ప్రశాంత్ కిషోర్ గెలుపు

పెళ్లే కానక్కర్లేదు.. సహజీవనానికి ఆ చట్టం వర్తిస్తుంది.. సుప్రీంకోర్టు సంచలనం

సుప్రీం కోర్టులో జడ్జీల సంఖ్య పెంపు.. లోక్‌సభలో బిల్లు ఆమోదం!

ఇంజనీరింగ్ అభ్యర్థులకు గుడ్ న్యూస్..ఎయిర్‌పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియాలో ఉద్యోగాలు

డిగ్రీ అర్హతతో 11,403 క్లర్క్ పోస్టులు.. పూర్తి వివరాలివే !

కేరళలో విరిగిపడ్డ కొండచరియలు.. ‘బిగ్ టీవీ’ ప్రతినిధులకు తప్పిన పెను ప్రమాదం

నిరసనలకు జంతర్ మంతర్ గుడ్ బై? కొత్త వేదిక ఎక్కడ, సుప్రీంకోర్టులో పిటిషన్

Big Stories

Advertisement
×