E-Paper
Advertisement

హోరెత్తిన కేరళ వీధులు.. రాజకీయ వైరం మరిచి.. ఒక్కటైన ప్రత్యర్థి పార్టీలు!

హోరెత్తిన కేరళ వీధులు.. రాజకీయ వైరం మరిచి.. ఒక్కటైన ప్రత్యర్థి పార్టీలు!
Advertisement

Kalashakkottu Festival: ప్రస్తుత రాజకీయాల్లో పొలిటికల్ పార్టీలు ఒకదానికొకటి భద్ర శత్రువులుగా భావిస్తున్నాయి. అధికార పార్టీ.. ప్రతిపక్ష నేతలను కేసులతో ఉక్కిరిబిక్కిరి చేస్తున్న విధానం.. దాదాపు ప్రతీ రాష్ట్రంలోనూ కనిపిస్తోంది. అయితే కేరళలోని ఓ ఆసక్తికర సంప్రదాయం ప్రధానంగా అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. రాష్ట్రంలోని అన్ని పొలిటికల్ పార్టీలు.. ఒకేచోట చేరి సంబురాలు చేసుకునే ‘కళాశక్కొట్టు’ విధానం ఆశ్చర్యం కలిగిస్తోంది. ఈ దృశ్యాలు.. ప్రజాస్వామ్య పోకడలకు అద్దం పడుతున్నాయి.

కళాశక్కొట్టు అంటే ఏంటి..?

మలయాళంలో ‘కళాశం’ అంటే ముగింపు, ‘కొట్టు’ అంటే వాయిద్యాల హోరు అని అర్థం. ఎన్నికల వేళ బహిరంగ ప్రచారం ముగియడానికి సరిగ్గా గంట లేదా రెండు గంటల ముందు.. రాష్ట్రంలోని ప్రధాన రాజకీయ పార్టీలు ఈ ‘కళాశక్కొట్టు వేడుకలు’ జరుపుకుంటాయి. కేరళలోని ప్రధాన పార్టీలైన ఎల్‌డీఎఫ్ (లెఫ్ట్ డెమోక్రటిక్ ఫ్రంట్), యూడీఎఫ్ (యునైటెడ్ డెమోక్రటిక్ ఫ్రంట్), బీజేపీ కార్యకర్తలు ఆయా నియోజకవర్గాల్లోని ప్రధాన కూడళ్ల వద్దకు చేరుకొని.. ఎన్నికల్లో విజయం తమదేనంటూ కేరింతలు కొడుతుంటారు. ఇది గత దశాబ్దాల కాలంగా అనవాయితీగా కొనసాగుతూ వస్తోంది.

Advertisement

ఆరోగ్యకరమైన పోటీ

కళాశక్కొట్టు వేడుకలు.. పార్టీల మధ్య ప్రజాస్వామిక బంధాన్ని దృఢం చేస్తాయని కేరళ వాసులు నమ్ముతుంటారు. ప్రత్యర్థి పార్టీలు ఒకరికొకరు ఎదురుపడి.. తమ పార్టీ జెండాలను ఊపుతూ, నినాదాలు చేస్తూ పోటాపోటీగా ప్రచారం చేస్తారు. ఎంతటి రాజకీయ వైరం ఉన్నప్పటికీ.. శృతి మించకుండా ఒకే కూడలి వద్ద తమ బలాన్ని ప్రదర్శించడం ఈ వేడుకల ప్రత్యేకతగా చెప్పవచ్చు. కేరళ స్పెషల్ అయిన చెండ మేళం (కేరళ సాంప్రదాయ వాయిద్యం), డీజేలు, రంగుల కాగితాలు, పార్టీల జెండాలు, మిరుమిట్లు గొలిపే అలంకరణలతో ఆ ప్రాంతమంతా కోలాహలంగా మారుతుంది. ఇటీవల కేరళ ఎన్నికల ప్రచారం ముగింపు సందర్భంగానూ కళాశక్కొట్టు వేడుకలు దేశవ్యాప్తంగా అందరి దృష్టిని ఆకర్షించాయి.

ఆ ప్రాంతాల్లో మరింత జోష్!

Advertisement

ఇటీవల కేరళ ఎన్నికల ముగింపు సందర్భంగా కళాశక్కొట్టు వేడుకలతో పలు ప్రాంతాలు పెద్ద ఎత్తున వార్తల్లో నిలిచాయి. మరిముఖ్యంగా తిరువనంతపురంలోని నేమం, కజకూటం వంటి కీలక నియోజకవర్గాల్లో ఈ వేడుకలు అత్యంత వైభవంగా జరిగాయి. ఎన్నికల్లో విజయం తమదంటే తమదని LDF, UDF, బీజేపీ కార్యకర్తలు ఒకచోట చేరి.. కళాశక్కొట్టు వేడుకలు ఉత్సాహంగా జరుపుకున్నారు. సాధారణంగా ఇతర రాష్ట్రాల్లో ఎన్నికల ముగింపు సమయంలో ఉద్రిక్తతలు కనిపిస్తే.. కేరళలో మాత్రం అది ఒక వేడుకలా సాగనుండటం విశేషం. రాజకీయ సిద్ధాంతాలు వేరైనా, అందరూ కలిసి ప్రజాస్వామ్య పండుగను జరుపుకోవడం గొప్ప విషయమని రాజకీయ నిపుణులు ప్రశంసిస్తున్నారు.

Also Read: మార్కెట్లోకి వచ్చేసిన OnePlus Pad 4.. రూ. 5,000 డిస్కౌంట్.. ధర, ఫీచర్ల వివరాలివే!

కేరళ ఎన్నికల ఫలితాలు..

ఇదిలాఉంటే కేరళ ఎన్నికల ఫలితాలు మే 4వ తేదీన విడుదలైన సంగతి తెలిసిందే. పదేళ్లుగా అధికారంలో ఉన్న లెఫ్ట్‌ డెమొక్రటిక్‌ ఫ్రంట్‌ (LDF)కు ఈ ఎన్నికల్లో ఘోర పరాజయాన్ని మూటగట్టుకుంది. 140 స్థానాలకు గాను ఆ కూటమి కేవలం 35 స్థానాల్లో విజయం సాధించింది. మరోవైపు కాంగ్రెస్ నేతృత్వంలోని యునైటెడ్ డెమోక్రటిక్ ఫ్రంట్ (UDF).. ఏకంగా 102 స్థానాల్లో సత్తా చాటి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు సిద్ధమైంది. మరోవైపు బీజేపీ నేమం, కజకుట్టం, చత్తన్నూరు నియోజకవర్గాల్లో గెలుపొంది.. కేరళలో తొలిసారి 3 సీట్లను తన ఖాతాలో వేసుకొంది.

Also Read: భద్రతా స్థావరాలనే టార్గెట్ చేశారా? జలంధర్, అమృత్‌సర్‌లో పేలుళ్లు

Related News

ఒక‌రెనుక ఒక‌రు లైనుగ‌ట్టి.. ప‌ద‌హారు మంది లైన్లు గ‌ట్టి.. తెలంగాణ భ‌వ‌న్ కిట‌కిట‌..!

అధ్య‌క్షుల వారి కుంభ‌స్థ‌లాన్ని కొట్టిన కిశోర్‌.. నితిన్ ఇలాఖాలో ప్ర‌శాంత్ జంత‌ర్‌మంత‌ర్‌..!

అధ్య‌య‌నం.. పోరాటం.. జ‌నం నాడి తెలుసుకునేందుకు దేశ‌వ్యాప్త టూర్‌కు బొద్దింక‌ల ప్లాన్‌.. !

కాగ‌ల కార్యం సుప్రీం తీర్చ‌నుందా?.. ఇక జంత‌ర్ మంత‌ర్ ను ఎత్తేయ‌డ‌మే త‌రువాయా!?

ఇంజినీరింగ్ విద్యార్థుల చ‌దువు క్రిమిన‌ల్ వేస్ట్‌.. గోడ‌ల‌కు సున్నాలేసుకుని బ‌తికిన‌ రేవంతు..!

సీఎం ఎవ‌రిని ఎండ్రిన్ తాగ‌మ‌న్నాడు? కేటీఆర్‌నా..? నిరుద్యోగుల‌నా?? ఏది రైటు.. ఎవ‌రు కరెక్టు..??

క్షుద్ర‌పూజ‌లతో ప్ర‌భుత్వాలు ప‌డ‌గొట్టొచ్చా? క్షుద్ర రాజ‌కీయాల‌తో జ‌నానికి ఏం సందేశం ఇస్తున్నారు?

ఇత‌డు ఫామ్‌హౌజ్‌లోనే ఎందుకు? అత‌డు ఫామ్‌లో ఉన్నాడెందుకు!?

Big Stories

Advertisement
×